మేవాలాల్ చౌదరి బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.

మేవాలాల్ చౌదరి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
నవంబర్ 2015 – 2021 ఏప్రిల్ 19
ముందు కృష్ణనందన్ ప్రసాద్ వర్మ
తరువాత రాజీవ్ కుమార్ సింగ్
నియోజకవర్గం తారాపూర్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020 నవంబర్ 16 – 2020 నవంబర్ 21

వ్యక్తిగత వివరాలు

జననం 1953 జనవరి 4
ముంగేర్ జిల్లా, బీహార్ భారతదేశం
మరణం 2021 ఏప్రిల్ 19
పారాస్ హాస్పిటల్, పాట్నా
రాజకీయ పార్టీ జేడీయూ
జీవిత భాగస్వామి నీతా చౌదరి
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మేవాలాల్ చౌదరి 2010లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తారాపూర్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో నితీష్ కుమార్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు. ఆయనపై ప్రతిపక్షాల ఆరోపణల చేయడంతో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

మేవాలాల్ చౌదరి కరోనా పాజిటివ్ రావడంతో పాట్నాలోని పారాస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 19న మరణించాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. V6 Velugu (19 April 2021). "మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి కన్నుమూత". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (19 April 2021). "కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత, సీఎం సంతాపం". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.