జనతాదళ్ (యునైటెడ్)

జనతా దళ్ (యునైటెడ్) సంక్షిప్తంగా జెడి (యు) భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతదేశంలో రాజకీయ ఉనికిని కలిగి ఉంది. జనతా దళ్ (యునైటెడ్) పార్టీలో చీలిక కారణంగా రెండు వర్గాలుగా విడిపోయింది జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలోని జెడి (ఎస్), జనతాదళ్ (యునైటెడ్)గా ఉన్నాయి. ఈ పార్టీ ప్రముఖ నాయకులలో ఒకరైన నితీష్ కుమార్ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ కూటమి మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.[1][2]

జనతాదళ్
లోకసభ నాయకుడులలన్ సింగ్
రాజ్యసభ నాయకుడురామచంద్ర ప్రసాద్ సింగ్
స్థాపకులు
స్థాపన తేదీ30 అక్టోబరు 2003 (21 సంవత్సరాల క్రితం) (2003-10-30)
ప్రధాన కార్యాలయం7, జనతా మందిర్ రోడ్డు, ఢిల్లీ
రాజకీయ విధానంసోషలిజం, లౌకికవాదం
ఈసిఐ హోదా
కూటమి
లోక్‌సభలో సీట్లు
16 / 543
రాజ్యసభలో సీట్లు
5 / 245
Election symbol

జెడి (యు) బీహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తించబడింది అలాగే బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతిపక్ష పాటి హోదాలో ఉంది. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో జెడి (యు) 16 సీట్లు గెలుచుకుని, లోక్సభలో ఏడవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పార్టీ సోషలిజం, లౌకికవాదం అలాగే సమగ్ర మానవతావాదం సిద్ధాంతాలపై పనిచేస్తుంది.

చిహ్నం

మార్చు

జనతా దళ్ (యునైటెడ్) చిహ్నం ఆకుపచ్చరంగుతో కూడిన తెలుపు జెండాలో బాణం గుర్తు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీ 9,924,209 ఓట్లు (2.6%, 8 సీట్లు) గెలుచుకుంది.

చరిత్ర

మార్చు

1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనతాదళ్ (యునైటెడ్) ఏర్పాటుకు బీజాలు పడ్డాయి. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి జెహెచ్ పటేల్ నేతృత్వంలోని ఒక వర్గం జాతీయ ప్రజాస్వామ్య కూటమికి మద్దతు ఇచ్చింది, ఇది జనతాదళ్లో చీలికలకు దారితీసింది, హెచ్డి దేవేగౌడ ఆధ్వర్యంలో జనతాదళ్ (సెక్యులర్) ఏర్పడింది. శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ను జనతాదళ్ (యునైటెడ్) అని పిలుస్తారు.

జనతాదళ్, లోక్ శక్తి ఇంకా సమత పార్టీకి చెందిన శరద్ యాదవ్ వర్గం విలీనంతో జనతాదళ్ (యునైటెడ్) ఏర్పడింది. 2003 అక్టోబరు 30 న, జార్జ్ ఫెర్నాండెజ్, నితీష్ కుమార్ నేతృత్వంలోని సమతా పార్టీ జనతాదళ్ లో విలీనం అయ్యింది.[3]

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ జనతా దళ్ పార్టీ జనతాదళ్ (యునైటెడ్) లో విలీనమైంది.

నాయకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Janta Dal United (JD(U)) – Party History, Symbol, Founders, Election Results and News". www.elections.in. Archived from the original on 2017-03-01. Retrieved 2021-06-30.
  2. "Nitish nod for Prashant Kishor and blessings for BJP". www.telegraphindia.com. Retrieved 2021-06-30.
  3. "Rediff On The NeT:Samata Party breaks away from JD (U)". www.rediff.com. Retrieved 2021-06-30.