మైఖేల్ వాండోర్ట్

శ్రీలంక క్రికెట్ ఆటగాడు

మైఖేల్ గ్రేడన్ వాండోర్ట్, శ్రీలంక క్రికెట్ ఆటగాడు.[1] ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు. టెస్ట్ క్రికెట్ ఆడిన అత్యంత పొడవైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఉన్నాడు. 2004, ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2]

మైఖేల్ వాండోర్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మైఖేల్ గ్రేడన్ వాండోర్ట్
పుట్టిన తేదీ (1980-01-19) 1980 జనవరి 19 (వయసు 44)
కొలంబో, శ్రీలంక
మారుపేరువాండ
ఎత్తు6 ft 5 in (1.96 m)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-పేస్
పాత్రబ్యాట్స్‌మెన్‌
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 87)2001 సెప్టెంబరు 6 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2008 డిసెంబరు 26 - బంగ్లాదేశ్ తో
ఏకైక వన్‌డే (క్యాప్ 128)2006 జనవరి 13 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1998–2011కొలంబో క్రికెట్ క్లబ్
2007–08వయాంబా
ఖేలాఘర్ సమాజ్ కళ్యాణ్ సమితి
2012రాగమ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 20 1 142 76
చేసిన పరుగులు 1,144 48 7,443 2,504
బ్యాటింగు సగటు 36.90 48.00 33.37 39.12
100లు/50లు 4/4 0/0 17/33 4/16
అత్యుత్తమ స్కోరు 140 48 226 118
వేసిన బంతులు 67
వికెట్లు 1
బౌలింగు సగటు 62.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/46
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 0/– 102/– 24/–
మూలం: ESPNcricinfo, 2009 డిసెంబరు 12

జననం మార్చు

మైఖేల్ గ్రేడన్ వాండోర్ట్ 1980, జనవరి 19న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. డచ్ బర్గర్ వంశానికి చెందినవాడు, సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువుకున్నాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్ మార్చు

2001 మార్చిలో ఇంగ్లాండ్‌పై శ్రీలంక తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2001, సెప్టెంబరులో ఆకట్టుకునే సెంచరీ చేసిన తర్వాత బంగ్లాదేశ్‌పై ఎంపికయ్యాడు.[4] అతని టెస్ట్ సగటు 36.90గా ఉంది. 2006, మే 28న ఇంగ్లాండ్‌తో శ్రీలంక ఓటమిలో శతకం సాధించాడు. 2001లో జావేద్ ఒమర్ తర్వాత మొత్తం ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన మొదటి బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రంలో 318 పరుగుల లక్ష్యంలో 117 బంతుల్లో 48 పరుగులు చేశాడు.[5] ఆ తరువాత, ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడేందుకు ఎంపికయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాపై 83 పరుగులు చేశాడు. మంచి స్లిప్స్ ఫీల్డర్‌గా పరిగణించబడ్డాడు. 2007లో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ (140, 105*) పరుగులు చేశాడు.

ముఖ్యంగా 2008-2009లో భారత్‌తో జరిగిన పేలవమైన ప్రదర్శనల కారణంగా అతను శ్రీలంక టెస్ట్ జట్టు నుండి తొలగించబడ్డాడు, అప్పటి నుండి అంతర్జాతీయ టెస్టుల్లో ఆడలేదు.

మూలాలు మార్చు

  1. "Michael Vandort Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  2. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-18.
  3. "Cricket: Vandort shines as Sri Lanka falter". 28 May 2006.
  4. "BAN vs SL, Asian Test Championship 2001/02, 2nd Match at Colombo, September 06 - 08, 2001 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  5. "AUS vs SL, VB Series 2005/06, 1st Match at Melbourne, January 13, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.