మైత్రేయుడు
మైత్రేయుడు భవిష్యత్తులో రాబోయే బుద్ధుడు (బోధిసత్వుడు).[1][2] టిబెట్ బౌద్ధ సాంప్రదాయంలో ఈయనను ఒక ప్రేమమూర్తిగా, దయామయుడిగా భావిస్తారు. మైత్రేయుడు అనే పేరు సంస్కృత పదమైన మైత్రి నుంచి వచ్చింది. ఇంకా ఈ పదం ఇండో ఇరానియన్ భాషల్లో మిత్ర అనే పదంతో సంబంధం కలిగి ఉంది. ఈయనను అన్ని బౌద్ధ సాంప్రదాయాలలోనూ గౌతమ బుద్ధుని భవిష్యత్తు అవతారమైన మైత్రేయ బుద్ధుడిగా భావిస్తారు. ఈ కల్పానికి ఐదవదీ, ఇంకా ఆఖరిదీ అయిన ఈ అవతారం ఈ భూమి మీద బౌద్ధ ధర్మాన్ని మళ్ళీ నెలకొల్పుతుందని బౌద్ధులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈయన బోధనలు కూడా శాక్యముని గౌతమబుద్ధుని లాగా ఉంటాయి.[3][4]
మూలాలు
మార్చు- ↑ Dharmachakra Translation Committee (2021). "Maitreya's Setting Out | Introduction". 84000 Translating The Words of The Buddha (in ఇంగ్లీష్). Retrieved 2024-02-08.
- ↑ Williams, Paul. Mahayana Buddhism: The Doctrinal Foundations 2nd edition. Routledge, 2009, p. 218.
- ↑ Horner (1975), The minor anthologies of the Pali canon, p. 97. Regarding Metteyya, Bv XXVII, 19: "I [Gautama Buddha] at the present time am the Self-Awakened One, and there will be Metteyya...."
- ↑ Buddha Dharma Education Association (2014). "Suttanta Pitaka: Khuddaka Nikāya: 14.Buddhavamsa-History of the Buddhas". Guide to Tipiṭaka. Tullera, NSW, Australia: Buddha Dharma Education Association. Retrieved 2014-12-21.