బోధిసత్వుడు అంటే బౌద్ధ మతంలో జాగృతి లేదా బుద్ధత్వం వైపు నడిచే వ్యక్తి.[1]

బోధిసత్వుడు
ఇండోనేషియా, సెంట్రల్ జావా లో 9వ శతాబ్దపు ప్లావోసన్ దేవాలయంలో చెక్కబడిన అవలోకితేశ్వర బోధిసత్వుడు.
Sanskritबोधिसत्त्व (bodhisattva)
Pāliबोधिसत्त (bodhisatta)
Burmeseဗောဓိသတ် (bɔ́dḭθaʔ)
Chinese菩薩/菩提薩埵, (pinyin: púsà/pútísàduǒ), (Jyutping: pou4 saat3/pou4 tai4 saat3 do3), (Wade–Giles: p'u2-sa4)
Japanese菩薩/菩提薩埵 (romaji: bosatsu/bodaisatta)
Khmerពោធិសត្វ (UNGEGN: poŭthĭsât)
Korean보살, 菩薩 / 보리살타, 菩提薩埵 (RR: bosal / borisalta)
Sinhalaබෝධි සත්ත්ව (bodhisatva)
TagalogBodisatta
ᜊᜓᜇ᜔ᜑᜒᜐᜆ
Thaiโพธิสัตว์ (phothisat)
Tibetanབྱང་ཆུབ་སེམས་དཔའ་ (jang chup sem pa)
VietnameseBồ Tát菩薩/Bồ-đề-tát-đóa菩提薩埵
Information
Venerated byTheravāda, Mahāyāna, Vajrayāna, Navayāna
లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

తొలినాటి బౌద్ధ సాంప్రదాయంలోనూ, ఆధునిక థేరవాదంలోనూ బోధిసత్వుడు లేదా బోధిసత్త అంటే బుద్ధుడు కావాలని సంకల్పం చేసుకున్నవాడు, ఇంకా సజీవుడైన మరో బుద్ధుడు కూడా అదే విషయాన్ని ధృవీకరించిన వాడు. మహాయాన బౌద్ధమతంలో, బోధిసత్వుడు అంటే సకల జీవుల ప్రయోజనం కోసం బుద్ధత్వాన్ని పొందాలనే స్వచ్ఛందమైన కోరిక (బోధిచిత్తం), కరుణతో కూడిన మనస్సును కలిగిన వాడు. మహాయాన బోధిసత్వులు ఆధ్యాత్మికంగా వీరోచిత వ్యక్తులు. వారు జాగృతిని సాధించడానికి ఘనమైన కృషి చేస్తారు. అవ్యాజమైన కరుణ వారిని నడిపిస్తుంది. వీరు నాలుగు దివ్య నివాసాలైన (బ్రహ్మవిహారాలు) ప్రేమపూర్వక దయ (మైత్రి), కరుణ, సానుభూతితో కూడిన ఆనందం (ముదితా), సమానత్వం (ఉపేక్ష) కలిగి ఉంటారు. అలాగే బోధిసత్వులకు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటాయి. ప్రజ్ఞాపరమితా ("అతీంద్రియ జ్ఞానం" లేదా "జ్ఞానం యొక్క పరిపూర్ణత") నైపుణ్యం కలిగిన సాధనాలు (ఉపాయాలు) మొదలైనవి ఈ లక్షణాలకు కొన్ని ఉదాహరణలు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Skilling, Peter (2021). Questioning the Buddha: A Selection of Twenty-Five Sutras, Introduction, Simon and Schuster.
  2. Flanagan, Owen (2011-08-12). The Bodhisattva's Brain: Buddhism Naturalized (in ఇంగ్లీష్). MIT Press. p. 107. ISBN 978-0-262-29723-3.
  3. Pye, Michael (1978). Skillful Means – A concept in Mahayana Buddhism. London: Gerald Duckworth & Co. Ltd. ISBN 0-7156-1266-2.
  4. Williams, Paul (2008). Mahayana Buddhism: The Doctrinal Foundations, pp. 50–51. Routledge.