మైన్‌పురి
మైన్‌పురి ఉత్తర ప్రదేశ్, మైన్‌పురి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది న్యూ ఢిల్లీ నుండి 270 కి.మీ. దూరంలో ఉంది. [1] మైన్‌పురి, శ్రీకృష్ణుడు చరించిన పౌరాణిక ప్రాంతం బ్రజ్ లో భాగం. [2] పట్టణంలో ఇషాన్ నది ప్రవహిస్తోంది.
మైన్‌పురి
मैनपुरी | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°14′N 79°01′E / 27.23°N 79.02°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | మైన్‌పురి |
Elevation | 153 మీ (502 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,50,007 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 205001 |
టెలిఫోన్ కోడ్ | 05672 |
Vehicle registration | UP-84 |
రవాణా సౌకర్యాలు
మార్చుమైన్పురి రైల్వే స్టేషన్ నుండి వివిధ నగరాలకు రైళ్ళున్నాయి. సమీప విమానాశ్రయం 121 కి.మీ దూరంలో.ఆగ్రా వద్ద ఉంది.
వాతావరణం
మార్చుశీతోష్ణస్థితి డేటా - Mainpuri (1981–2010, extremes 1901–2005) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 31.4 (88.5) |
35.2 (95.4) |
41.7 (107.1) |
45.8 (114.4) |
49.2 (120.6) |
49.2 (120.6) |
46.2 (115.2) |
42.6 (108.7) |
42.4 (108.3) |
40.6 (105.1) |
37.6 (99.7) |
33.0 (91.4) |
49.2 (120.6) |
సగటు అధిక °C (°F) | 22.7 (72.9) |
26.0 (78.8) |
31.5 (88.7) |
38.3 (100.9) |
41.0 (105.8) |
40.3 (104.5) |
35.2 (95.4) |
33.4 (92.1) |
33.7 (92.7) |
33.5 (92.3) |
29.4 (84.9) |
24.7 (76.5) |
32.4 (90.3) |
సగటు అల్ప °C (°F) | 7.1 (44.8) |
9.6 (49.3) |
14.7 (58.5) |
21.0 (69.8) |
25.4 (77.7) |
26.7 (80.1) |
25.4 (77.7) |
25.0 (77.0) |
24.2 (75.6) |
19.8 (67.6) |
13.8 (56.8) |
8.4 (47.1) |
18.4 (65.1) |
అత్యల్ప రికార్డు °C (°F) | −1.7 (28.9) |
−0.6 (30.9) |
5.0 (41.0) |
10.7 (51.3) |
15.6 (60.1) |
17.6 (63.7) |
16.8 (62.2) |
18.6 (65.5) |
8.2 (46.8) |
9.6 (49.3) |
2.2 (36.0) |
−1.1 (30.0) |
−1.7 (28.9) |
సగటు వర్షపాతం mm (inches) | 11.3 (0.44) |
13.5 (0.53) |
8.5 (0.33) |
5.7 (0.22) |
14.8 (0.58) |
71.3 (2.81) |
207.7 (8.18) |
233.6 (9.20) |
159.7 (6.29) |
33.4 (1.31) |
3.4 (0.13) |
6.0 (0.24) |
768.9 (30.27) |
సగటు వర్షపాతపు రోజులు | 1.1 | 1.0 | 0.9 | 0.5 | 1.5 | 3.4 | 9.1 | 10.0 | 7.1 | 1.8 | 0.4 | 0.6 | 37.4 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 71 | 62 | 53 | 32 | 33 | 43 | 64 | 73 | 71 | 65 | 67 | 73 | 59 |
Source: India Meteorological Department[3][4] |
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, మైన్‌పురి పట్టణ సముదాయం జనాభా 1,33,078. వీరిలో పురుషులు 69,788, మహిళలు 63,290. అక్షరాస్యత 85.66%. [5]
2001 జనగణన ప్రకారం [6] మైన్‌పురి జనాభా 89,535. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. పట్టణ అక్షరాస్యత 69%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 74%, స్త్రీల అక్షరాస్యత 64%. ఆరేళ్ళ లోపు పిల్లలు మైన్‌పురి జనాభాలో 15% ఉన్నారు. రోజువారీ వ్యవహారాల్‌లో ప్రజలు కన్నౌజీ, బ్రజ్ భాషలను మాట్లాడతారు.
పరిశ్రమ
మార్చుపట్టణ జనాభాలో అధిక భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. కాటన్ జిన్నింగ్, ఆయిల్‌సీడ్ మిల్లింగ్, దీపం, గాజు తయారీ ఇక్కడి ప్రముఖమైన పరిశ్రమలు. ఈ పట్టణం పొగాకుకు, చెక్క శిల్పాలకూ ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ పరికరాల వ్యాపారం ఇక్కడి మరో ప్రధానమైన వ్యాపారం. జిల్లాలోని వ్యవసాయ పరికరాల తయారీదారులలో సియారామ్ ఏజెన్సీ ఒకటి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-16. Retrieved 2020-11-29.
- ↑ Subodh Kapoor (2002). The Indian Encyclopaedia: India (Central Provinces)-Indology. Genesis Publishing Pvt Ltd. p. 3432. ISBN 9788177552683.
- ↑ "Station: Mainpuri Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 461–462. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M219. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.