మైమ్
మైమ్ (మూకాభినయం) అనేది నాటకం లో ఉపయోగించే ఒక ప్రక్రియ. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతమైన అలవాట్లు లేదా ఒక చిన్న సంఘటనను మాటలు లేకుండా అభినయం ద్వారా వ్యక్తంచేసేది మైమ్.[1] మైమ్ చేసే కళాకారుడికి నిరాఘాటమైన సృజనాత్మక శక్తి, సునిశితమైన పరిశీలనా శక్తి తప్పనిసరిగా ఉండాలి. ప్రతి కళాకారునికి మైమ్ కళ అనేది చాలా అవసరం. మైమ్ కళతో శరీరం తేలికవుతుంది. ప్రతిఒక్కరు తమకు తెలియకుండానే నిజ జీవితంలో మైమ్ కళను పాటిస్తుంటారు.[2]
మైమ్ విధానంసవరించు
మైమ్ చేసే సందర్భంలో మాటలుగాని, వస్తువుల వినియోగంగానీ, తెరవెనుక నుండి వ్యాఖ్యానంగానీ ఉండదు.
తెలుగు నాటకరంగంలో మైమ్సవరించు
తెలుగు నాటకరంగంలో ఈ మైమ్ రావడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. ఒక సన్నివేశంలో నటులు అనేక వస్తువులను రంగస్థలంపైకి తీసుకొనిరావడం సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మైమ్ అవసరం అవుతుంది.
ప్రాచీన భారత సాంప్రదాయ కళల్లో మైమ్ ఉన్నప్నటికి తెలుగు నాటకరంగంలో మాత్రం ప్రాశ్చాత్య నాటకరంగ నాటకాల ద్వారానే ప్రవేశించిందని చెప్పవచ్చు.
ప్రఖ్యా శ్రీరామమూర్తి రచించిన దయ్యం నాటకం ద్వారా మైమ్ తెలుగు నాటకరంగంలోకి ప్రవేశించింది. 1964లో ప్రోలాప్రగడ ప్రసాద్ రచించి దర్శకత్వం వహించిన ఇదం అహం నాటకంలో పూర్తిస్థాయిలో మైమ్ ను ఉపయోగించారు.
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 460), రచన. డా. కందిమళ్ళ సాంబశివరావు
- ↑ సాక్షి (4 July 2017). "కళాకారులకు మైమ్ కళ ఉండాలి". Retrieved 1 January 2018.