మొండోళ్లు

(మొండోడు నుండి దారిమార్పు చెందింది)

మొండోళ్లు ఒక యాచక వృత్తి వారు. వీరు భార్యా భర్తలు ఒక పసి పిల్లను చేటలో పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ యాచిస్తుంటారు. వీరి యాచనా పద్ధతి చాల ఘోరంగా వుంటుంది. వీరు రక్త సిక్తమైన తమ పశి పిల్లవాణ్ణి చేటలో పెట్టి ఒకరి ఇంటి ముందు పెట్టి, జుట్టు విరబోసుకున్న అతను పెద్ద కొరడాతో తనను తాను కొట్టు కుంటుండగా అతని భార్య తన వద్ద వున్న ఒక వాయిద్యంతో బర....బర... మని పెద్ద శబ్దం చేస్తూ ఏదో అర్థంలేని పాట పాడు తుంది. ఈ తతంగం చూడడానికి చాల భయానకంగా వుంటుంది. ఈ ఘోరాన్ని భరించ లేక ఆ ఇంటి ఇల్లాలు ఎంతో కొంత బిచ్చం వేయగా.... వారు అక్కడినుండి ఇంకొక ఇంటికెళతారు. వారు బిచ్చం వేసినంత వరకు అలా అరుస్తునే వుంటారు కాని వెళ్లరు. అందుకే వీరిని మొడోళ్లు అన్నారు. వీరి నుండి పుట్టినదే ఈ సామెత: మొండోడు రాజు కన్నా భలవంతుడు.