మొన్పా ప్రజలు

(మొంపా ప్రజలు నుండి దారిమార్పు చెందింది)

ఈశాన్య భారతదేశంలోని అరుణాచల ప్రదేశు ప్రధాన జాతి సమూహం మోన్పా లేదా మన్పా (స: బో; బో; స: చైనీస్: 门巴族). చైనాలో అధికారికంగా గుర్తించబడిన 56 జాతులలో ఇవి కూడా ఒకటి.

Monpa
Alternative names:
Menba, Moinba, Monba, Menpa, Mongba
Diorama of the Monpa people at the Jawaharlal Nehru Museum, Itanagar, Arunachal Pradesh
Total population
85,000
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 India (Arunachal Pradesh)60,545 (2011 census)[1]
 China (Tibet)25,000
 Bhutan3,000
భాషలు
East Bodish languages, Tshangla language, Kho-Bwa languages
మతం
Tibetan Buddhism
సంబంధిత జాతి సమూహాలు
Tibetan, Sherdukpen, Sharchops, Memba, Limbu

మోన్పా ప్రజల మూలం అస్పష్టంగా ఉంది. ఈశాన్య భారతదేశంలోని ఇతర తెగల మాదిరిగానే మోన్పా అరుణాచల ప్రదేశు పశ్చిమ భాగంలోని తవాంగుకు వలస వచ్చినట్లు భావిస్తున్నారు. మోన్పా ఈశాన్య భారతదేశంలో ఉన్న ఏకైక సంచార తెగ అని నమ్ముతారు - వారు పూర్తిగా గొర్రెలు, ఆవులు, యాక్, మేకలు, గుర్రాలు వంటి జంతువుల పెంపకం మీద ఆధారపడి జీవితం సాగిస్తుంటారు. వీరికి ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాశ్వత స్థావరం లేదా అనుబంధం లేదు. ఈ సిద్ధాంతం ఆధారంగా వీరు మోన్పా పశ్చిమ హిమాలయాలు, సిక్కిం మీదుగా తవాంగు ప్రాంతానికి వలస వచ్చి ఉండవచ్చు. ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రస్తుతం సిక్కుంలో నివసిస్తున్న భూటియాలతో మోన్పాకు సంబంధాలు ఉన్నాయని ప్రతిపాదించబడుతుంది.

చాలా మంది మోన్పాలు భారత రాష్ట్రమైన అరుణాచల ప్రదేశులో నివసిస్తున్నారు. వీరిలో సుమారు 60,000 జనాభా, తవాంగు జిల్లా, పశ్చిమ కామెంగు జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. చైనాలోని టిబెట్టు స్వయంప్రతిపత్తిత ప్రాంతం, కోనా కౌంటీ, బేయి జిల్లాలోని పలుంగు, మాడోగు కౌంటీలో సుమారు 25 వేల మంది మోన్పాలు నివసిస్తున్నారు. ఈ ప్రదేశాలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. ముఖ్యంగా మాడోగు కౌంటీ, ఇది మిగిలిన టిబెట్టు మాదిరిగా కాకుండా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంది.[2] అరుణాచల ప్రదేశులో నివసిస్తున్న 60,000 మంది మోన్పాలలో 20,000 మంది తవాంగు జిల్లాలో నివసిస్తున్నారు. ఇక్కడ వారు జిల్లా జనాభాలో 97% ఉన్నారు. మిగిలినవారిని పశ్చిమ కామెంగు జిల్లాలో చూడవచ్చు. అక్కడ వారు జిల్లా జనాభాలో 77% మంది ఉన్నారు. భూటాను సరిహద్దుకు సమీపంలో ఉన్న తూర్పు కామెంగు జిల్లాలో ఈ ప్రజలు తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.[3]

భూటాను షార్చాపులతో మోన్పాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. వారి భాషలు సాధారణంగా టిబెటిక్-బర్మన్ భాషలలో టిబెటిక్ క్లస్టర్ నుండి వేరువేరుగా భావించబడతాయి. అయినప్పటికీ అవి టిబెటన్ వర్ణమాల ఆధారంగా వ్రాయబడ్డాయి.

దాదాపు అన్ని మోన్పా టిబెట్టు బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. వారు 17 వ శతాబ్దంలో భూటాను-విద్యావంతులైన మెరాగు లామా ఫలితంగా స్వీకరించారు. ఈ కారణంగా మోన్పా రోజువారీ జీవితంలో తవాంగు మొనాస్టరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏదేమైనా వారి బౌద్ధ పూర్వ విశ్వాసం అంశాలు (తరచుగా "బాన్" అని కూడా పిలుస్తారు) మోంపాలలో బలంగా ఉన్నాయి. ముఖ్యంగా అస్సామీ మైదానాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఇది అధికంగా ఉంది. ప్రతి ఇంటిలో చిన్న బౌద్ధ బలిపీఠాలకు చిన్న కప్పులలో నీటి ప్రసాదాలు, వెన్న దీపాలను కాల్చడం జరుగుతుంది.

భాషలు

మార్చు

మోన్పా ప్రజలు మాట్లాడే భాషలను తరచుగా "మోన్పా భాషలు" అని పిలుస్తారు. ఇది వంశపారంపర్య పదం కాదు. చాలా భిన్నమైన భాషల మిశ్రితంగా ఉన్నాయి. "మోన్పా భాషలలో" ఖో-బ్వా, తూర్పు బోడిషు, షాంగ్లా భాషలు ఉన్నాయి. బ్లెన్చు (2014) అభిప్రాయం ఆధారంగా ఐదు సమూహాలను వేరు చేయవచ్చు:[4]

  • షెర్డుక్పెను, లిషు, సర్తాంగు భాషలు ఈ ప్రాంతంలోని ఇతర భాషలతో స్పష్టమైన సంబంధాన్ని ప్రదర్శించవు. అవి చిన్న భాషల ఏకాంత సమూహంగా ఉంటాయి. ఈ మూడు భాషలు బుగను భాషకు సంబంధించినవి. దానితో కలిసి "ఖో-బ్వా" సమూహాన్ని ఏర్పరుస్తాయి.
  • తూర్పు బోడిషు భాష అయిన తవాంగు భాష డక్పాభాషలో ఒక రకం.
  • జెమితాంగు, మాగో, థింగ్బు గ్రామాల భాషలు వాడుకలో ఉన్న తూర్పు బోడిషు భాషలు తవాంగు భాషలా అర్థం కాని అదనపు

భాషలుగా ఉంటాయి.

  • బోడిషులోని త్షాంగ్లా భాషలో సెంగే, న్యుక్మాదుంగు, లుబ్రాంగు గ్రామాలలో సంచార జాతులు బ్రోక్పా భాషామాండలికాలు వాడుకలో ఉన్నాయి. డిరాంగు ("సెంట్రలు మోన్పా"), ముర్షింగు, కలక్టాంగు (దీనిని "దక్షిణ మోన్పా" ) ప్రాంతాలలో ఇతర భాషలు వాడుకలో ఉన్నాయి.

సంస్కృతి

మార్చు

కొయ్య చెక్కడం, తంకా పెయింటింగు, తివాసీ తయారీ, నేయడం వంటి హస్థకళలలో మోన్పా ప్రసిద్ధి చెందింది. వారు స్థానిక సుక్సో చెట్టు గుజ్జు నుండి కాగితాన్ని తయారు చేశారు. తవాంగు ఆశ్రమంలో ఒక ప్రింటింగు ప్రెసు చూడవచ్చు. ఇక్కడ అనేక మత పుస్తకాలు స్థానిక కాగితం, చెక్క బ్లాకుల మీద ముద్రించబడతాయి. సాధారణంగా అవి అక్షరాస్యులైన మోన్పా లామాల కోసం ఉద్దేశించినవై ఉంటాయి. వారు దీనిని వారి వ్యక్తిగత కరస్పాండెన్సు, మతపరమైన ఆచారాల కోసం ఉపయోగిస్తారు. చెక్క గిన్నెలు (మాను ముంతలు), మేదరి అల్లకాలకు కూడా వీరు ప్రసిద్ధి చెందాయి.[2]

ప్రధాన మోన్పా పండుగలలో చోస్కరు పంట పండుగ, లోసరు, టోర్గ్యా ఉన్నాయి. లోసరు సమయంలో, ప్రజలు సాధారణంగా తవాంగు మొనాస్టరీలో రాబోయే టిబెటను న్యూ ఇయరు కోసం ప్రార్థనలు చేస్తారు. అజిలాం పండుగ ముఖ్య లక్షణం పాంటోమైం నృత్యాలు.

బౌద్ధ లామాల చోస్కరు సమయంలో కొన్ని రోజులు గోంపాలలో మత గ్రంథాలను చదివేవారు. ఆ తరువాత గ్రామస్థులు వీపు మీద సూత్రాలతో వ్యవసాయ పొలాల చుట్టూ తిరుగుతారు. ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే మంచి వ్యవసాయం, గ్రామస్తుల శ్రేయస్సు కోసం ప్రార్థించడం. కీటకాలు, అడవి జంతువుల నుండి ధాన్యాలను రక్షించడం.

పురుషులు, పులులు మినహా మొగిలిన జంతువులన్నింటిని వేటాడేందుకు అనుమతించాలనేది ఒక నియమం. సాంప్రదాయం ప్రకారం షమన్ల ప్రారంభ వ్యవధిలో ఒక పవిత్రమైన రోజున పులిని వేటాడేందుకు ఒక వ్యక్తిని మాత్రమే అనుమతిస్తారు. దీనిని ప్రకరణం విచారణగా పోల్చవచ్చు. పులిని చంపిన తరువాత దవడ ఎముక దాని దంతాలన్నిటితో ఒక మాయా ఆయుధంగా ఉపయోగించబడుతుంది. దీని శక్తి పులులు పూర్వీకుల పులి మార్గదర్శక ఆత్మ శక్తిని ప్రేరేపించడానికి దోహదపడుతుందని విశ్వసిస్తారు. ఆయన బాలుడిని తన దారిలో వెంట తీసుకెళ్తాడు.

సమాజం

మార్చు

మోన్పా సాంప్రదాయ సమాజంలో ట్రూక్ద్రి అని పిలువబడే ఆరుగురు మంత్రులు ఉన్న కౌన్సిలు చేత నిర్వహించబడుతుంది. ఈ కౌన్సిలు సభ్యులను కెన్పో అని పిలుస్తారు. మఠాధిపతిగా తవాంగు ఉంటాడు. లామాలు గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ఇందులో నైట్సాంగ్సు అని పిలువబడే ఇద్దరు సన్యాసులు, మరో ఇద్దరు జొంగ్పెను ఉన్నారు.

పురుషుడు కుటుంబానికి అధిపతిగా అన్ని నిర్ణయాలు తీసుకునేవాడుగా ఉంటాడు. ఆయన లేనిసమయణ్లో ఆయన భార్య అన్ని బాధ్యతలను తీసుకుంటుంది. ఒక బిడ్డ జన్మించినప్పుడు వారికి అబ్బాయి లేదా అమ్మాయి అయినా వివక్షత చూపే ఆచారం వీరిలో లేదు.

జీవనశైలి, దుస్తులు

మార్చు

మోన్పా సాంప్రదాయ దుస్తులు టిబెట్టు చుబా మీద ఆధారపడి ఉంటాయి. పురుషులు, మహిళలు ఇద్దరూ పొడవాటి టాసెల్సు, యాక్ బొచ్చుతో చేసిన శిరస్త్రాణం ధరిస్తారు. మహిళలు వెచ్చని జాకెటు, స్లీవ్ లెస్ కెమిస్ ధరిస్తారు. పొడవైన, ఇరుకైన వస్త్రంతో నడుము చుట్టూ కెమిస్ కట్టిస్తారు. ఆభరణాలలో వెండి, పగడాలు, మణితో చేసినవి ఉన్నాయి. ఒకే నెమలి ఈకతో టోపీ ధరించిన వ్యక్తులను చూడవచ్చు.

హిమాలయాల శీతల వాతావరణం కారణంగా మోన్పా, ఈ ప్రాంతంలోని ఇతర జాతుల మాదిరిగానే, రాయి, కలపతో కూడిన ఇళ్లను ప్లాంకు అంతస్తులతో నిర్మిస్తారు. తరచూ అందంగా చెక్కిన తలుపులు, కిటికీ ఫ్రేములతో ఉంటుంది.[5] పైకప్పు వెదురు మ్యాటింగుతో తయారు చేయబడింది. ఇది శీతాకాలంలో వారి ఇంటిని వెచ్చగా ఉంచుతుంది. లివింగు రూములలో కూర్చోవడానికి అరుగులు, పొయ్యిలు కూడా వారి ఇళ్లలో కనిపిస్తాయి.

ఆర్ధికం

మార్చు

మొన్పా ప్రజలు జీవనాధారం కొరకు పంటమార్పిడి వ్యవసాయం, పశువులు, యాక్ లు, ఆవులు, పందులు, గొర్రెలు, కోళ్ళను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.

నేల కోతను నివారించడానికి మోన్పా అనేక వాలుప్రాంతాలను స్వాధీనం చేసుకుని కొండ వాలులలో పంటలను నాటుతుంటారు. నగదు పంటలైన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ, చిరుధాన్యాలు, బక్‌వీట్, మిరియాలు, గుమ్మడికాయ, బీన్సు వంటివి పండిస్తారు.

చరిత్ర

మార్చు

ఈ రోజు మోన్పాలు నివసించే ప్రాంతం గురించి మొట్టమొదటి వ్రాతపూర్వక ఆధారాలు లోమోను (మోన్యులు) అని పిలువబడే ఒక రాజ్యం ఉనికిని సూచిస్తున్నాయి. ఇవి క్రీ.పూ. 500 నుండి సా.శ.. 600 వరకు ఉన్నాయి.[6] తరువాతి సంవత్సరాలలో మోన్యులు పెరుగుతున్న టిబెట్టు రాజకీయ, సాంస్కృతిక ప్రభావానికి లోనయ్యారు. ఇది మోన్పా జాతికి చెందిన " సాంగ్యాంగు గ్యాట్సో " 6 వ దలైలామాగా మారడంతో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో మోన్యులు ముప్పై రెండు జిల్లాలుగా విభజించబడి ఉంది. వీరు తూర్పు భూటాను, తవాంగు, కామెంగు, దక్షిణ టిబెటు ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు. ఏది ఏమయినప్పటికీ తవాంగు ట్రాక్టు అని కూడా పిలువబడే ప్రాంతంలో చరిత్ర అంతటా మోన్యుల జనాభా తక్కువగా ఉంది.[7]

11 వ శతాబ్దంలో తవాంగులోని ఉత్తర మోన్పాలు నియింగ్మా, కాగ్యు తెగల ప్రజలు టిబెట్టు బౌద్ధమత ప్రభావానికి లోనయ్యారు. ఈ సమయంలోనే మోన్పా వారి భాష కోసం టిబెట్టు వర్ణమాలను స్వీకరించారు. 13 వ శతాబ్దంలో ద్రుక్పా మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చారు. 17 వ శతాబ్దంలో గెలుగు పాఠశాల మిషనరీలు వచ్చారు. గెలుగు పాఠశాల ఈ రోజు చాలా మంది మోన్పాలకు చెందినది.[8]

మోన్యులు ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా మిగిలిపోయింది. తవాంగు స్థానిక సన్యాసులు కేంద్రంగా ఉండి రాజ్యంలో గొప్ప రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నారు. 17 వ శతాబ్దంలో మాత్రమే లాసాలో ప్రత్యక్ష పాలన స్థాపించబడింది. ఈ సమయం నుండి 20 వ శతాబ్దం ఆరంభం వరకు మోన్యులను లాసాలోని అధికారులు పాలించారు. 1912 లో వీరు క్వింగు రాజవంశం పతనం అయ్యే వరకు పాలించారు. అయినప్పటికీ 19 వ శతాబ్దంలో ఈ ప్రాంతం బ్రిటిషు రాజు పట్ల ఆసక్తి చూపడం ప్రారంభించింది. 1875 నుండి 1876 వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించిన మొట్టమొదటి బ్రిటిషు-భారతీయ ప్రయాణికులలో ఒకరైన నైను సింగు రావతు " మోన్పాలు ఒక సాంప్రదాయిక ప్రజలు, బయటి ప్రపంచంతో సంబంధాన్ని విరమించుకున్నారు " టిబెట్టుతో వాణిజ్యం గుత్తాధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాని వ్యూహాత్మక స్థానం కారణంగా బ్రిటిషు వారు రాజకీయ ప్రభావాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించారు.

1914 లో భారతదేశంలోని బ్రిటను వలస అధికారులు చైనా టిబెట్టు, బ్రిటిషు ఇండియా మధ్య సరిహద్దుగా పేర్కొన్న మెక్ మహోను రేఖను గీసారు. ఈ రేఖ మోన్పాలు నివసించిన భూమిని విభజించింది. తరువాతి సంవత్సరాల్లో మెక్ మహోను రేఖ అస్పష్టత కారణంగా వివాదానికి మూలంగా మారింది.[9]

తరువాతి సంవత్సరాలలో చైనా మెక్ మహోను సరిహద్దును టిబెట్టు, భారతదేశం మధ్య సరిహద్దుగా పేర్కొనడం కొనసాగించింది. బ్రిటిషు ఇండియా క్రమంగా మెక్ మహోను రేఖకు దక్షిణాన మోన్యూల మీద సమర్థవంతమైన నియంత్రణను ఏర్పాటు చేసింది. భారతదేశం స్వాతంత్ర్యం, చైనాలో ప్రభుత్వ మార్పు తరువాత, చైనా, భారతదేశం మధ్య సంబంధాలలో ఈ వివాదం ప్రధాన సమస్యగా మారింది. సరిహద్దు కొంతవరకు లోపాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం మెక్ మహోను రేఖ సమర్థవంతమైన నియంత్రణ రేఖగా ఉంది. 1962 లో వివాదాస్పద సరిహద్దులో వాగ్వివాదం చైనా-భారతీయ యుద్ధానికి దారితీసింది. యుద్ధ సమయంలో మెక్ మహోను రేఖకు దక్షిణంగా ఉన్న మొత్తం మోన్యుల ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలను చైనా సమర్థవంతంగా నియంత్రించింది. ఏదేమైనా మెక్ మహోను రేఖకు ఉత్తరాన చైనా స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవడంతో యుద్ధం ముగిసింది. వివాదం మీద చర్చలు చురుకుగా ఉన్నాయి.

ప్రముఖులు

మార్చు
  • 6 వ దలై లామా
  • "లామా తాషి"గా ప్రసిద్ధి చెందిన న్గావాంగు తాషి బాపు, సాంప్రదాయ ప్రపంచ సంగీత విభాగంలో గ్రామీ అవార్డు నామినీ (2006) గా ప్రతిపాదించబడ్డాడు.
  • డోర్జీ ఖండు, అరుణాచల ప్రదేశు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
  • డోర్జీ ఖండు కుమారుడు, పెమా ఖండు ప్రస్తుత అరుణాచల ప్రదేశు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "A-11 Individual Scheduled Tribe Primary Census Abstract Data and its Appendix". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 2017-11-03.
  2. 2.0 2.1 "Moinba Ethnic Group and its customs". Tibet Travel Guide-Let's Travel Tibet. Archived from the original on 2013-10-23. Retrieved 2019-12-24.
  3. "Wayback Machine" (PDF). 2007-09-26. Archived from the original on 2007-09-26. Retrieved 2017-11-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Blench, Roger (2014). Sorting out Monpa: The relationships of the Monpa languages of Arunachal Pradesh.
  5. Ministry of Information and Broadcasting, Govt. of India (1979). Arunachal Pradesh. University of Michigan. p. 10.
  6. Andrea Matles Savada (1993). Nepal and Bhutan: Country Studies. Federal Research Division, Library of Congress. p. 21. ISBN 0-8444-0777-1.
  7. China Study Centre (1989). China Report. China Study Centre. pp. 104–5.
  8. Col Ved Prakash. Encyclopaedia of North-east India, Vol# 3. Atlantic Publishers & Distributors. pp. 1206–7. ISBN 81-269-0705-3.
  9. Harish Kapadia; Geeta Kapadia (2005). Into the Untravelled Himalaya: Travels, Treks and Climbs. Indus Publishing. pp. 50–3. ISBN 81-7387-181-7.

వెలుపలి లింకులు

మార్చు

మూస:CEG మూస:Tribes of Arunachal Pradesh మూస:Hill tribes of Northeast India మూస:Bhutanese society మూస:Bodic languages