మొనగాడొస్తున్నాడు జాగ్రత్త
మొనగాడొస్తున్నాడు జాగ్రత్త 1972, జనవరి 13న విడుదలైన కౌబాయ్ తరహా తెలుగు చిత్రం. రవిచిత్ర ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత యరగుడిపాటి వరదారావు నిర్మించిన ఈ చిత్రం లో ఘట్టమనేని కృష్ణ, జ్యోతిలక్ష్మి, రాజసులోచన మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం కె. వి. ఎస్.కుటుంబరావు .సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.వి.యస్.కుటుంబరావు |
నిర్మాణం | వై.వి.రావు |
తారాగణం | కృష్ణ, జ్యోతిలక్ష్మి, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, రాజసులోచన, త్యాగరాజు |
సంగీతం | సత్యం |
నేపథ్య గానం | ఎల్.ఆర్.ఈశ్వరి |
గీతరచన | వీటూరి, ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | రవిచిత్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ - రాజా
- జ్యోతిలక్ష్మి - జ్యోతి, మోతి
- రాజసులోచన
- సత్యనారాయణ - నాగరాజు
- ప్రభాకరరెడ్డి
- త్యాగరాజు
- నల్ల రామ్మూర్తి
- మోదుకూరి సత్యం
- చిత్తూరు నాగయ్య (అతిథి)
- మిక్కిలినేని (అతిథి) - నరేంద్రభూపతి
- ధూళిపాళ (అతిథి)
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాత: వై.వి.రావు
- దర్శకుడు: కె.వి.ఎస్.కుటుంబరావు
- కథ: ప్రతాపరావు
- మాటలు: వీటూరి
- పాటలు: ఆరుద్ర, వీటూరి
- సంగీతం: సత్యం
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]
- ఇలా ఇలా ఉండాలీ అలా అలా తేలాలీ చల్లగ మెల్లగా కౌగిటిలో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
- ఓ కొండమల్లె కన్నె పిల్లోయి బుల్లోడా నీ కండ జూచి కన్నేసింది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: వీటూరి
- ఓ సర్దార్ సుభాన్అల్లా ఓ సర్కార్ మాషాఅల్లా నా వయసే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- ఓరయ్యో ఇప్ప సారాయి కైపు ఓలమ్మో ఇంపుసొంపుల ఘాటు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- కన్నుగొట్టి రమ్మన్నాఆ వెన్నుతట్టి లేమ్మన్న హా మనసులేదా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "మొనగాడొస్తున్నాడు జాగ్రత్త - 1972". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 7 ఏప్రిల్ 2020. Retrieved 7 April 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)