రాజసులోచన
రాజసులోచన (ఆగష్టు 15, 1935 - మార్చి 5, 2013) అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది.
రాజసులోచన | |
జన్మ నామం | రాజీవలోచన |
జననం | విజయవాడ, కృష్ణా జిల్లా | 1935 ఆగస్టు 15
మరణం | 2013 మార్చి 5 మద్రాసు, భారతదేశం | (వయసు 77)
భార్య/భర్త | సి. ఎస్. రావు |
ప్రముఖ పాత్రలు | పాండవ వనవాసం బభృవాహన భాగ్యదేవత |
రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
సినీ జీవితం
మార్చుస్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం 'గుణసాగరి' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. కన్నతల్లి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకు ముందు 'గుణసాగరి' అనే కన్నడ చిత్రంతో పాటు 'సత్యశోధనై' అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారి హీరోయిన్ గా ఎన్.టి.ఆర్. సరసన ఘంటసాల నిర్మించిన సొంతవూరు (1956) చిత్రంలో నటించింది. తన చిత్రాలకు నృత్య దర్శకులైన పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి పెదసత్యం, వెంపటి చినసత్యం, జగన్నాథశర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా అందరు మేటి నటుల సరసన నటించారు[1]. ప్రతి భాషలోను తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు.
నృత్య కళాకేంద్రం
మార్చుమద్రాసు నగరంలో 1963 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలలో భామా కలాపం, అర్థనారీశ్వరుడు, శ్రీనివాస కళ్యాణం, అష్టలక్ష్మీ వైభవం లాంటి ఐటమ్ లకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు అమెరికా, జపాన్, చైనా, శ్రీలంక, రష్యా, సింగపూర్ తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలనిచ్చారు.
వ్యక్తిగత జీవితం
మార్చుఈవిడ దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావును వివాహం చేసుకొంది. వీరికి కవల పిల్లలు.
మరణం
మార్చుఈవిడ అనారోగ్యంతో బాథపడుతూ చెన్నై లోని తన స్వగృహంలో 2013, మార్చి 5, తెల్లవారుజామున మరణించింది[2]
చిత్ర సమాహారం
మార్చు- దొంగ మొగుడు (1987) చిరంజీవి అత్త పాత్ర
- శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ (1975) .... పద్మ
- ఇల్లు - వాకిలి (1975)
- తాతా మనవడు (1972)
- ఏకవీర (1969) ... నర్తకి (అతిథి పాత్ర)
- పాండవ వనవాసం (1965) .... నర్తకి (ఒక పాటలో అతిథి పాత్ర)
- పతివ్రత (1964)
- బభృవాహన (1964) .... ఉలూచి
- వెలుగు నీడలు (1964)
- తిరుపతమ్మ కథ (1963) .... (అతిధి నటి)
- వాల్మీకి (1963)
- టైగర్ రాముడు (1962)
- అరశిలన్ కుమారి (1961) .... అయగురాణి
- ఇద్దరు మిత్రులు (1961) .... సరళ
- బికారి రాముడు (1961)
- శభాష్ రాజా (1961)
- మహాకవి కాళిదాసు (1960)
- శాంతినివాసం (1960)
- జయభేరి (1959) .... నర్తకి అమృత
- భాగ్యదేవత (1959)
- రాజ మకుటం (1959) .... ప్రమీల
- పెళ్ళినాటి ప్రమాణాలు (1958) .... రాధారాణి
- మాంగల్యబలం (1958)
- సువర్ణ సుందరి (1957) .... జయంతి
- సారంగధర (1957)
- తోడికోడళ్ళు (1957) .... నవనీతం
- చోరీ చోరీ (1956) .... భగవాన్ భార్య
- పెంకి పెళ్ళాం (1956)
- రంగూన్ రాధ (1956) .... రాధ
- సొంతవూరు (1956)
- శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం (1954) .... చింతామణి
- కన్నతల్లి (1953) .... (వీధిభాగోతం పాటలో అతిథిపాత్ర)
మూలాలు
మార్చు- నాట్యలోచని, రాజసులోచన ఆంధ్రప్రభ విశేష ప్రచురణ 1999 'మోహిని' కోసం రాసిన వ్యాసం.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-12. Retrieved 2020-02-19.
- ↑ http://telugu.greatandhra.com/cinema/march2013/artist_sulochana_5.phప్[permanent dead link]