మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలను ‘‘మొలలు’’ (హెమరాయిడ్స్) అంటారు. ఈ మొలలు మలద్వారం నుంచి బయటకు పొడుచుకు వచ్చి గాని, అంతర్గతంగా (పురీషనాళంలోనే) పెరిగే అవకాశం గాని ఉంది. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలో మొలలు తొలిసారిగా కనిపించవచ్చు లేదా వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

మొలలు
SpecialtyGeneral surgery Edit this on Wikidata

ప్రధాన కారణాలుసవరించు

మొలలు ఏర్పడటానికి ప్రధాన కారణం మలబద్ధకం. మల విసర్జన సాఫీగా లేకపోవడం వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. కొందరిలో మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా మొలలు సమస్య ఉత్పన్నమవుతుంది. అధికబరువు ఉన్న కూడా కారణమవుతుంది. ఇవే కాకుండా ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారంను తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశాలుంటాయి. పైల్స్ ఉన్నప్పుడు మల విసర్జన ఇబ్బందిగా మారుతుంది. రక్తం పడుతూ ఉంటుంది. దురద ఉంటుంది.

  • హార్మోన్ల ప్రభావం వల్ల పురీషనాళంలోని రక్తనాళాలు మెత్తబడటం వల్ల.
  • గర్భకోశం విస్తరించడం వల్ల ఒత్తిడి పెరిగి రక్తనాళాలు పరిమాణంలో పెరిగే అవకాశం ఉంటుంది.
  • ఎక్కువకాలం మలబద్దకం కొనసాగించడం వల్ల కూడా మొలలు పెరిగే అవకాశం ఉంది.

వ్యాధి లక్షణాలుసవరించు

  • మలద్వారం చుట్టూ దురద.
  • మలవిసర్జన సమయంలో నొప్పి.
  • మలద్వారం చుట్టూ వాచిపోవడం, ఉబ్బుగా కనిపించడం.
  • మలవిసర్జన సమయంలో లేదా మలవిసర్జన అనంతరం రక్తస్రావం.
  • మలాశయం నుంచి పూర్తిగా మలవిసర్జన జరగలేదేమోనన్న భావన కలగడం.

విభజన, నిర్ధారణసవరించు

మొలలు ఉన్న తీరును బట్టి నాలుగు గ్రేడ్‌లుగా విభజించడం జరుగుతుంది. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని గ్రేడ్-1 అంటారు. బయట నుంచి ఈ వాపు కనపడదు. లోపల వాపు ఉన్నట్లు కూడా తెలియదు. మలవిసర్జన సమయంలో రక్తనాళాలు వెలుపలికి వచ్చి. వాటంతటవే లోపలకు వెళ్లిపోతే దాన్ని గ్రేడ్ 2 అంటారు. ఉబ్బిపోయిన రక్తనాళాలు మలవిసర్జన సమయంలో వెలుపలికి రావడం, వేళ్లతో తోస్తే లోపలకు పోయే పరిస్థితిని గ్రేడ్ 3గా వ్యవహరిస్తారు. మలవిసర్జన సమయంలో వెలుపలికి వచ్చిన నాళాలు లోపలకు తోసినా పోకుండా బయటే ఉండిపోతే దాన్ని గ్రేడ్ 4 అంటారు. మొదటి, రెండు గ్రేడ్‌లలో ఉన్నప్పుడు మందులు, ఆహార నియమాలతో నియంత్రించవచ్చు. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకుంటే సరిపోతుంది. గ్రేడ్3, గ్రేడ్4లో ఉంటే ఆపరేషన్ అవసరమవుతుంది. రోగి చెప్పే వివరాలతో పాటు భౌతిక పరీక్ష నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈక్రింది పటములో వివిధ మొలల నిర్థారణను చూడవచ్చును.

అంతర్గత మొలలు
వర్గం పటము చిత్రము
1    
2    
3    
4    

నివారణ చర్యలుసవరించు

 
గుదము చుట్టూ వచ్చిన బహిర్గతమైన మొలలు
  • ద్రవపదార్థాలు, ప్రత్యేకించి నీళ్ళను ఎక్కువగా తాగాలి.
  • పండ్లు, ఆకుకూరలు ముతక ధాన్యాలతో కూడిన ఆహారపదార్థలతో పాటు. పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదా: ఆకుకూరలు, కాయగూరలు, పప్పుధాన్యాలు)
  • ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మలవిసర్జన చేయకూడదు.

చికిత్ససవరించు

50 ఏళ్లు పైబడిన వారిలో మలంలో రక్తం పడుతుందనుకుంటే పైల్స్‌గా భావించకూడదు. ఎందుకంటే కేన్సర్ ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఆ తరువాతే వ్యాధి నిర్ధారణకు రావాలి. అవసరమైన చికిత్స తీసుకోవాలి. పైల్స్ రావడానికి ప్రధాన కారణం జీవనశైలి. కాబట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది. గ్రేడ్1, గ్రేడ్2లో ఉంటే మందులతో పైల్స్ కనిపించకుండా పోతాయి. ఒకవేళ గ్రేడ్3, గ్రేడ్ 4లో ఉండి రక్తస్రావం ఎక్కువగా అవుతున్నా, ఇబ్బందికర పరిస్థితి ఉన్నా శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఆపరేషన్‌లో రెండు విధానాలున్నాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండవది స్టేప్లర్ టెక్నిక్. ఓపెన్ సర్జరీ చేస్తే ఆపరేషన్ తరువాత నొప్పి ఎక్కువగా ఉండేది. కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది.స్టేప్లర్ టెక్నిక్ విధానంలో సర్జరీ చేస్తే నాలుగైదు రోజుల్లో ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ తరువాత కూడా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.

ఫిషర్స్సవరించు

మొలల తర్వాత, మలబద్దకం వలన వచ్చే వేరొక తీవ్రమైన సమస్య-ఫిషర్స్. ఆసనపుటంచులలో ఒరిపిడి ఎక్కువై పగుళ్ళు (ఫిషర్స్) ఏర్పడి మలవిసర్జనప్పుడు, ఆ తరువాత కూడా మంట, నొప్పితో తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. దీని తరువాత దీర్ఘకాలంగా మాన కుండా, అపరిశుభ్రత లోపాల వల్ల ఇన్ఫెక్షన్స్‌కు దారితీసి చీము గడ్డలేర్పడి చివరకు భగంధరాలు ‘ఫిస్ట్యులా’గా మారి రసి కారుతూ చికాకు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మలబద్దకాన్ని ఆదిలోనే అరికట్టడం మేలు.

హోమియో మందులుసవరించు

ఇవి మలబద్దకాన్ని పూర్తిగా నివారిస్తాయి. ఏ విధంగా అంటే రోగి యొక్క లక్షణాలను అనుసరించి, వారి యొక్క తత్త్వాన్ని బట్టి, అలవాట్లు బట్టి, మానసిక స్థితిగతులను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. మందులతో పాటు ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా అనుసరిస్తే, మలబద్దకం, దాని నుంచి వచ్చే తీవ్రతలను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చు.

హోమియో మందుల్లో మలబద్దకానికి ముఖ్యంగా వాడే మందులుసవరించు

  • అల్యూమినా (Alumina) : రోజు విడిచి రోజు మోషన్ వస్తే వెళ్ళే ప్రయత్నం చేసేవారికి, కనీసం కడుపులో కదలిక కూడా కనిపించక, మోషన్ వెళ్లాలనిపించని వాళ్ళకి, వెళ్ళాలనిపించినా బద్దకించే వాళ్ళకి, క్రమబద్ధం చేసుకోవాడినికి దోహదపడే మందు.
  • బ్రయోనియా అల్బా (Bryonia Alba): మలం రాళ్ళలా గట్టిబడి ఉండలుగా రావడం, అతి కష్టంతో విసర్జించరాని స్థితి ఇది. ఈ పైల్స్, ఫిస్టులా అండ్ పిషర్స్‌కు హోమియో చక్కని పరిష్కారం. సయాటికా శరీరంలో అతి పొడవైన నరం. ఇది తొడల నుంచి మోకాళ్ళు, కాలి వేళ్ళ దాకా వ్యాపించి వుంటుంది. రోజు వారి జీవితంలో లోపాల వలన ఈ నరం ఒత్తిడికి గురవుతుంది.

ఈ సమస్యలకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఏ విధంగా అంటే మనిషి యొక్క శారీరక, మానసిక లక్షణాలను బట్టి, అంతేకాకుండా జెనిటిక్ లెవెల్ చికిత్సా విధానం బట్టి మందు ఇవ్వడం జరుగుతుంది

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మొలలు&oldid=3051886" నుండి వెలికితీశారు