మొస్రా మండలం
మొస్రా మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఈ మండలం ఆ తరువాత 2019 మార్చి 7 కొత్తగా ఏర్పడింది.[2] దానికి ముందు కూడా ఈ మండలానికి చెందిన మొస్రా గ్రామం ఇదే జిల్లా, నిజామాబాదు రెెవెన్యూ డివిజను, వర్ని మండలంలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం భోధన్ రెవెన్యూ డివిజనులో భాగం.ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
మొస్రా | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మొస్రా స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | మొస్రా |
గ్రామాలు | 4 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 244 km² (94.2 sq mi) |
జనాభా (2019) | |
- మొత్తం | 13,452 |
- పురుషులు | 6,514 |
- స్త్రీలు | 6,938. |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
2019 లో ఏర్పడిన మండలం
మార్చుగతంలో మొస్రా గ్రామం ఇదే జిల్లాలోని, నిజామాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోని వర్ని మండలంలో ఉండేది. ఆ తరువాత వర్ని మండలంలోని 6 గ్రామాలను (రెండు నిర్జన గ్రామాలు) విడగొట్టుట ద్వారా 2019 మార్చి 7 కొత్తగా ఈ మండలం ఏర్పడింది.
గణాంకాలు
మార్చు2019 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 244 చ.కి.మీ. కాగా, జనాభా 13,452. జనాభాలో పురుషులు 6,514 కాగా, స్త్రీల సంఖ్య 6,938. మండలంలో 3,304 గృహాలున్నాయి.[4]
మండల విశేషాలు
మార్చుమండల ప్రధాన కేంద్రంలో సిండికేటు బ్రాంచి కార్యాలయం ఉంది.మండలంలోని గోపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలో పరిశుబ్రత - పచ్చదనం కార్యక్రమంలో మందంజలో ఉన్నారు.పాలిధిన్ వ్యర్థాలను,మెక్కలకు హాని కలిగించే వ్యర్థాలను దరిచేరనియ్యరు.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-05-20.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.