మొహమ్మద్ షమీ పై అక్రమ సంబంధాల ఆరోపణలు
ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ సాంఘిక అనుసంధాన వేదికలలో, ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలలో, వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని చేసిన పోస్టులతో దుమారం రేగినది. [1].
హసీన్ జహాన్ గతం
మార్చుషమీని వివాహమాడే ముందు హసీన్ జహాన్ అదివరకే విడాకులు తీసుకొన్నది. పూర్వపు వివాహంలో హాసీన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో ఒకరు షమీ-హసీన్ లతోనే నివసించేది. [2] [3].
హసీన్ జహాన్ ఆరోపణలు
మార్చుషమీ ఫోన్ తన చేతికి చిక్కకుంటే, తాను ఉత్తర్ ప్రదేశ్ పారిపోయేవాడని, తనకు ఈ పాటికి విడాకుల నోటీసు పంపి ఉండే వాడని ఆరోపించింది. [4].
అక్రమ సంబంధాలు
మార్చుఒక అమ్మాయి ఇంట్లో ఎవరి కంటాపడకుండా రహస్యంగా ఒక పురుషుడిని బయట కలిసి ఒకే గదిలో ఉంటూ ఒక చెడ్ద పని చేస్తే ఆ అమ్మాయిని అభిమాని అనరని, గర్ల్ ఫ్రెండ్ లేద వేశ్య అంటారని హసీన్ జహాన్ ఆరోపించింది. షమీ ఇక ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోకుండా అతనికి బహిరంగంగా దేహశుద్ధి చేయాలని హసీన్ మీడియా సమక్షంలో తన ఆక్రోశాన్ని వెల్లడించింది. [5]
గృహ హింస
మార్చుఈ అక్రమ సంబంధాలే కాక, షమీ అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా/శారీరకంగా వేధించేవారని, ఎన్నటికైనా తనలో మార్పు వస్తుందని వేచి చూశానని, రాకపోవటంతోనే అతని బండారం బయటపెట్టవలసి వచ్చినదని, న్యాయవాదులను ఆశ్రయించవలసివచ్చినదని హసీన్ జహాన్ తరఫు వకీలు జాకీర్ హుసేన్ తెలిపాడు.
హత్యా యత్నం
మార్చుషమీ తనను హత్య చేయాలని చూశాడని, మ్యాచి ఫిక్సింగు లకు పాల్పడ్డాడని, ఒక బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్ళాడదలచుకొన్నాడని తెలిపినది.
లైంగిక వేధింపులు
మార్చుషమీ తన సోదరుడు హసీబ్ ఉండే గదిలోకి తనను నెట్టివేసేవాడని, సోదరుడి లైంగిక వాంఛలని తీర్చమని బలవంతపెట్టేవాడని, తను గట్టిగా కేకలు వేస్తే గానీ తలుపు తీసేవాడు కాదని ఆరోపించింది.
లండన్ కు చెందిన వ్యాపారవేత్త మొహమ్మద్ భాయి నుండి పాకిస్థాన్ కు చెందిన అలిష్బా అనే అమ్మాయి ద్వారా షమికి పెద్ద మొత్తంలో ధనం ముట్టినది అని హసీన్ ఆరోపించింది.
రెండవ పెళ్ళి
మార్చుషమీ తన సోదరుని మరదలితో రెండవ పెళ్ళికి సిద్ధపడ్డాడని, అందుకే తనకు డబ్బు ఎర వేసి విడాకులు కోరుకొంటున్నాడని హసీన్ జహాన్ ఆరోపించింది. [6]
తప్పుడు వయో ధృవీకరణ పత్రాలు
మార్చుBCCI రికార్డులలో ఉన్నట్లు షమీ జన్మదినం 3 సెప్టెంబరు 1990 కాదని పదవ తరగతి మార్క్స్ షీటు ప్రకారం 3 జనవరి 1984 అని, డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం 5 మే 1982 అని హసీన్ జహాన్ ఫేస్ బుక్ లో తెలిపింది. షమీ ఒక మోసగాడని అయినా అన్ని వైపుల నుండి మద్దతు షమీకే లభిస్తోందని, స్టార్ క్రికెటర్ జాలి కలిగించేలా ప్రవర్తిస్తున్నాడని తన ఫేస్ బుక్ పోస్టులో వాపోయింది. సగటు మనిషి తప్పు చేస్తే ఉద్యోగం నుండి తొలగించే ప్రభుత్వం తక్షణమే అదుపులోకి తీసుకొనే పోలీసులు షమీ కేవలం ఒక స్టార్ క్రికెటర్ కావటం వలనే మిన్నకుండిపోయారని తెలిపింది. ప్రసార మాధ్యమాలు నేరగాళ్ళను సమర్థిస్తోన్నాయని అంత మాత్రాన ధనబలంతో చేసిన అపరాధం మాసిపోతుందా, పాపి రక్షించబడతాడా అని ప్రశ్నించింది. [7]
షమీ వివరణలు
మార్చుఅయితే షమీ వీటన్నిటినీ ఖండించాడు. తన పై కుట్ర పన్నబడినదని, తన ఆటను చెరచటానికే ఈ అభియోగాలు మోపబడుతోన్నవని షమీ తెలిపాడు. [8].
తాను ఫిక్సింగుకు పాల్పడినట్లు ఋజువైతే తనను ఉరి తీయమని షమీ కన్నీటి పర్యంతమయ్యాడు. [9].
తాను నిర్దోషి అని, తన అమాయకత్వాన్ని నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నవని, షమీ తెలిపాడు. తన భార్యతో కలసి ఉండే ఆశ, దీనితో చనిపోయిందని షమీ తెలిపాడు. [10].
నేనేమిటో నా జట్టుకు తెలుసని షమీ ఈ ఆరోపణలన్నింటినీ కొట్టివేశారు. తన జట్టు సభ్యులు ప్రత్యక్షంగానే తనకు వెన్నుదన్నుగా నిలిచారని, అన్ని కుటుంబాలలో సాధారణమైన సమస్యలే తన కుటుంబంలో రచ్చకీడ్చబడ్డాయని, వ్రేలంతలు కొండంతలుగా చూపబడ్డాయని షమీ తెలిపారు. తనని జట్టు నుండి తొలగించివేయాలన్న BCCI నిర్ణయం తనకి తృణప్రాయమని, తన బాధంతా తన కూతురు గురించేనని తెలిపాడు. [11]
మొదటి పెళ్ళితోనే తాను పుట్టెడు దు:ఖంతో ఉన్నాడని, ఇటువంటి పరిస్థితులలో నేను రెండవ పెళ్ళి గురించి ఆలోచించే స్థితి లేదని షమీ పత్రికాముఖంగా తెలియజేశాడు. [12] తమ అమ్మాయి తనతో లేని వెలితి తనను తీవ్రంగా బాధిస్తోందని మథనపడుతోనే ఒకవేళ తాను రెండవ పెళ్ళి చేసుకొంటే, హసీన్ కు ఆహ్వానం పంపుతాననని చమత్కరించాడు.
షమీ ప్రత్యారోపణలు
మార్చుహసీన్ తన మొదటి వివాహం గురించి తన వద్ద దాచినదని షమి ఆరోపించారు. [13] మొదటి వివాహంలో కలిగిన సంతానం తన సంతానం కాదని, చనిపోయిన తన అక్క పిల్లలని చెప్పినట్లు షమి తెలిపారు.
తాను జీవితంలో చేసిన ఒకే ఒక్క అతి పెద్ద నేరం, హసీన్ ను వివాహమాడటమే నని, దేశం కోసం తాను ప్రాణాలు ఇవ్వగలను గానీ, ద్రోహం చేయలేనని షమి తెలిపారు. గడచిన కొద్ది రోజులు ఈ నిరాధార ఆరోపణలతో తాను మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని, వేళకు భోంచేయలేకపోతున్నాని, ఇక క్రికెట్ ప్రాక్టీసు పూర్తిగా నిలిచిపోయినదని తెలిపాడు. మాటిమాటికీ తన పై వేసిన ఆరోపణలను క్షుణ్ణంగా విచారణ జరిపించవలసిందిగా కోరినట్లు షమీ తెలిపాడు. [14]
షమీని సమర్థించిన ఇతరులు
మార్చుషమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్దిఖీ, షమీ బహు సిగ్గరి అని హసీన్ జహాన్ ఆరోపణలు అబద్దాలని షమీకి వత్తాసు పలికాడు. [15].
షమీ స్వస్థలంలో వారు మాత్రం ఒక కల చెదిరినట్లు భావించారు. తమ ముందు ప్లాస్టిక్ బాల్ తో క్రికెట్ ఆడిన కుర్రాడు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించటం, అందాల యువరాణిని పెళ్ళి చేసుకుని తమ ఊరికి తీసుకురావటం, భార్యను తన బైక్ పై ఎక్కించుకొని ఊరిలోని ముఖ్యప్రదేశాలను షమి ఆమెకు చూపించటం, ఇవన్నీ తమ కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని, ఇంతలోనే ఇలా జరగటం బాధాకరంగా ఉందని తెలిపారు. ఊరి పొలిమేరలో షమీ ఒక పెద్ద ప్లాటు కొన్నాడని, దాని పేరు హసీ ఫాం హౌస్ అనీ, తమ ఇంటిని వారు అందులో నిర్మించుకోవాలనుకొన్నారని తెలిపారు. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారని, ఊరు ఊరంతా హసీన్ ను రాజకుమారిగా పరిగణించేవారని, దంపతులకు మర్యాదలు చేసేవారని షమీ సమీప బంధువొకరు తెలిపారు. షమీ పై అభియోగాలు నమ్మశక్యంగా లేవని, హసీన్ ఆధునిక దుస్తులు ధరించినపుడు సోషల్ నెట్వర్కులో షమీ తీవ్ర విమర్శలనెదుర్కొన్నా, హసీన్ ను పల్లెత్తు మాట అనలేదని షమీ స్నేహితుడు ఒకరు తెలిపారు. షమీ ఇల్లు పాతపద్ధతులలో నిర్మించినా, అందులో అన్ని ఆధునిక హంగులూ ఉన్నట్లు టైంస్ ఆఫ్ ఇండియా తెలిపినది. హసీన్ కు ప్రత్యేకంగా ఒక గది కేటాయించామని, వారు కోల్ కటా నుండి ఎప్పుడు వచ్చినా, హసీన్ కు కావలసినవి ఏవీ కొరవడకుండా ఉండాలని తాము తాపత్రయపడేవారమని, మరొక బంధువు టైంస్ ఆఫ్ ఇండియాకు వివరించారు. [16]
పర్యవసానాలు
మార్చుఈ విమర్శలతో BCCI తమతో ఒప్పందం కుదుర్చుకొన్న ఆటగాళ్ళ జాబితా నుండి షమీ పేరును తొలగించివేసింది.
హసీన్ జహాన్ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదుల ఆధారపరచుకొని షమి, అతని కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల పై కోల్‌కతా జాదవ్ పూర్ పోలీసులు సెక్షను 498 ఏ (స్త్రీ పై భర్త/అతని కుటుంబ సభ్యుల క్రౌర్యం), సెక్షను 307 (హత్యాయత్నం), సెక్షను 323 - కావాలని గాయపరచటం, సెక్షను 376 - మానభంగం, సెక్షను 506 - బెదిరింపుల క్రింద కేసులను నమోదు చేసారు. [17]
తమపై నమోదైన కేసులను ఛేదించటానికి ఉత్తర్ ప్రదేశ్ లోని అంరోహాలో గల తమ నివాసానికి వచ్చిన పోలీసులకు షమీ, అతని కుటుంబ సభ్యులు పూర్తిగా సహాయ సహకారాలను అందించారు. హసీన్ నాపై వేసిన నిరాధార ఆరోపణలలో సగానికి సగం నిరూపించలేకపోయింది. ఇంకా ఆమె ఎంత దూరం వెళ్ళదలచుకొందో వేచి చూడాలి. దీనిని పరిష్కరించుకోవాలన్న తన ప్రయత్నాలని బూడిదలో పోసిన పన్నీరే అయినదని, చట్టపరంగా ఎదుర్కోవటం తప్పితే తనకు కూడా వేరే గత్యంతరం లేదని తెలిపాడు. [18]
ఆలిష్భా వివరణ
మార్చుతనకు షమీకి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవని, షమీకి ఉన్న లక్షలాది అభిమానులలో తాను కూడా ఒకరిని అని, ఈ విషయం స్పష్టం చేయటానికి తాను ఎక్కడికైనా రావటానికి సిద్ధం అని పాకిస్థాన్ కు చెందిన అలిష్బా తెలిపినది. దుబాయిలో ఒక సాయంత్రం షమీని అభిమానిగా తాను కలిసిన మాట వాస్తవమే కానీ, ఆ రాత్రి అతనితో గడపలేదని, షార్జాలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళినదని తెలిపినది. అయితే మరునాడు ఉదయం షమీని అల్పాహార విందుకై కలిసానని తెలిపారు. షమీకి మొహమ్మద్ భాయ్ నుండి అలిష్బా ద్వారా పెద్దమొత్తంలో ధనం ముట్టజెప్పే ఆరోపణలు అవాస్తవమైన్ తెలిపారు. [19]
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై షమీకి ఊరట
మార్చు22 మార్చి 2018 న షమీ ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (COA) తేల్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుండి షమీ విముక్తుడు కావటంతో BCCI షమీతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒప్పందం కుదుర్చుకొంది. [20]. షమీ వ్యక్తిగత జీవితం, అతని భార్య అతని పై వేసిన అక్రమ సంబంధ ఆరోపణలతో మాకు పనిలేదు. మా దృష్టంతా హసీన్ జహాన్ షమీ పై మ్యాచ్-ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలపైనే. వాటికి సాక్ష్యంగా వారిరువురి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణపైనే. ఆ ఆడియోపై మేము సంబంధింత అధికారులను విచారణ చేపట్టవలసినదిగా కోరాం. [21] దేశద్రోహ ఆరోపణలలో తనను తాను నిర్దోషిగా నిరూపించుకొంటాడనే ఆత్మవిశ్వాసం తనుకు మొదటి నుండి ఉన్నదని, అయితే ఇటువంటి ఆరోపణలలో ఎక్కడ ఇరుక్కుపోతానో అనే భయం వేసిందని తెలిపారు. BCCI కి తానెప్పటికి ఋణపడి ఉంటానని తెలిపాడు. [22]. దీనికి స్పందిస్తూ హసీన్ జహాన్ తరఫు న్యాయవాది, తాము ఎప్పుడూ షమీ పై ఫిక్సింగ్ ఆరోపణలు లిఖితపూర్వకంగా గానీ, మాటలలోగానీ చేయలేదని BCCI విచారణ లోపభూష్టం కాదని చెప్పలేమని తెలిపాడు. [23].
షమీ పై వ్యక్తిగతంగా ఒత్తిడి తేవాలన్న హసీన్ జహాన్ అభ్యర్థనలను BCCI ప్రెసిడెంట్ సీ కే ఖన్నా తోసిపుచ్చారు. హసీన్-షమీ ల మధ్య ఉన్న వ్యక్తిగత-కుటుంబ భేదాభిప్రాయాలలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపారు. [24].
షమీ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలు
మార్చు24 మార్చి న షమీ రోడ్డు ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. దీనితో అతని నుదుటికి గాయమై కొన్ని కుట్లు పడినవి. షమీని చూడటానికి హసీన్ అమ్మాయి ఐరాతో బాటు ఆసుపత్రికి వచ్చారు. షమీ ఐరాని కలిసి ఆమెతో ఆటలాడారని, కానీ తనని మాత్రం కలవలేదని, తనని ఇకపై కలిసేది కోర్టులోనే అని షమీ తెలిపినట్లు హసీన్ వెల్లడించింది. [25].
భరణం కోరిన హసీన్
మార్చుతన, తమ అమ్మాయి రోజువారి ఖర్చుల కోసం నెలకు పదిహేను లక్షల భరణం కావాలని హసీన్ జహాన్ 2018 ఏప్రిల్ 11 న ఆలీపూర్ కోర్టులో దావా వేసింది. ఈ దావా నిమిత్తం పది లక్షలు రోజులలో షమీ కోర్టుకు రావాలని కోర్టు తీర్పునిచ్చింది. హసీన్ షమీ పై ఆరోపణలు చేసినప్పటి నుండి, షమీ హసీన్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, లక్ష రూపాయలకు ఇచ్చిన చెక్కు బౌన్సు అయిందని, సంవత్సరానికి 100 కోట్లు సంపాదించే షమీకి ఈ భరణం చెల్లించటం పెద్ద విషయం కాదని తెలిపారు. ఈ పిటిషన్ లో హసీన్ జాదవ్ పూర్ అపార్టుమెంటు నుండి గెంటివేయబడకుండా, తమ అమ్మాయిని తన నుండి దూరం చేయకుండా ఉండేందుకు రక్షణను కోరారు. తాను అన్నివిధాల నష్టపోయానని, షమీ బాధ్యతల నుండి తప్పించుకోవటం వలనే వేరే గతి లేక ఈ దావా వేయవలసి వచ్చినది అని హసీన్ తెలిపింది. [26] [27].
భరణం కేసులో హసీన్ కు చుక్కెదురు
మార్చుఅలీపూర్ కోర్టు, హసీన్ జహాన్ కు భరణం మంజూరు చేయకపోవటంతో హసీన్ కు చుక్కెదురు అయ్యింది. షమీపై హసీన్ చేసిన ఆరోపణలను త్రిప్పికొట్టినది. అయితే వీరిద్దరి సంతానం అయిన ఆయిరా షమీకి మాత్రం కోర్టు రూ. 80,000 వేలను మంజూరు చేసింది. మొదటి నుండి షమీ తమ కూతురికి భరణం కట్టటం అభ్యంతరపెట్టలేదని, మోడలింగ్/నటన వైపు మొగ్గు చూపుతోన్న, హసీన్ కు మాత్రం భరణం కట్టేది లేదని స్పష్టం చేసినట్లు షమీ తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి జవాబుగా హసీన్ తరఫు న్యాయవాది, హసీన్ తన మోడలింగ్/నటన లను ఇంకా కేవలం పరిశీలన దశలో మాత్రమే ఉందని, ఈ తీర్పుపై తాము హై కోర్టులో తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. [28]
భద్రత కోరిన షమీ
మార్చుహసీన్ కు తనకు మధ్య దెబ్బతిన్న సంబంధాలు, వివిధ టోర్నమెంట్లలో తాను భారత్ కు ప్రతినిధిగా వ్యవహరించవలసిన అవసరాల్ దృష్ట్యా తనకు భద్రత అవసరం అని, ఒక గన్ మెన్ ను ఏర్పాటు చేయాలని షమీ అంరోహా జిల్లా మేజిస్ట్రేట్ కు దరఖాస్తు చేసుకొన్నాడు. [29]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ సాంఘిక మాధ్యమాలలో తన భర్త మొహమ్మద్ షమీ అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని పోస్టు చేసిన హసీన్ జహాన్ (ద హిందు - 7 మార్చి 2018)
- ↑ ఎస్ కే సైఫుద్దీన్ హసీన్ మొదటి భర్త (డెక్కన్ క్రానికల్ - 11 మార్చి 2018)
- ↑ అదివరకే పూర్వపు వివాహంలో విడాకులు తీసుకున్న హసీన్, పూర్వపు వివాహంలో కలిగిన ఇద్దరు కుమార్తెలలో ఒకరు హసీన్ వద్దే (డెక్కన్ క్రానికల్ - 10 మార్చి 2018)
- ↑ తన ఫోన్ నా చేతికి చిక్కకుంటే ఉత్తర్ ప్రదేశ్ పారిపోయి నాకు విడాకుల నోటీసు ఇచ్చి ఉండేవాడు - హసీన్ జహాన్ (డెక్కన్ క్రానికల్ - 13 మార్చి 2018)
- ↑ షమీ కి దేహశుద్ధి చేయండి - హసీన్ (డెక్కన్ క్రానికల్ - 20 మార్చి 2018)
- ↑ రెండవ పెళ్ళికి సిద్ధపడ్డ షమీ - హసీన్ ఆరోపణ (ఇండియా టుడే - 12 జూన్ 2018)
- ↑ మోసగాడైన షమీకి అన్ని వైపుల నుండు మద్దలు లభిస్తోందని సాంఘిక మాధ్యమాలలో వాపోయిన హసీన్ (టైంస్ నౌ - 02-ఆగష్టు-2018)
- ↑ తనపై ఆరోపణలను ఖండించిన షమి (ద హిందు - 7 మార్చి 2018)
- ↑ ఫిక్సింగు ఋజువైతే నన్ను ఉరి తీయండి - షమీ (ఈనాడు - 16 మార్చి 2018)[permanent dead link]
- ↑ హసీన్ తో ఇక నేను కలిసి జీవించలేను - షమీ (డెక్కన్ క్రానికల్ - 16 మార్చి 2018)
- ↑ నేనేమిటో నా జట్టుకు తెలుసు - షమీ (డెక్కన్ క్రానికల్ - 17 మార్చి 2018)
- ↑ రెండవ పెళ్ళి గురించి ఆలోచించే స్థితిలో నేను లేను - మొహమ్మద్ షమీ (డి ఎన్ ఏ ఇండియా - 12 జూన్ 2018)
- ↑ మొదటి పెళ్ళి, పిల్లలు, విడాకుల గురించిన వివరాలను దాచిన హసీన్ (డెక్కన్ క్రానికల్ - 15 మార్చి 2018)
- ↑ నా పై వేసిన ఆరోపణలను విచారణ చెయ్యండి (డెక్కన్ క్రానికల్ - 19 మార్చి 2018)
- ↑ షమీ కి కోచ్ వెన్నుదన్ను (డెక్కన్ క్రానికల్ - 13 మార్చి 2018)
- ↑ హసీన్ ను యువరాణిగా చూసుకొన్న గ్రామస్తులు, హసీన్ కు అన్ని వసతులు అమర్చిన షమీ (టైంస్ ఆఫ్ ఇండియా - 11 మార్చి 2018)
- ↑ షమి పై నమోదైన కేసులు (ద హిందు - 9 మార్చి 2018)
- ↑ యుద్ధం శరణం గచ్ఛామి - షమీ (డెక్కన్ క్రానికల్ - 19 మార్చి 2018)
- ↑ నేను కేవలం షమీ అభిమానిని మాత్రమే - అలిష్బా (డెక్కన్ క్రానికల్ - 19 మార్చి 2018)
- ↑ షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదని తేల్చిన COA (ద హిందూ - 22 మార్చి 2018)
- ↑ షమీ వ్యక్తిగత జీవితం గురించి మాకు అనవసరం - BCCI (టైంస్ ఆఫ్ ఇండియా - 23 మార్చి 2018)
- ↑ చట్టాల కోరలలో ఎక్కడ ఇరుక్కుపోతానో అని భయం వేసింది - షమీ (టైంస్ ఆఫ్ ఇండియా - 22 మార్చి 2018)
- ↑ "మా ఆరోపణలు మ్యాచ్ ఫిక్సింగ్ పై కావు, BCCI దర్యాప్తు చేసే పద్ధతి ఎలాంటిదో మాకు తెలుసు - జాకీర్ హుసెన్, హసీన్ జహాన్ తరపు వకీలు (డెక్కన్ క్రానికల్ - 23 మార్చి 2018)". Archived from the original on 2018-03-23. Retrieved 2018-03-23.
- ↑ షమీ పై వ్యక్తిగతంగా ఒత్తిడి తేవడం కుదరదు - BCCI ప్రెసిడెంట్ సీ కే ఖన్నా (డీ ఎన్ ఏ - 31 మార్చి 2018)
- ↑ ఇకపై నిన్ను కలిసేది కోర్టులోనే - షమీ (డెక్కన్ క్రానికల్ - 28 మార్చి 2018)
- ↑ "షమీ నుండి నెలకు పదిహేను లక్షల భరణం కావాలని కోరిన హసీన్ (డెక్కన్ క్రానికల్ - 11 ఏప్రిల్ 2018)". Archived from the original on 2018-04-30. Retrieved 2018-04-12.
- ↑ జాదవ్ పూర్ అపార్టుమెంటు నుండి గెంటివేయబడకుండా, తమ అమ్మాయిని తన నుండి దూరం చేయకుండా ఉండేందుకు రక్షణ కోరిన హసీన్ (టైమ్స్ ఆఫి ఇండియా - 11 ఏప్రిల్ 2018))
- ↑ భరణం కేసులో హసీన్ కు చుక్కెదురు (డెక్కన్ క్రానికల్ - 19 ఆగష్టు 2018)
- ↑ భద్రత కోరిన షమీ (ఇండియా టుడే 01-అక్టోబరు-2018)