మొహ్లా
మొహ్లా, భారతదేశం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జనాభా లెక్కల పట్టణం.ఇది కొత్తగా సృష్టించబడిన మొహ్లా మన్పూర్ అంబగఢ్ చౌకీ జిల్లాకు జిల్లా కేంద్రంగా పనిచేస్తుంది.[1] [2]
జనాభా గణాంకాలు
మార్చుమొహ్లా పట్టణ జనాభా 4,952. ఇది రాజ్‌నంద్‌గావ్ నుండి 75 కిమీ దూరంలో ఉంది. అంబాగర్ చౌకీ నుండి 25 కిమీ దూరంలో ఉంది.[3] మొహ్లా పూర్వ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఉంది, మొహ్లా పట్టణంలో మొత్తం 1106 కుటుంబాలు నివసిస్తున్న ఒక పెద్ద గ్రామం. 2011 జనాభా లెక్కల ప్రకారం మోహ్లా గ్రామంలో 4952 మంది జనాభా ఉన్నారు, వీరిలో 2685 మంది పురుషులు కాగా, 2267 మంది స్త్రీలు ఉన్నారు.[4]
మొహ్లా గ్రామ జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 539 మంది ఉన్నారు. ఇది గ్రామ జనాభాలో 10.88% ఉంది. మోహ్లా గ్రామం సగటు లింగ నిష్పత్తి 844, ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సగటు 991 కంటే తక్కువగా ఉంది. జనాభా లెక్కల ప్రకారం మొహ్లాలో పిల్లల లింగ నిష్పత్తి 821, ఛత్తీస్‌గఢ్ సగటు లింగ నిష్పత్తి 969 కంటే తక్కువ.
ఛత్తీస్‌గఢ్‌తో పోలిస్తే మోహ్లా గ్రామంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. 2011 ఛత్తీస్‌గఢ్‌లోని 70.28 % అక్షరాస్యత శాతంతో పోలిస్తే మోహ్లా గ్రామం అక్షరాస్యత రేటు 87.81 % ఉంది. మొహ్లాలో పురుషుల అక్షరాస్యత 94.31% ఉండగా స్త్రీల అక్షరాస్యత రేటు 80.14%.
మూలాలు
మార్చు- ↑ "Mohla town to serve as district HQ". www.google.com. Retrieved 2022-11-04.
- ↑ "Mohla Taluk Population Rajnandgaon, Chhattisgarh, List of Villages & Towns in Mohla Taluk". Censusindia2011.com. Retrieved 2022-11-04.
- ↑ "Mohla Taluk Population Rajnandgaon, Chhattisgarh, List of Villages & Towns in Mohla Taluk". Censusindia2011.com. Retrieved 2022-11-04.
- ↑ "Mohla Village Population - Mohla - Rajnandgaon, Chhattisgarh". www.census2011.co.in. Retrieved 2023-08-08.