రాజ్‌నంద్‌గావ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని నగరం. 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం నగర జనాభా 1,63,122.[2] రాజనంద్‌గావ్ జిల్లాను 1973 జనవరి 26 న దుర్గ్ జిల్లాను విభజించి ఏర్పాటు చేసారు.[4]

రాజనందగావ్
నగరం
Nickname: 
నందగావ్
రాజనందగావ్ is located in Chhattisgarh
రాజనందగావ్
రాజనందగావ్
ఛత్తీస్‌గఢ్ పటంలో నగర స్థానం
Coordinates: 21°06′N 81°02′E / 21.10°N 81.03°E / 21.10; 81.03
దేశం India
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లారాజనందగావ్
Government
విస్తీర్ణం
 • Total70 కి.మీ2 (30 చ. మై)
Elevation
307 మీ (1,007 అ.)
జనాభా
 (2011)[2][3]
 • Total1,63,122
 • Rank6 (రాష్ట్రంలో)
 • జనసాంద్రత2,300/కి.మీ2 (6,000/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
491441
Telephone code07744
Vehicle registrationCG-08
లింగనిష్పత్తి1023 /

ఒరిజినల్‌గా దీని పేరు నందగావ్. రాజ నంద్ గావ్ రాజ్యాన్ని సోమవంశీయులు, కాలచుర్యులు, మరాఠాలు పాలించారు.[5] రాజనంద్‌గావ్ పట్టణంలోని రాజభవనాలు పాలకులు, వారి సమాజం, సంస్కృతి, ఆ కాలపు సంప్రదాయాల గురించిన కథలను వెల్లడిస్తాయి.[4]

ఈ నగరాన్ని వైష్ణవ్, గోండు రాజా అనే హిందూ సంరక్షకుల (బైరాగులు) రాజవంశాలు పాలించాయి. దత్తత ద్వారా వీరికి వారసత్వం వచ్చింది. 18 వ శతాబ్దం చివరిలో పంజాబ్ నుండి వచ్చిన మత బ్రహ్మచారి ఈ రాజ్యానికి పునాది వేసాడు. స్థాపకుడి నుండి 1879 వరకు అతని శిష్యుల పాలనలో ఉంటూ వచింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాలకుడిని వంశపారంపర్య అధిపతిగా గుర్తించి, రాజనందగావ్‌ను సంస్థానంగా ఏర్పరచింది. మొదటి పాలకుడు ఖాసి దాస్ మహంత్ ను 1865 లో బ్రిటిష్ ప్రభుత్వం జమీందారుగా గుర్తించింది. అతనికి దత్తత తీసుకునే సనదు నిచ్చింది. తరువాత బ్రిటిష్ వారు పాలక మహాంత్‌కు రాజా అనే బిరుదును ప్రదానం చేశారు.[6][7]

జనాభా

మార్చు

2011 జనాభా లెక్కలు

మార్చు

2011 భారత జనగణన ప్రకారం,[2] రాజ్‌నంద్‌గావ్ జనాభా 1,63,114, ఇందులో పురుషులు 81,929 కాగా, మహిళలు 81,185 మంది ఉన్నారు. రాజ్‌నంద్‌గావ్ సగటు అక్షరాస్యత 86.83%, పురుషుల అక్షరాస్యత 92.55%, స్త్రీల అక్షరాస్యత 81.08%.

2001 నాటికి,[8] రాజనంద్‌గావ్ జనాభా 143,727. జనాభాలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. రాజ్‌నంద్‌గావ్ సగటు అక్షరాస్యత 73%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 65%. రాజ్‌నంద్‌గావ్‌లో, 13% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

భౌగోళికం

మార్చు

రాజ్‌నంద్‌గావ్ 21°06′N 81°02′E / 21.10°N 81.03°E / 21.10; 81.03 వద్ద ఉంది.[9] సముద్ర మట్టం నుండి దీని సగటు ఎత్తు 307 మీటర్లు.

శీతోష్ణస్థితి

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Rajnandgaon (1981–2010, extremes 1980–2008)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 34.1
(93.4)
36.7
(98.1)
40.2
(104.4)
44.4
(111.9)
46.7
(116.1)
45.6
(114.1)
40.4
(104.7)
40.5
(104.9)
35.4
(95.7)
38.0
(100.4)
33.2
(91.8)
31.6
(88.9)
46.7
(116.1)
సగటు అధిక °C (°F) 24.0
(75.2)
29.0
(84.2)
32.9
(91.2)
37.0
(98.6)
39.5
(103.1)
34.8
(94.6)
30.4
(86.7)
28.6
(83.5)
29.2
(84.6)
29.6
(85.3)
26.4
(79.5)
24.2
(75.6)
30.5
(86.9)
సగటు అల్ప °C (°F) 13.3
(55.9)
15.2
(59.4)
18.7
(65.7)
23.1
(73.6)
25.3
(77.5)
24.1
(75.4)
23.5
(74.3)
23.3
(73.9)
23.2
(73.8)
21.3
(70.3)
17.0
(62.6)
13.5
(56.3)
20.1
(68.2)
అత్యల్ప రికార్డు °C (°F) 6.0
(42.8)
6.2
(43.2)
10.2
(50.4)
13.8
(56.8)
18.0
(64.4)
14.0
(57.2)
12.0
(53.6)
17.9
(64.2)
16.0
(60.8)
15.4
(59.7)
10.0
(50.0)
7.4
(45.3)
6.0
(42.8)
సగటు వర్షపాతం mm (inches) 13.7
(0.54)
12.6
(0.50)
20.1
(0.79)
11.4
(0.45)
28.4
(1.12)
171.9
(6.77)
273.3
(10.76)
312.7
(12.31)
163.1
(6.42)
60.5
(2.38)
4.5
(0.18)
7.9
(0.31)
1,080.1
(42.52)
సగటు వర్షపాతపు రోజులు 1.3 0.9 1.5 1.0 2.1 7.8 11.6 14.3 8.3 2.8 0.5 0.5 52.8
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 52 39 34 23 30 52 74 80 77 67 54 58 53
Source: India Meteorological Department[10][11]

రవాణా

మార్చు

రైల్వేలు

మార్చు

రాజ్‌నంద్‌గావ్ రైల్వే స్టేషన్ హౌరా-నాగ్‌పూర్-ముంబై మార్గంలో ఉంది. ఈ స్టేషన్ SECR లో నాగపూర్ డివిజన్ కిందకి వస్తుంది. లోకల్ రైళ్లు పశ్చిమాన డోంగర్‌గఢ్, నాగపూర్ స్టేషన్‌కు, తూర్పున రాయ్‌పూర్‌కు తరచుగా సర్వీసులు అందిస్తుండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగుళూరు, పూణే వంటి అన్ని మెట్రో నగరాలకు నేరుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. బిలాస్‌పూర్, రాయ్‌పూర్, దుర్గ్‌ల తర్వాత రాజ్‌నంద్‌గావ్ స్టేషను రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో నాల్గవది. ఈ రైల్వే స్టేషన్‌లో బాగా అభివృద్ధి చెందిన నాలుగు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. నగరం నుండి రోజూ 190 కి పైగా రైళ్లు ప్రయాణిస్తాయి. ఇండోర్, భోపాల్, జబల్పూర్, గ్వాలియర్, నాగపూర్, గోండియా, వార్ధా, ముంబై, పూణే, నాసిక్, హపా, చెన్నై, త్రివేండ్రం, పాట్నా మొదలైన ప్రాంతాలకు డైరెక్ట్ రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.

బస్సు

మార్చు

రాజ్‌నంద్‌గావ్‌లో పాత బస్టాండు, కొత్త బస్టాండు అనే రెండు బస్టాండ్లు ఉన్నాయి. సమీప నగరాలు, గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంది. అయితే సుదూర బస్సు కనెక్టివిటీ అంత బాగా లేదు.

మూలాలు

మార్చు
  1. "Rajnandgaon City".
  2. 2.0 2.1 2.2 "census 2011". Retrieved 29 January 2013. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "cen2011" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
  4. 4.0 4.1 "official website of rajnandgaon". Archived from the original on 2015-02-09. Retrieved 2021-09-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "rajnand" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "Official Website of District Rajnandgaon". Archived from the original on 2013-02-02. Retrieved 2021-12-23.
  6. Chhattisgarh ki Riyaste/Princely stastes aur Jamindariyaa. Raipur: Vaibhav Prakashan. ISBN 81-89244-96-5.
  7. Chhattisgarh ki Janjaatiyaa/Tribes aur Jatiyaa/Castes. Delhi: Mansi publication. ISBN 978-81-89559-32-8.
  8. "census 2001". Retrieved 29 January 2013.
  9. Falling Rain Genomics, Inc - Raj Nandgaon
  10. "Station: Rajnandgaon Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 653–654. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  11. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M45. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.