మోంటే అగుల
మోంటే అగుల ("గ్రద్ద పర్వతం" అని అర్థం) చిలీ దేశపు బయో ప్రాంతం లోని గ్రామం. దీని జనాభా 6,574..[1] [2] [3] 2002 లో దీని జనాభా 6,090. [4] ఈ పట్టణ ప్రజలలో ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడిన వారే. [5] లేదా సమీప నగరాల్లో, ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ లోను, ప్రాంతీయ రాజధాని కాన్సెప్సియన్లలోనూ ఉద్యోగాలు చేస్తూంటారు. ప్రస్తుతం, ఇక్కడి రైల్వే పరిశ్రమ వాడుకలో లేదు. దానికి సంబంధించిన నిర్మాణాలను చాలా వరకూ వదలివేసారు. ఎందుకంటే అవి ఎంప్రెసా డి లాస్ ఫెర్రోకారిల్స్ డెల్ ఎస్టాడో యాజమాన్యంలో ఉన్నాయి. దీనివలన కాబ్రెరో మునిసిపాలిటీ గానీ లేదా ఏదైనా ప్రైవేట్ సంస్థ గానీ ఈ నిర్మాణాలను స్వాధీనం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఇటీవల దీనిని కచేరీ వేదికగా, పిల్లలకు ఆటస్థలంగా మార్చారు. [6].
విద్య
మార్చు- మోంటే ఆగులాలో కింది పాఠశాలలు ఉన్నాయి.
- "ఓర్లాండో వెరా విల్లారోయెల్" ఎలిమెంటరీ స్కూల్.
- "ఆస్కార్ బోనిల్లా బ్రాడనోవిక్" హై స్కూల్.
- "మోంటే అగుయిలా కాలేజ్" ఎలిమెంటరీ స్కూల్.
- "అబెల్ ఇనోస్ట్రోజా గుటియ్రేజ్" ఎలిమెంటరీ స్కూల్.
- "ఎస్పెరంజా" ఎలిమెంటరీ స్కూల్.
ప్రముఖులు
మార్చుఈ పట్టణానికి చెందిన ప్రముఖుల జాబితా ఇలా ఉంది
- జోస్ సెపల్వేడా, "ఎల్ మాంటెగ్యులినో", చిలీ జానపద రచయిత.
- ఎడ్గార్డో అబ్దాలా, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, ప్రస్తుత పాలస్తీనా-చిలీ కోచ్.
- చిలీ జాతీయ ఫుట్‌బాల్ జట్టుతో అంతర్జాతీయంగా ఆడిన మాజీ చిలీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లూయిస్ చావారియా .
- రౌల్ కేసెస్ టోర్రెస్, చిలీ చిత్రకారుడు, రాజకీయవేత్త, చరిత్రకారుడు. [7]
- అన్వర్ ఫర్రాన్ వెలోసో, చిలీ టెలివిజన్ జర్నలిస్ట్. అతను టీవీఎన్ మెగా నెట్‌వర్క్‌ల కోసం పనిచేశాడు.
- ఎన్రిక్ ఎడ్వర్డ్స్ ఒరెగో (), చిలీ వ్యాపారవేత్త, రాజకీయవేత్త. [8]
చిత్ర మాలిక
మార్చు.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-28. Retrieved 2017-09-10.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-17. Retrieved 2017-09-10.
- ↑ http://www.ine.cl/estadisticas/censos/censos-de-poblacion-y-vivienda
- ↑ "2002 Chile Census. Synthesis of results" (PDF). April 3, 2003.
- ↑ ""Gente de mi Tierra", cultural program TV Channel TVC Mi Canal of the Municipality of Cabrero". December 15, 2015.
- ↑ "RENACE LA ESTACIÓN DE MONTE ÁGUILA ESTE... - Municipalidad de Cabrero | Facebook". December 4, 2017.
- ↑ "Poemas :Ciudades y Lugares por Raúl Alejandro Caces Torres" (in స్పానిష్). Archived from the original on 2019-11-10. Retrieved 2020-08-11.
- ↑ Nacional. "Biblioteca del Congreso Nacional | Historia Política". Retrieved 2020-08-11.
బాహ్య లంకెలు
మార్చుWikimedia Commons has media related to Monte Aguila.