మోతుకూరు అనంతాచారి
మోతుకూరు అనంతాచారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పూర్వ ప్రధానోపాద్యాయులు, కవి, రచయిత, సామాజిక కార్యకర్త.
మోతుకూరు అనంతాచారి | |
---|---|
జననం | 1941 కొండగడప, మోత్కూర్ మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ |
మరణం | జూలై 30, 2012 |
ఇతర పేర్లు | అనంతుడు |
ప్రసిద్ధి | పూర్వ ప్రధానోపాద్యాయులు, కవి, రచయిత, సామాజిక కార్యకర్త. |
తండ్రి | వీరబ్రహ్మాచారి |
తల్లి | కౌసల్య |
జననం
మార్చుఅనంతాచారి 1941లో వీరబ్రహ్మాచారి, కౌసల్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించారు.
ఉద్యోగం
మార్చుఉపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 35 సంవత్సరాలు పనిచేసి, కోటమర్తి ఉన్నత పారశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. అనంతాచారి దగ్గర విద్యను అభ్యసించినవారు ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు.
వీరి కలం పేరు 'అనంతుడు'. వీరు అనేక కథలు, నవలలు, వివిధ పత్రికలకు వ్యాసాలు రాశాలు. 1985 ప్రాంతంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రభూమి పత్రికల్లో విలేఖరిగా పనిచేశారు.
రచనలు
మార్చువీరు రచించిన గేయాలు, నాటికలు అనేకచోట్ల ప్రదర్శించబడ్డాయి, బహుమతులందుకున్నాయి. గద్య, పద్య కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి, రేడియోలో ప్రసారం చేయబడ్డాయి. గతంలో వీరు రచించిన ప్రబోధ గీతములు (బాల సాహిత్య ప్రచురణ) పిల్లలను ఆకట్టుకుంది.
ముద్రిత రచనలు
మార్చు- ప్రబోధ గీతములు (1976 నవంబరు)
- అక్షర గీతం (గేయ సంపుటి) (1992 జనవరి)
- మాట్లాడే మంటలు (2000 జనవరి)
అనంతుడు ఫౌండేషన్
మార్చుఅనంతుడి కుమారులు, అనంతుడి మిత్రులు కలిసి 2014, జూలై 30న కొండగడపలో అనంతుడు ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్ధమాన రచయితల రచనలను పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నారు.[1]
మూలాలు
మార్చు- ↑ డైలీ హంట్. "సుడిగాలి (కథానిక)". m.dailyhunt.in. Retrieved 4 February 2017.[permanent dead link]
- మాట్లాడే మంటలు (కవితా సంపుటి), సాక్షర సదన్, కొండగడప ప్రచురణ, జనవరి 2000.