మోదుగుల రవికృష్ణ
మోదుగుల రవికృష్ణ తెలుగు భాషా ఉపాధ్యాయుడు, పుస్తక రచయిత, సంపాదకుడు, ప్రచురణకర్త.[1]
మోదుగుల రవికృష్ణ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1973 మే 15 |
వృత్తి | ఉపాధ్యాయుడు |
భాష | తెలుగు |
జాతీయత | భారత దేశం |
పౌరసత్వం | భారత దేశం |
పురస్కారాలు | నాగభైరవ స్ఫూర్తి పురస్కారం గిడుగు రామమూర్తి మాతృభాషా దినోత్సవ పురస్కారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారం యశస్వీ సాహితీ పురస్కారం |
బాల్యం, విద్య
మార్చురవికృష్ణ మే 15 , 1973న గుంటూరు జిల్లాలోని బాపట్లలో పుట్టాడు. మోదుగుల రామలక్ష్మి, జయరామిరెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఇతను పాఠశాల విద్య, డిగ్రీ బాపట్లలోనే పూర్తి చేసాడు. బి.ఎడ్, ఎం.ఎడ్ గుంటూరు ఆర్‌వీఆర్‌ఆర్ బి.ఎడ్. కళాశాలలో, ఎం.ఎ. దూరవిద్యా విధానంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి, ఎం.ఫిల్. ఎం.ఎస్. విశ్వవిద్యాలయం, తమిళనాడు నుండి పూర్తి చేసాడు.
ఉద్యోగం
మార్చుతెలుగు బోధనా పద్ధతులు అధ్యాపకునిగా గుంటూరులోని ఆర్‌వీఆర్‌ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా 2002 నుండి 2019 వరకు పని చేసాడు. 2019లో వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనుబంధ సంస్థ అయిన వివా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరి, ప్రస్తుతం అదే వృత్తిలో కొనసాగుతున్నాడు.
సాహిత్య ప్రచురణ
మార్చురవికృష్ణ ఇప్పటివరకు రచయితగా నాలుగు పుస్తకాలు, సంపాదకునిగా 26 పుస్తకాలను అందించారు. ఒకప్పుడు సాహిత్యానికి తలమానికగా ఉండి, ప్రస్తుతం ముద్రణలో లేని పుస్తకాలను సేకరించి, విపులమైన పాదసూచికలు, బొమ్మలు చేర్చి, ప్రచురించడం రవికృష్ణ చేపట్టిన పని.[2][3]
రచయితగా
మార్చు- తెలుగు బోధనా పద్ధతులు
- హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు మోనోగ్రాఫ్
- విఠ్ఠలకీర్తనలు అన్నమయ్యవా?
- మనవి మాటలు
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఏ. తెలుగు పాఠ్యగ్రంథం.
సంపాదకునిగా
మార్చు- నా యెఱుక
- రాయవాచకము
- హంపీ స్మృతులు
- అదిగో భద్రాద్రి
- మన పురావస్తు ప్రదర్శనశాలలు
- చారిత్రక వ్యాసమంజరి
- బౌద్ధయుగము
- సాహితీ సమరాంగణ సార్వభౌమ
- వనమాల
- కాశీయాత్ర
- గుంటూరు జిల్లా ప్రపంచమహాసభల ప్రత్యేక సంచిక
- మహామంజీరనాదం
- బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం కొన్ని విశేషాలు
- నివేదన
- రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక
- దేశభక్త కొండా వెంకటప్పయ్య స్వీయచరిత్ర, కొన్ని రచనలు
- వైష్ణవసాక్షి
- విశాలాంధ్రము
- ఏకాంతసేవ
- రజని
- జావళీలు (ప్రథమ భాగం)
- తొలి మలితరం తెలుగు కథలు
- అమరావతి పట్టణ నిర్మాత - రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు కథలు
- కాశీశతకం
- ఫిడేలు నాయుడు గారు
- కొండవీడు కైఫియతు
- తల్లివిన్కి
- పానుగంటి లక్ష్మీనరసింహారావు కథలు, స్వప్నకావ్యము, వ్యాసములు
- పలుకులమ్మ తోటమాలి
- అజో-విభొ- కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభావైజయంతి సంచికలు నాలుగు ( లంకా సూర్యనారాయణ, మొదలి నాగభూషణశర్మ, నగ్నముని, గిరిధర్ గౌడ్)
- మా బడి
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఎంపిక చేసిన కథలు
మూలాలు
మార్చు- ↑ మోదుగుల రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమ వివరాలు[permanent dead link]
- ↑ "కినిగె లో మోదుగుల రవికృష్ణ ప్రచురించిన కొన్ని పుస్తకాలు". Archived from the original on 2019-12-22. Retrieved 2020-04-20.
- ↑ మోదుగుల రవికృష్ణ పరిచయపత్రము