మాలు

(మోర్టార్ నుండి దారిమార్పు చెందింది)

మాలు (Mortar - మోర్టార్) అనగా రాళ్ళు, ఇటుకలు, కాంక్రీట్ ఇటుకదిమ్మల వంటి నిర్మాణ అచ్చులను ఒకటిగా కలుపుతూ కట్టడం కట్టుటకు ఉపయోగింపదగిన ఇసుక, సిమెంట్ల యొక్క అడుసు. ఈ మాలును కట్టడాల యొక్క క్రమరహిత అంతరాలను పూడ్చడానికి ఉపయోగిస్తారు. కొన్ని ప్రత్యేక ఇటుక గోడల నిర్మాణాల సమయంలో మాలు అలంకరణగా కనిపించుటకు మాలులో రంగులు కలుపుతారు. మాలును తాపీపని యొక్క అనేక నమూనాల తయారీలో ఉపయోగిస్తారు.

ఇటుక మధ్యన కూరే ఈ మాలు మొదట మెత్తగా బంకగా ఉండి ఎండిన తరువాత చాలా గట్టిగా అయి దానితో ఉన్నదానిని బలంగా అంటిపెట్టుకొని ఉంటుంది.

మాలు అనేది సాధారణంగా ఇసుక, బంధకం, నీరు యొక్క మిశ్రమముల ద్వారా తయారు చేయబడుతుంది. 20 వ శతాబ్దం నుంచి అత్యంత సాధారణ బంధకం పోర్ట్లాండ్ సిమెంట్, కానీ పురాతన బంధకం సున్నపు మాలు, ఈ మాలును ఇప్పటికీ కొన్ని కొత్త నిర్మాణములలో ఉపయోగిస్తున్నారు. సిమెంట్ మాలు బలంగా చాలా ఎక్కువ కాలం ఉండుటకు కట్టడం పని పూర్తయిన తరువాత రోజు నుంచి కొన్ని రోజుల పాటు (30 రోజులు) నీటితో తడుపుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మాలు&oldid=2883164" నుండి వెలికితీశారు