మోల్లెం జాతీయ ఉద్యానవనం
మోల్లెం జాతీయ ఉద్యానవనం గోవా రాష్ట్రంలోని మోల్లెం అనే ప్రాంతానికి చేరువలో ఉంది.
మోల్లెం జాతీయ ఉద్యానవనం
మోల్లెం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం | |
---|---|
National Park | |
Coordinates: 15°22′25″N 74°15′31″E / 15.37361°N 74.25861°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | గోవా |
జిల్లా | దక్షిణ గోవా |
స్థాపన | 1978 |
విస్తీర్ణం | |
• Total | 107 కి.మీ2 (41 చ. మై) |
Elevation | 890 మీ (2,920 అ.) |
భాషలు | |
• అధికారిక | కొంకణి |
Time zone | UTC+5:30 (భారతకాలమన ప్రకారం) |
పట్టణం | మార్గో |
IUCN category | II |
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనాన్ని 1978 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఇది 107 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.[1] ఈ ప్రాంతాన్ని మొదటగా మొల్లెం వినోద(గేమ్) ఉద్యానవనంగా ఉండేది. ఇది 1969 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించి భగవాన్ మహావీర్ అభయారణ్యంగా నామకరణం చేసి 1978 లో భగవాన్ మహావీర్ మోల్లెం జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. [2]
జంతు, వృక్ష సంపద
మార్చుఈ ఉద్యానవనంలో చిరుతపులులు, బెంగాల్ పులులు, జింకలు, మూషిక జింకలు, అడవి పందులు లాంటి ఎన్నో రకాల జంతువులకు ఆవాసంగా ఉంది.[3] ఈ ఉద్యానవనంలో సతత హరిత అడవులు, ఆకురాల్చే అడవులు ఉన్నాయి. ఇందులో సతత హరిత అడవులు అధిక ఎత్తులో ఉండి నది ఒడ్డున కనిపిస్తాయి.
మరిన్ని విశేషాలు
మార్చుఈ ఉద్యానవనంలో దుధ్‌సాగర్ జలపాతం ఉంది. ఈ జలపాతం ఉద్యానవనం నైరుతి భాగంలో ఉన్న కర్ణాటక సరిహద్దు వద్ద ఉన్న మాండోవి నదిపై ఉంది. ఇది గోవాలో ఉన్న ఎతైన జలపాతం (310 మీ), భారతదేశం లో ఐదవ ఎత్తైన జలపాతం. ఇదేకాక ఈ ఉద్యానవనంలో 12 వ శతాబ్దం కాలం నాటి శివాలయం ఉంది.
మూలాలు
మార్చు- ↑ "(9/10/2005) The Hindu, Bhagwan Mahavir Sanctuary". Archived from the original on 2006-06-24. Retrieved 2019-10-04.
- ↑ The Department of Science, Technology & Environment, Saligao – Bardez, Goa WILDLIFE SANCTUARIES & NATIONAL PARKS Archived 2016-10-24 at the Wayback Machine
- ↑ ATREE, Eco-Informatics Center, Bhagwan Mahavir or Mollem Wildlife Sanctuary Archived 2014-03-12 at the Wayback Machine, 2006