మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం

మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ నగరానికి సమీపంలో ఉన్న ఫెర్రాగుంజ్ అనే ప్రాంతంలో ఉంది.[1] 20 రూపాయల నోటు వెనుక వైపున ఉన్న చిత్రం మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ నుంచే తీసుకొనబడింది.

మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం
Centaur oakblue at Mt. Harriet National Park/ మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం
Location in Andaman and Nicobar Islands/అంమాన్,నికోబార్ ద్వీపములు.
ప్రదేశంఫెర్రాగుంజ్
సమీప నగరంపోర్ట్ బ్లెయిర్
విస్తీర్ణం46.62 చదరపు కిలోమీటర్లు (18.00 చ. మై.)
స్థాపితం1979

చరిత్ర

మార్చు

ఈ ఉద్యానవనం మొదట రిజర్వ్ ఫారెస్ట్, దీనిని 1969 లో జాతీయ ఉద్యానవనంగా మార్చారు. ఈ ఉద్యానవనం పేరుకు గల కారణం రాబర్ట్ క్రిస్టోఫర్ టైట్లర్ రెండవ భార్య అయినటువంటి బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటర్, నేచురలిస్ట్, ఫోటోగ్రాఫర్ హ్యారియెట్ సి. టైట్లర్ జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారు. ఉద్యానవనంలో ఉన్న అడవిలో నివసిస్తున్న నెగ్రిటో జాతికి చెందిన గిరిజన ప్రజలు. వీళ్ళ ప్రధాన వృత్తి వేటాడడం.[2]

మరిన్ని విశేషాలు

మార్చు

ఇది సుమారు 4.6 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఉద్యానవనంలో ఉన్న మౌంట్ హ్యారియెట్ (383 మీటర్లు) శిఖరం అండమాన్, నికోబార్ ద్వీపసమూహంలో ఉన్న శిఖరాల్లో సాడిల్ పీక్ (732 మీటర్లు), మౌంట్ తుల్లియర్ (568 మీటర్లు) తర్వాత ఇదే మూడో అతిపెద్ద శిఖరం. ఈ ఉద్యానవనం భూమధ్యరేఖకు సమీపంలో ఉండటం వల్ల ఇక్కడ సముద్ర వాతావరణ పరిస్థితులు, వేడి, తేమతో కూడిన భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ ఉద్యానవనంలో ట్రెక్కింగ్ సదుపాయం ఉంది. ట్రెక్కింగ్ చేసుకుంటూ ఉద్యానవనం చుట్టూ ఉన్న బీచ్లు, ఎవిఫానా జంతువులు, రకరకాల సీతాకోకచిలుకలను, ఏనుగులను ఎన్నో రకాల జంతువులను చూడవచ్చు.

మూలాలు

మార్చు
  1. "Robert Christopher Tytler". britishempire.co.uk. Retrieved 22 September 2019.
  2. "Mount Harriet National Park". Bird Life International. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 29 September 2019.