మౌషుమి భట్టాచార్య

జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె 2019 సెప్టెంబరు 16న శాశ్వత న్యాయమూర్తిగా నియమితురాలవగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయగా, మార్చి 29న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది.[1][2]

మౌషుమి భట్టాచార్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
28 మార్చి 2023
నియమించిన వారు ద్రౌపది ముర్ము

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
21 సెప్టెంబర్ 2017 – 27 మార్చి 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1967-10-27) 1967 అక్టోబరు 27 (వయసు 57)
కలకత్తా, పశ్చిమ బెంగాల్

జననం, విద్యాభాస్యం

మార్చు

మౌసమీ భట్టాచార్య 1967 అక్టోబరు 27న జన్మించింది. ఆమె రోటరీ అంబాసిడోరియల్ స్కాలర్‌షిప్‌తో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేసి కెనడా నేషనల్ కమిటీ ఆన్ అక్రిడేషన్ నుంచి సర్టిఫికెట్‌ను అందుకుంది.

వృత్తి జీవితం

మార్చు

మౌషుమి భట్టాచార్య 1996లో లా పూర్తిచేసి అనంతరం 1997లో పశ్చిమ్ బెంగాల్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని కోల్‌కతా, ఢిల్లీ, పట్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వాదించింది. ఆమె కంపెనీ లాబోర్డు, డీఆర్టీ, సెబీ, కాపీరైట్‌ బోర్డు, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ అప్పిలేట్‌ బోర్డు, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ బోర్డులకు సంబంధించిన కేసుల్లోనూ వాదనలు వినిపించింది. మౌషుమి భట్టాచార్య 2017 సెప్టెంబరు 21న కోల్‌కతా హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా[3] ఆ తర్వాత 2019 సెప్టెంబరు 16న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి అందుకుంది.[4]

మూలాలు

మార్చు
  1. Eenadu (29 March 2024). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ప్రమాణం". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  2. The Times of India (29 March 2024). "Justice Moushumi sworn in as judge in Telangana HC". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  3. "Calcutta High Court - Judges". www.calcuttahighcourt.gov.in. 2024. Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  4. Eenadu (19 March 2024). "హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.