మౌస్ డీర్

(మౌస్‌ డీర్‌ నుండి దారిమార్పు చెందింది)


మౌస్‌ డీర్‌ లేదా చెవ్రోటేన్‌ [1][2][3][4] అనునది ఒక రకమైన బుల్లి జింక. చెవ్రోటేన్‌ అంటే ఫ్రెంచి భాషలో చిన్న మేక అని అర్థం. ఇది గుండ్రని దేహంతో చిన్న చిన్న కాళ్లతో ఉంటుంది.

Chevrotains
Temporal range: Oligocene–Recent
Tragulus kanchil
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Clade: Choanozoa
Kingdom: జంతువు
Milne-Edwards, 1864
Genera

విశేషాలు

మార్చు
  • ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.అలానే వదిలేస్తే ఇక వీటి జాడే పూర్తిగా కనుమరుగైపోతుందని శాస్త్రవేత్తలు వీటి పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు.
  • హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఈ రెండు ఆడ జింకల్ని, ఒక మగ జింకను చండీగఢ్‌లోని చట్‌బిర్‌ జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్లారు. దక్షిణ భారతదేశ అడవుల్లాగే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటి సంఖ్య పెంచడానికి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పించారు. ఎట్టకేలకు ఈ ఒక్కో ఆడ జింక ఒక్కో జింక కూనకు జన్మనిచ్చింది.
  • ఈ జింక రాత్రుల్లో చురుగ్గా ఉంటుంది. ఇది 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, మూడు కిలోల బరువుంటుంది.
  • నెమరువేసుకునే జీవుల్లో పొట్టలో మూడు గదులుండే జీవి ఇదొక్కటే.
  • చిన్న చిన్న బొరియల్లో జీవిస్తూ పండ్లూ ఫలాలూ తింటూ బతికేస్తుంది. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షలు నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదు. మూషిక జింకలను స్థానిక గిరిజనులు వెదురు ఎలుకలని పిలుస్తారు. వీటికి భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు విన్నా ఏవైనా జంతువులు దాడి చేసేందుకు వచ్చిన ఎవరైనా వీటిని పట్టుకున్న భయంతో గుండె ఆగి మరణిస్తాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మాత్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు.ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే నివసిస్తుంటాయి.

పాపికొండల అభయారణ్యంలో

మార్చు

భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింక (మౌస్ డీర్) ల సంచారం పాపికొండలు అభయారణ్యంలో నూ ఉన్నట్టు వైల్డ్ లైఫ్ అధికారులు గుర్తించారు. అంతరించిన జంతువుల జాబితాలో కలిసిపోయిన ఆ బుల్లి ప్రాణులు ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి[5]. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఇటువంటి మార్పులు జరగలేదట[6].మూసిక జింకలను స్థానిక గిరిజనులు వెదురు ఎలుకలని పిలుస్తారు.వీటికి భయం ఎక్కువ పెద్ద శబ్దాలు విన్నా.. జంతువులు దాడి చేసేందుకు వచ్చినా ఎవరైనా వీటిని పట్టుకున్న భయంతో గుండె ఆగి మరణిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మాత్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు.ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే అడివిలో రాలిన పువ్వులు పండ్లు ఆకుల్ని తింటాయి.

మూలాలు

మార్చు
  1. Wilson, D.E.; Reeder, D.M., eds. (2005). Mammal Species of the World: A Taxonomic and Geographic Reference (3rd ed.). Johns Hopkins University Press. ISBN 978-0-8018-8221-0. OCLC 62265494.
  2. Groves, C., and E. Meijaard (2005). Intraspecific variation in Moschiola, the Indian Chevrotain. The Raffles Bulletin of Zoology. Supplement 12: 413–421
  3. Walker, M. (2009-07-07). "Aquatic deer and ancient whales". BBC News. Retrieved 2010-03-26.
  4. {{{assessors}}} (2008). Hyemoschus aquaticus. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 12 October 2010.
  5. "మూషిక జింక.. లగెత్తడమే ఇక.. ప్రపంచ జింక జాతు­ల్లో అతి చిన్నవి". Sakshi. 2023-05-19. Retrieved 2023-08-24. {{cite web}}: soft hyphen character in |title= at position 45 (help)
  6. "మూషిక జింకలు మళ్లీ పుడుతున్నాయ్! వాటిని మీరెప్పుడైనా చూశారా? - ts29" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-12-02. Retrieved 2023-08-24.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మౌస్_డీర్&oldid=3971731" నుండి వెలికితీశారు