యంగ్ టర్క్స్ విప్లవం

1908 ఒట్టోమన్ సామ్రాజ్యంలో రాజ్యాంగ పాలన పునరుద్ధరణ

ఒట్టోమాన్ సామ్రాజ్యంలో జరిగిన యంగ్ టర్క్ ఉద్యమం ద్వారా 1876 నాటి ఒట్టోమాన్ రాజ్యాంగాన్ని పున:స్థాపించడానికి, బహుళ పార్టీ వ్యవస్థను ఒట్టోమాన్ పార్లమెంటు కింద రెండు దశల ఎన్నికల విధానం, ఎన్నికల చట్టంలో ప్రవేశపెట్టడాన్నే యంగ్ టర్క్ విప్లవం (జూలై 1908) అంటారు. అంతకు మూడు దశాబ్దాల ముందు సుల్తాన్ మూడవ అబ్దుల్ హమీద్ రాజ్యాంగబద్ధ నియంతృత్వాన్ని, తద్వారా తొలి రాజ్యాంగ శకాన్ని ప్రారంభించినా అది కేవలం రెండేళ్ళు మాత్రమే సాగి రద్దయింది. జూలై 24, 1908న, సుల్తాన్ రెండవ అబ్దుల్ హమీద్ ఉద్యమానికి లొంగి, ఆ రాజ్యాంగ పున:స్థాపనకు ఆదేశించడంతో రెండవ రాజ్యాంగ శకం ప్రారంభమయ్యింది.

యంగ్ టర్క్స్ విప్లవం
ఒట్టొమాన్ సామ్రాజ్య ఓటమిలో భాగము

1908 లో ఒట్టోమన్ మిల్లెట్ల నాయకులు యంగ్ టర్క్ విప్లవం యొక్క ప్రకటన
తేదీజూలై 1908
ప్రదేశంఒట్టొమన్ సామ్రాజ్యం
ఫలితంయంగ్ టర్క్ విజయం
ప్రత్యర్థులు
Young Turks (Committee of Union and Progress)Ottoman Empire Ottoman Empire
సేనాపతులు, నాయకులు
Enver Bey
Ahmed Niyazi Bey
Rexhep Pasha Mati
Sultan Abdul Hamid II
Ottoman Empire Mehmed Ferid Pasha

ఒకప్పుడు రహస్య కార్యకలాపాలకు పరిమితమైన సంస్థలు రాజకీయ పార్టీలను స్థాపించాయి. [1] వాటిలో కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రస్ (CUP), ఫ్రీడం అండ్ అకార్డ్ పార్టీ లేదా లిబరల్ యూనియన్/లిబరల్ ఎన్టిటీ ప్రధాన పార్టీలు. అలాగే ఒట్టోమాన్ సోషలిస్ట్ పార్టీ వంటి చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. దీనికి మరోవైపు జాతులకు సంబంధించిన పార్టీలు ప్రధానంగా పీపుల్స్ ఫెడరేటివ్ పార్టీ (బల్గేరియన్ సెక్షన్), బల్గేరియన్ కాన్స్టిట్యూషనల్ క్లబ్స్, జ్యూయిష్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ఇన్ పాలస్తీనా, అల్-ఫతాత్, ఆర్మెనెకన్ పార్టీ, సోషల్ డెమోక్రాట్ హన్చకియన్ పార్టీ, ఆర్మేనియన్ రివల్యూషనరీ పార్టీ వంటివి ఉన్నాయి. వ్యాపారులు, సంపన్నులు ప్రధానంగా ఉన్న ఆర్మీనియన్ నేషనల్ అసెంబ్లీ స్థానాన్ని తీసుకుంటూ, ఒకప్పుడు చట్టవ్యతిరేకంగా గుర్తించబడ్డ ఆర్మీనియన్ రివల్యూషన్ ఫెడరేషన్, ఆర్మేనియన్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అయింది. [2] ఈ ఘటనను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపుకు ప్రపంచం వేసిన ప్రధానమైన అడుగుల్లో ఒకటిగా చరిత్రకారులు భావిస్తారు.

నేపథ్యం

మార్చు

అబ్దుల్ హమీద్ హయాం యొక్క మార్పులకు ఇష్టపడని కన్జర్వేటివ్ రాజకీయాలకు భిన్నంగా ఇదే సమయంలో సాంఘిక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. టర్కీలో ఉదారవాద వాతావరణం అభివృద్ధి చెందడం తదనంతర విప్లవానికి నేపథ్యంగా ఉపకరించింది. అబ్దుల్ హమీద్ రాజకీయ వర్గం చాలా సన్నిహితులైన చిన్న బృందంతో ఎప్పుడూ మారిపోతూండేది. సుల్తాన్ పూర్వ రాజకీయ ధోరణులను 1876లో విడిచిపెట్టగానే ఒట్టోమాన్ పార్లమెంట్ ని 1878లో రద్దుచేశారు. దీనివల్ల ఒట్టోమాన్ సామ్రాజ్యంలో రాజకీయాల్లో పాలుపంచుకోగలిగే అవకాశం చాలా కొద్దిమంది ఉన్న సముదాయానికే ఉండేది.[3]

ఒట్టోమాన్ సామ్రాజ్యపు ఘన చరిత్రను కాపాడుకోవడానికి దేశం ఆధునికీకరణ పొందాలని చాలామంది టర్క్ లు భావించారు. మరోవైపు అబ్దుల్ హమీద్ పరిపాలనా విధానం రాజ్య అభివృద్ధికి, దృక్పథాలకు అనుగుణంగా లేదు. విప్లవానికి మూలాలు రెండు రాజకీయ విభాగాల్లో ఉన్నాయి. రెండు రాజకీయ పక్షాలూ అబ్దుల్ హమీద్ పాలనా విధానాలతో ఏకీభవించలేఉ, కానీ రెండు పక్షాలకూ వేర్వేరు ఆసక్తులు ఉన్నాయి. ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని ఉన్నత వర్గాలకు చెందిన ఉదారవాదులు ఆర్థికపరమైన అంశాల్లో అతితక్కువ జోక్యంతో పట్టు సడలించిన ప్రభుత్వం కోరుకున్నారు. వీరు రాజ్యంలోని వివిధ జాతుల వారికి మరింత స్వయం ప్రతిపత్తి దక్కాలనేవారు, దీంతో రాజ్యంలోని విదేశీ జాతుల వారిలో ప్రాచుర్యం పొందారు. కొంత కింది వర్గం వారితో వేరే పక్షం ఏర్పాటైంది. కార్మిక వర్గ సభ్యులు మునుముందుగా లౌకిక ప్రభుత్వం ఏర్పాటుకావాలని కోరారు. రెండు పక్షాలు ఏర్పడడానికి కారణమైన ప్రాథమిక ఆశయం ఒకటే - పాత రాజ్యాంగం పునరుద్ధరణ పొందాలని. కానీ సాంస్కృతిక భేదాలు వాటిని విడదీశాయి.[3]

మూలాలు

మార్చు
  1. (Erickson 2013, p. 32)
  2. Zapotoczny, Walter S. "The Influence of the Young Turks" (PDF). W zap online. Archived from the original (PDF) on 25 జూలై 2011. Retrieved 11 August 2011.
  3. 3.0 3.1 Ahmad, Feroz (July 1968). "The Young Turk Revolution". Journal of Contemporary History. 3, The Middle East (3): 19–36.