యవ్వనం కాటేసింది
యవ్వనం కాటేసింది [1] 1976 లో వచ్చిన సినిమా. దాసరి నారాయణరావు దర్శకత్వంలో, విజయ బాపినీడు నిర్మించాడు. కృష్ణంరాజు, జయచిత్ర, మురళి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఇది 1975 నాటి తమిళ చిత్రం మయాంగుకిరల్ ఓరు మాధుకు రీమేక్.[2]
యవ్వనం కాటేసింది (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | విజయ బాపినీడు |
కథ | పంజు అరుణాచలం |
తారాగణం | కృష్ణంరాజు, జయచిత్ర, గుమ్మడి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | మాగంటి రవీంద్రనాధ చౌదరి |
భాష | తెలుగు |
విజయ బాపినీడు తొలుత ఈ చిత్రానికి చెడిన ఆడది అని పేరు పెట్టాడు. కాని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో సభ్యుడిగా ఉన్న పి. పుల్లయ్య ఆ పేరును అంగీకరించలేదు.[3]
నటీనటులు
మార్చు- కృష్ణరాజు
- జయచిత్ర
- మురళి మోహన్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రావు గోపాలరావు
- టీ.పద్మిని
- రత్నకుమారి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: దాసరి నారాయణరావు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
నిర్మాణ సంస్థ: శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
నిర్వహణ: విజయబాపినీడు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
కధ: పంజు అరుణాచలం
గీత రచయితలు: దాశరథి కృష్ణమాచార్య, వేటూరి సుందర రామమూర్తి, ఉత్పల సత్యనారాయణ చార్య.
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, వాణి జయరాం, కుమారి జయశ్రీ
విడుదల:23:01:1976.
పాటల జాబితా
మార్చు1:అలా అలా నవ్వాలి, రచన: దాశరథి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , జయశ్రీ
2: ఎరుగని సుఖమే ఎదురుగా నిలిచింది , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.పి.సుశీల
3: అటు కాలనాగు ఇటు వేటకాడు, రచన: ఉత్పల సత్యనారాయణ చార్య, గానం.వాణి జయరాం
4: సంసారం ఓక చక్కని వీణ , రచన: ఉత్పల సత్యనారాయణ చార్య, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు- ↑ Narwekar, Sanjit (1994). Directory of Indian Film-makers and Films. Flicks Books. p. 260.
- ↑ National Film Archive of India [@NFAIOfficial] (11 December 2018). "A lobby card for #Kannada film #BaluJenu, one of the early films of #FaceOfTheWeek @rajinikanth. He played the character with negative shades. A remake of #Tamil film #MayangurikalOruMadhu, it was also remade in #Telugu as #YavanamKatesindi and in #Hindi as #Bezubaan" (Tweet). Archived from the original on 14 December 2018 – via Twitter.
- ↑ Sri (14 November 2007). "Exclusive: Interview with Vijayabapineedu". Archived from the original on 2 డిసెంబరు 2008. Retrieved 23 ఆగస్టు 2020.