పి. పుల్లయ్య
పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.
పి. పుల్లయ్య | |
---|---|
![]() | |
జననం | పోలుదాసు పుల్లయ్య 1911 మే 2 |
మరణం | 1987 మే 29 | (వయసు 76)
వృత్తి | సినీ నిర్మాత సినీ దర్శకుడు |
జీవిత భాగస్వామి | పి.శాంతకుమారి |
తల్లిదండ్రులు |
|
జీవిత విశేషాలు సవరించు
పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు. 1937 లో ఈయనకు సినీనటి శాంతకుమారితో వివాహం జరిగింది. వీరికి పద్మావతి, రాధ అని ఇద్దరు కుమార్తెలు.
కెరీర్ సవరించు
పుల్లయ్య తన కుమార్తె పేరు మీదుగా పద్మశ్రీ ప్రొడక్షన్స్ అనే సినీనిర్మాణ సంస్థ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. 1959 లో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన పాత్రధారులుగా ఈయన దర్శకత్వం వహించిన జయభేరి సినిమా మంచి విజయం సాధించింది.[1] 1960 లో ఎన్. టి. ఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్మ్యం సినిమాకు ఈయనే నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు వహించాడు. ఈ సినిమా కూడ ఘన విజయం సాధించింది.[2]
చిత్రసమాహారం సవరించు
దర్శకత్వం సవరించు
- అందరూ బాగుండాలి (1975)
- కొడుకు కోడలు (1972)
- అల్లుడే మేనల్లుడు (1970)
- ప్రాణ మిత్రులు (1967)
- తాయే ఉనక్కాగ (1966)
- ఆసై ముఖం(1965)
- ప్రేమించి చూడు (1965)
- మురళీకృష్ణ (1964)
- సిరి సంపదలు (1962)
- శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)
- జయభేరి (1959)
- అదిసయ తిరుడన్ (1959)
- బండ రాముడు (1959)
- కలైవణన్ (1959)
- ఇల్లారమే నల్లారం (1958)
- వనగముడి (1957)
- పెన్నిన్ పేరుమై (1956)
- ఉమా సుందరి (1956)
- కన్యాశుల్కం (1955)
- అర్ధాంగి (1955)
- రేచుక్క (1955)
- మనంపోలే మాంగల్యం (1953)
- ధర్మదేవత (1952/I)
- మచ్చ రేకై(1950)
- తిరుగుబాటు (1950)
- వీటుకరి (1950)
- భక్తజన (1948)
- మాయా మచ్చీంద్ర (1945)
- భాగ్యలక్ష్మి (1943)
- ధర్మపత్ని (1941/I)
- ప్రేమబంధం (1941)
- సుభద్ర (1941)
- బాలాజీ (1939)
- సారంగధర (1937/I)
- హరిశ్చంద్ర (1935)
నిర్మాత సవరించు
- కొడుకు కోడలు (1972)
- అల్లుడే మేనల్లుడు (1970)
- ప్రాణమిత్రులు (1967)
- ప్రేమించి చూడు (1965)
- సిరి సంపదలు (1962)
- శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)
- అర్థాంగి (1955)
- ధర్మపత్ని (1941)
- అవార్డులు
- 1981: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సేవలందించి నందుకు రఘుపతి వెంకయ్య అవార్డు అందుకోవడం జరిగినది.
మూలాలు సవరించు
- ↑ Retrospect: Jayabheri completes 50 years Archived 2010-12-30 at the Wayback Machine
- ↑ P Pulliah's Evergreen Magnum Opus Venkateswara Mahathyam Archived 2009-04-22 at the Wayback Machine