యశోమతి చంద్రకాంత్ ఠాకూర్

యశోమతి చంద్రకాంత్ ఠాకూర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె టీఓసా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించింది.[2]

యశోమతి చంద్రకాంత్ ఠాకూర్

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు పంకజా ముండే

అమరావతి జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
9 జనవరి 2020 – 29 జూన్ 2022
నియోజకవర్గం టియోసా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2024
ముందు సాహెబ్ రావ్ తత్తే
తరువాత రాజేష్ వాంఖడే
నియోజకవర్గం టియోసా

వ్యక్తిగత వివరాలు

జననం 17 మే 1974
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు చంద్రకాంత్ ఠాకూర్, పుష్పమాల ఠాకూర్[1]

రాజకీయ జీవితం

మార్చు

యశోమతి చంద్రకాంత్ ఠాకూర్ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే చంద్రకాంత్ ఠాకూర్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టీఓసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తత్తే సాహెబ్ రావ్ రామచంద్ర చేతిలో 6938 ఓట్ల తేడాతో ఓడిపోయి తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తత్తే సాహెబ్ రావ్ రామచంద్ర పై 26130 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.

యశోమతి చంద్రకాంత్ ఠాకూర్ 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019న ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టి 29 జూన్ 2022 వరకు విధులు నిర్వహించింది.[3] ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ వాంఖడే చేతిలో 7,617 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Yashomati Chandrakant Thakur, INC MLA from Teosa". 2019. Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.
  2. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. DNA India (5 January 2020). "Maharashtra government portfolios allocated: Full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Teosa". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.