యశోవతి, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ రచించన నవలల్లో పేరొందిన ఒక పౌరాణిక నవల. ఇది ద్వాపర యుగం నేపథ్యంలో సాగిన కథ

యశోవతి.
Yashovati-visvanadh novel.jpg
యశోవతి నవల ముఖచిత్రం
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ‎
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: గ్రామ స్వరాజ్య ప్రెస్, విజయవాడ-2
విడుదల: రెండవ ముద్రణ. జూన్ 1970

రచన నేపథ్యంసవరించు

"యశోవతి" నవల రచనా కాలం 1966. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఈ నవలను ఆశువుగా చెప్తుండగా ఆయన శిష్యుడైన గరికపాటి సత్యనారాయణ లిపిబద్ధం చేశారని రచయిత కుమారుడు విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు.[1] 1966లో తొలిముద్రణ పొందిన ఈ నవల 2006కు మొత్తం మూడు ముద్రణలు పొందింది.

కాశ్మీర రాజవంశ నవలలుసవరించు

కల్హణుడు రాసిన కశ్మీర రాజతరంగిణిని ఆధారం చేసుకుని విశ్వనాథ రాసిన ఆరు నవలల మాలికలో యశోవతి మొదటిది. వేలయేళ్ల చరిత్రను సాధికారికంగా నిర్ధారించుకుని ఆసక్తికరమైన వర్ణనలతో కల్హణుడు 11శతాబ్దిలో రాసిన కశ్మీర రాజతరంగిణి అటు చారిత్రిక గ్రంథంగా, ఇటు కావ్యంగా ప్రాముఖ్యత పొందింది[2].
పాశ్చాత్య చరిత్ర పండితులు, వారిని అనుసరించిన భారతీయ చరిత్ర పండితులు చరిత్రలోని ఎన్నో అంశాలను విస్మరించి మన గతానికి అన్యాయం చేశారని చెప్పే విశ్వనాథ దృష్టి సహజంగానే కశ్మీర రాజతరంగిణిపై పడింది. రాజతరంగిణిలో రాసిన పలువురు రాజులు, రాణులు, వారి జీవితాలు, ఆనాటి వాతావరణాన్ని అంశంగా తీసుకుని 6 నవలల మాలికను విశ్వనాథ సృష్టించారు. కాశ్మీర రాజవంశ నవలలు ఇవి:

  1. యశోవతి
  2. పాతిపెట్టిన నాణెములు
  3. మిహిరకులుడు
  4. సంజీవకరణి
  5. కవలలు
  6. భ్రమరవాసిని

రచయితసవరించు

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఇలా అన్ని విధాలైన సాహిత్య ప్రక్రియలలోనూ విశ్వనాధ ప్రతిభ కనిపించింది. 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు.

వేయి పడగలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిన్నెరసాని పాటలు, మధ్యాక్కఱలు వంటివి విశ్వనాధ రచనలలో ప్రసిద్ధమైనవి.

కథా విశేషాలుసవరించు

ద్వాపర యుగ కాలమందు మిధిలానగరమునుపాలించిన రాజుకు కుమార్తె యశోవతి. అంద చందాలు కలిగిన ఆమె కృష్ణునిపై అపారమైన భక్తి, విశ్వాసాలు కలిగి ఉంటుంది. తరచు ఆ రాజ్యానికి వచ్చే కాశ్మీర రాజు ఆమెను చూచి తన కుమారునకు ఆమెను వధువుగా చేయాలని ఉబలాటపడి వివాహం జరిపిస్తాడు.

రచనా శైలిసవరించు

ఇతర విశేషాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. యశోవతి నవల ప్రతిలో ఒకమాట శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి ఇచిన సమాచారం.
  2. ధర్, సోమనాథ్ (1983). కల్హణుడు (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాఢమీ.
"https://te.wikipedia.org/w/index.php?title=యశోవతి&oldid=2659037" నుండి వెలికితీశారు