యాచశూరుడు వెలమ వంశమునకు చెందిన రేచర్ల గోత్రీయుడు . భేతాళనాయకుడు, అనపోతనాయకుడు, సర్వజ్ఞసింగభూపాలుడు మున్నగు వెలమవీరులందఱు నీ రేచర్ల గోత్రీయులె. రేచర్లగోత్రీయులు తొలుత కాకతీయ సామ్రాజ్యమున సేనానాయకులుగ నుండి తమ పరాక్రమముతో యుద్ధాలలో గెలిచి తమప్రభువులచే సత్కారముల నొందిరి. కాకతీయ సామ్రాజ్యము పడిపోయిన తార్వాత నీ వెలమవీరులు స్వతంత్ర రాజ్యములను స్థాపించి చిరకాలము పాలించిరి. తర్వాత వీరి రాజ్యము యవనుల ఒత్తిడిచే రానురాను చీలి భిన్నభిన్నమైపోయెను. ఈరేచర్ల గోత్రము నందు జనించిన యాచశూరుడు చంద్రగిరి వీరవేంకటపతిరాయలు పాలించు కాలమున కొంతకాలము మధురాంతకము నందును మఱికొంత కాలము ఉత్తర మల్లూరు నందును సామంతరాజుగా నుండెను.

యాచశూరుడు... చెఱసాలయందున్న రంగరాజును ఎలాగైనా విడిపింపవలయునని అనేక విధ్యముల ప్రయత్నములు చేసెనుగాని ఫలతము లేక పోయెను.. కారాగృహవాసుల వస్త్రములు ఉతుకు చాకలి వాండ్రను మంచి చేసికొని వారికి లంచము లిచ్చి శ్రీరంగరాయల ముగ్గురు కుమారులలో మధ్యవాడగు పండ్రెండు సంవత్సరముల బాలుని మాత్రము బట్టలమూటలలో బెట్టి బయటికి దెప్పించి యాచశూరుడు ఆబాలుని తనయొద్ద నుంచుకొని పెంచుచుండెను.

చివరకు యాచశూరుడు రాయబారుల దిరస్కరించి చంద్రగిరి దుర్గమును యుద్ధములో వశపరచుకొనెను. ఇది గమనించిన జగ్గరాజు పారిపోయెను. యాచశూరుడు రాజమందిరమున బ్రవేశించి కోటను స్వాధీనపఱచికొని విశ్వసనీయులగు సైనికులకు నుద్యోగములు నొసంగి పూర్వవస్తువు లన్నింటిని బయటికి దీయించి సామంతలు పౌరసమ పక్షమున శ్రీరంగరాయల పుత్రుడగు రామరాయ నకు చంద్రగిరి రాజ్యమునకు పట్టాభిషేకము గావించెను. బౌరులందఱును యాచశూరుని ధర్మపరతంత్ర బుద్ధికిని స్వామిభక్తిని సంతసించి చంద్రగిరి రాజ్యమునకు మంత్రిగ నుండుమని ప్రార్థించిరి. కాని తన కర్తవ్యము నిర్వహింపబడినదని యాచశూరుదు తెలిపి తన రాజ్యమునకు నేగెను. పూర్వప్రభు వంశజుడగు రామరాజు తమకు రాజైనందులకు జగ్గరాజు దుష్టపరిపాలన మంతరించినందులకు బ్రజలు సంతసించి రాజ్యమున జిరకాలము మహోత్సవము లొనరించి తమ యానందము బ్రకటించిరి.

మూలము

మార్చు

https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9A%E0%B0%B6%E0%B1%82%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81