యాచులి

అరుణాచల్ ప్రదేశ్ లోని, కేయీ పన్యోర్ జిల్లా లోని గ్రామం

యాచులి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కేయీ పన్యోర్ జిల్లా లోని గ్రామం.[1] ఇది కేయీ పన్యోర్ జిల్లా ప్రధాన కార్యాలయం.[2]

యాచులి
గ్రామం
యాచులి is located in Arunachal Pradesh
యాచులి
యాచులి is located in India
యాచులి
Coordinates: 27°30′51″N 93°46′51″E / 27.5142117°N 93.7809663°E / 27.5142117; 93.7809663
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లాకేయీ పన్యోర్

యాచులి పట్టణం, దిగువ సుబన్సిరి జిల్లా, ప్రధాన కార్యాలయం జిరోకు దక్షిణాన 10 కి.మీ. (6.2 మై.) కి. మీ. (6.2 మైళ్ళు) దూరంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ 60 నియోజకవర్గాలలో ఒకటైన యాచులి శాసనసభ నియోజకవర్గం ఆ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నియోజకవర్గానికి 2024 జూన్ నుండి ప్రస్తుత శాసనసభ సభ్యుడుగా టోకో టాటుంగ్ పదవిలో కొనసాగుచున్నాడు.[3]

యాచులి ప్రభుత్వ కళాశాల

మార్చు

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో 2007లో యాచులిలో ప్రభుత్వ కళాశాల, యాచులి స్థాపించబడింది. ఈ కళాశాల 2007జులై 19న డైట్ భవనాలలో తాత్కాలికమముగా దాని ప్రారంభ విద్యా సెషన్‌లో యాభై ఏడు మంది విధ్యార్థులు, ఐదుగురు అధ్యాపకులతో ప్రారంభించబడింది. కళాశాల 2010 ఆగస్టు 30న దాని శాశ్వత ప్రదేశానికి మార్చబడింది.

సుందరమైన కొండలలో ఉన్న ఈ కళాశాల స్థలం ప్రధాన రహదారిలో యాచులి మార్కెట్ నుండి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది. లోయర్ సుబన్‌సిరి జిల్లా ప్రధాన కార్యాలయం, జిరో నుండి 28 కిలోమీటర్లు దూరంలో ఉండగా, రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.[4]

మూలాలు

మార్చు
  1. "Yachuli location". Wikiedit Site. Retrieved 21 September 2016.
  2. "Arunachal Assembly passes bill for two new districts". India Today NE. 2024-02-08. Retrieved 2024-02-25.
  3. "Toko Tatung(Nationalist Congress Party(NCP)):Constituency- YACHULI (ST)(LOWER SUBANSIRI) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-06-25.
  4. "Government College Yachuli". www.gcyachuli.ac.in. Retrieved 2024-06-25.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=యాచులి&oldid=4243701" నుండి వెలికితీశారు