లోయర్ సుబన్‌సిరి జిల్లా

అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా

లోయర్ సుబన్‌సిరి జిల్లా, ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా. దీని ప్రధాన కార్యాలయం జిరో పట్టణం.

లోయర్ సుబన్‌సిరి జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ పటంలో లోయర్ సుబన్‌సిరి జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్ పటంలో లోయర్ సుబన్‌సిరి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంజిరో (పట్టణం)
జనాభా
 (2011)
 • మొత్తం82,839[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత76.3%[1]
 • లింగ నిష్పత్తి975[1]
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర

మార్చు

1987లో సుబన్‌సిరి జిల్లాను దిగువ సుబన్‌సిరి, ఎగువ సుబన్‌సిరి జిల్లాగా విభజించి తరువాత ఈ జిల్లా రూపుదిద్దుకుంది.[2] 1999లో పపుమ్ పరె జిల్లాను విభజించి రెండు జిల్లాలుగా చేసారు. తరువాత దిగువ సుబన్‌సిరి జిల్లా 2001లో విభజించి కురుంగ్ కుమే జిల్లాను రూపొందించారు.[2]

భౌగోళికం

మార్చు

దిగువ సుబన్‌సిరి జిల్లా కేంద్రం జీరో వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 3,460 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎగువ సుబన్‌సిరి జిల్లా, దక్షిణ సరిహద్దులో అస్సాం రాష్ట్రం లోని పపుమ్ పరె జిల్లా, ఎగువసుబన్‌సిరి జిల్లాలోని కొంతభాగం, పశ్చిమ సరిహద్దులో తూర్పు కమెంగ్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు

మార్చు

దిగువ సుబన్‌సిరి జిల్లా 6 పాలనా విభాగాలుగా విభజించారు. అవి వరుసగా. జిరో (సదర్), యాచులి, పిస్తానా, రగా, కంపోరిజొ, డొల్లుంగముఖ్. అలాగే జిల్లా జిరో-1, జ్రో-2, టామెన్ -రగా అనే 3 విభాగాలుగా విభజ్ంచబడింది. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజక వర్గాలు (యాచులీ, జిరో హపోలీ) ఉన్నాయి. ఈ రెండు అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం చెందినవి.[3]

జనాభా గణాంకాలు (2011)

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ సుబంసిరి జిల్లాలో మొత్తం జనాభా 83,030. వీరిలో 41,843 మంది పురుషులు కాగా, 41,187 మంది స్త్రీలు ఉన్నారు.[4] 2011లో దిగువ సుబన్‌సిరి జిల్లాలో మొత్తం 15,249 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దిగువ సుబంసిరి జిల్లా సగటు లింగనిష్పత్తి 984. జిల్లా మొత్తం జనాభాలో 15.4% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 84.6% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 85.5% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 72.3%. జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,006 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 980 ఉంది. జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 10320, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య 5248 మంది మగ పిల్లలు ఉండగా, 5072 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా పిల్లల లింగ నిష్పత్తి 966, ఇది దిగువ సుబంసిరి జిల్లా సగటు లింగ నిష్పత్తి (984) కంటే తక్కువగా ఉంది. దిగువ సుబంసిరి జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 74.35%. దిగువ సుబంసిరి జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 70.43%, స్త్రీల అక్షరాస్యత రేటు 59.7%.[4] దిగువ సుబన్‌సిరి జిల్లాలో నియిషిస్, అపాతనీలు నివసిస్తున్నారు.

భాషలు

మార్చు

దిగువ సుబన్‌సిరి జిల్లాలో అరతాని, నియిషి భాష వాడుకలో ఉంది.[5]

సంస్కృతి

మార్చు

దిగువ సుబన్‌సిరి జిల్లాలో నియోకం, బూరి-బూత్, డ్రీ ఫెస్టివల్ వంటి ఉత్సవాలు జిల్లాకే ప్రత్యేకమని భావిస్తున్నారు.

వృక్షజాలం , జంతుజాలం

మార్చు

1995లో సుబన్‌సిరి జిల్లాలో టాలీ లోయ వన్యమృగ అభయారణ్యం భారతీయ వన్యమృగ అభయారణ్యాలలో ఒకటైన అభయారణ్యం ఏర్పాటుచేయబడింది.[6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
  2. 2.0 2.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  4. 4.0 4.1 "Lower Subansiri District Population Religion - Arunachal Pradesh, Lower Subansiri Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-20.
  5. M. Paul Lewis, ed. (2009). "Apatani: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.

భౌగోళిక స్థితి

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు

27°48′N 93°36′E / 27.800°N 93.600°E / 27.800; 93.600