యాదమ్మ రాజు
యాదమ్మ రాజు తెలుగు టీవీ, చలన చిత్ర నటుడు
టీవీ, సినీ రంగ ప్రవేశం
మార్చుఈటీవీలో పటాస్ అనే కామెడీ షో ద్వారా టెలివిజన్ రంగానికి పరిచయమైన నటుడు యాదమ్మ రాజు. సంతోష్ అనే దర్శకుడి ప్రోత్సాహంతో, హరి అనే యువకుడితో కలిసి రాజు స్కిట్స్‌లో నటిస్తుండేవాడు. తర్వాత జీ తెలుగు ఛానల్ నిర్వహించిన అదిరింది అనే కామెడీ షోలో కూడా తాను నటించాడు. ఆ షోలో గల్లీ బాయ్స్ అనే టీమ్ ద్వారా తన ప్రదర్శనలను అందించాడు.[1] పంచ్ డైలాగులను అమాయకమైన రీతిలో చెప్పడం యాదమ్మ రాజు ప్రత్యేకత. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న యాదమ్మ రాజు పలు సినిమాలలో కూడా నటించాడు. 2021 లో నిర్మాత నాగబాబు యాదమ్మ రాజుకు బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. [2] జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. 2020 లో నేచర్ కేర్ ఇన్నోవెర్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ యాదమ్మ రాజును హైదరాబాద్ రాడిషన్ బ్లూ హోటల్‌లో ‘డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020’ పురస్కారంతో సత్కరించింది. [3]
వ్యక్తిగత జీవితం
మార్చుజీ తెలుగులో వినాయక చవితి స్పెషల్‌గా ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాన్ని ఆగష్టు 22, 2020 తేదిన ప్రసారం చేస్తుండగా, ఆ కార్యక్రమంలో షార్లీ స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు యాదమ్మ రాజు తెలిపాడు. ఆమెను సభికులకు పరిచయం చేశాడు. [4]
సినిమాలు
మార్చు- గువ్వ గోరింక (2017)
- జార్జి రెడ్డి (2018)
- హలో గురు ప్రేమ కోసమే (2019)
- విద్యార్థి (2020)
మూలాలు
మార్చు- ↑ "ఏపీ 7 ఏఎం వెబ్ సైటులో వార్త". Archived from the original on 2021-05-09. Retrieved 2021-05-09.
- ↑ "టీవీ 9 తెలుగు వెబ్ సైటులో డాక్టర్ లాఫ్టర్ అవార్డ్స్ గురించిన వార్త".
- ↑ "వెబ్ దునియా వెబ్ సైటులో నాగబాబు ఒరిజినల్స్ బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ గురించిన వార్త".
- ↑ "సమయం వెబ్ పత్రికలో యాదమ్మరాజు లవ్ సోర్టీ గురించిన కథనం".