దృశా మాధ్యమం (యానకం) అంటే విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారం చేసే పదార్థం. ఈ తరంగాలు ఏ పదార్థాల గుండా ప్రయాణం చేస్తాయో ఆ పదార్థాలను యానకం అంటారు. ఇది ప్రసార మాధ్యమం యొక్క ఒక రూపం. మాధ్యమం పర్మిటివిటీ, ప్రవేశ్యశీలతలు విద్యుదయస్కాంత తరంగాలు ఎలా వ్యాపిస్తాయో నిర్వచిస్తాయి. మాధ్యమానికి స్వభావజ అవరోధం ఉంటుంది. దీనిని క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు.

దీనిలో , లు వరుసగా విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలను సూచిస్తాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ వాహకత లేనప్పుడు పై సమీకరణం క్రింది విధంగా రాయవచ్చు.

ఉదాహరణకు, శూన్య ప్రదేశంలో స్వభావజ అవరోధాన్ని "శూన్యం అవరోధ లక్షణం" గా పిలుస్తారు. దీనిని Z0 తో సూచిస్తారు. అపుడు,

మాధ్యమం గుండా తరంగాలు (ఇందులో విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం , తరంగదైర్ఘ్యం అవుతుంది.) వేగంతో ప్రసారం చేయబడతాయి. ఈ సమీకరణాన్ని ఈ రూపంలో కూడా రాయవచ్చు:

దీనిలో తరంగ కోణీయ పౌనఃపున్యం , తరంగ సంఖ్య అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో గుర్తు ను దశా స్థిరాంకం అందురు. ఇది తరచుగా బదులుగా వాడతారు.

శూన్య ప్రదేశంలో విద్యుదయస్కాంత తరంగాల ప్రచారం వేగం, ఆదర్శవంతమైన ప్రామాణిక సూచన స్థితి (పరమ శూన్య ఉష్ణోగ్రత వంటిది), ఇది సాంప్రదాయకంగా c0 చే సూచించబడుతుంది[1].

దీనిలో విద్యుత్ స్థిరాంకం, అయస్కాంత స్థిరాంకం.

మూలాలు

మార్చు
  1. With ISO 31-5, NIST and the BIPM have adopted the notation c0.