యానాం పురపాలక సంఘం

పుదుచ్చేరిలోని,యానాం జిల్లాకు చెందిన పురపాలక సంఘం

యానాం పురపాలక సంఘం 1974లో పాండిచ్చేరి మున్సిపాలిటీ చట్టం ప్రకారం పురపాలక సంఘం ఏర్పాటు చేశారు.

యానాం పురపాలక సంఘం
యానాం
స్థాపన1974
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
యానాం
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

జనాభా గణాంకాలు

మార్చు

యానాం పురపాలక సంఘం లో 10 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల ప్రకారం యానాం మునిసిపాలిటీలో 55,626 జనాభా ఉండగా అందులో పురుషులు 27,301 మహిళలు 28,325 మంది ఉన్నారు. ఈ పురపాలక సంఘ పరిధిలో మొత్తం 13,812 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6204 ఉన్నారు.అక్షరాస్యత రేటు 79.47% పురుష జనాభాలో 82% ఉండగా, స్త్రీ జనాభాలో 76% అక్షరాస్యులు ఉన్నారు.[1]

వార్డులు

మార్చు

పురపాలక సంఘంలో మొత్తం పది వార్డులు ఉన్నాయి.

  • యానాం పట్టణం
  • కనకాల పేట
  • మెట్టకుర్
  • ఫారం పేట
  • గిరియమం పేట
  • అంబేద్కర్ నగర్
  • విష్ణాలయం
  • పిలారయ
  • పైడికొండల
  • పెద్దపూడి
  • అగ్రహారం

పర్యాటక రంగం

మార్చు
  • వేంకటేశ్వర స్వామి దేవాలయం:వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు.[2]
  • మసీదు:1848 సంవత్సరంలో ఈ మసీదు నిర్మించారు.1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా తొలగించి 1999-2000 లో నూతన మసీదు నిర్మించారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది.[3]
  • కాథలిక్ చర్చి: దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు నిర్మాణశైలిలో నిర్మితమైనది.1846 సంవత్సరంలో ఫ్రెంచి మతసంస్థల ద్వారా ఈ చర్చి నిర్మాణం జరిగింది.[2]

మూలాలు

మార్చు
  1. "Yanam Municipality City Population Census 2011-2020 | Puducherry". www.census2011.co.in. Retrieved 2020-12-15.
  2. 2.0 2.1 "పర్యాటక స్థలాలు | యానాం, పుదుచ్చేరి ప్రభుత్వం | ఇండియ". Retrieved 2020-12-16.
  3. "నేడే లూర్ధుమాత ఉత్సవం". www.andhrajyothy.com. Retrieved 2020-12-16.