యాష్లే డి సిల్వా

శ్రీలంక మాజీ క్రికెటర్

యాష్లే మాథ్యూ డి సిల్వా, శ్రీలంక మాజీ క్రికెటర్. 1986 నుండి 1993 వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2019 వరకుశ్రీలంక క్రికెట్ సీఈఓ గా ఉన్నాడు.

యాష్లే డి సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యాష్లే మాథ్యూ డి సిల్వా
పుట్టిన తేదీ3 December 1963 (1963-12-03) (age 60)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 55)1993 మార్చి 13 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1993 జూలై 27 - భారతదేశం తో
తొలి వన్‌డే (క్యాప్ 44)1986 మార్చి 2 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1993 జూలై 25 - భారతదేశం తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982–1984తమిళ యూనియన్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్
1986–1996కొలంబో క్రికెట్ క్లబ్
అంపైరుగా
అంపైరింగు చేసిన లిస్ట్ ఎ1 (2011)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 3 4
చేసిన పరుగులు 10 12
బ్యాటింగు సగటు 3.33 6.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 9 8
క్యాచ్‌లు/స్టంపింగులు 4/1 4/2
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 9

జననం మార్చు

డి సిల్వా 1963, డిసెంబరు 3న శ్రీలంకలోని కొలంబోలో రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. కొలంబోలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదివాడు. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజ్‌తో జరిగిన వార్షిక బ్యాటిల్ ఆఫ్ ది సెయింట్స్‌లో నాలుగు (చివరిది-1982లో-కెప్టెన్‌గా) మ్యచ్ లు ఆడాడు. టెస్ట్ క్రికెట్ ఆడిన మొదటి మాజీ సెయింట్ జోసెఫ్ ఆటగాడిగా నిలిచాడు.[1][2][3]

డిసిల్వా తమిళ యూనియన్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్ కోసం లక్షప్రే ట్రోఫీలో తన దేశీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. తర్వాత కొలంబో క్రికెట్ క్లబ్‌కు మారాడు, అక్కడ ఆడుతున్నప్పుడు 1989లో ఈ పోటీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ హోదాను పొందింది.[2][3][4]

విరమణ తరువాత మార్చు

క్రికెట్ నుండి విరమణ తీసుకున్న తరువాత , డి సిల్వా రిఫరీ అయ్యాడు. 2011లో అంపైర్‌గా ఒక లిస్ట్ ఎ మ్యాచ్‌కు బాధ్యతలు తీసుకున్నాడు.[5][6][7]

2013లో శ్రీలంక క్రికెట్ తాత్కాలిక సీఈఓ అయ్యాడు, ఆ తర్వాత శాశ్వతంగా బాధ్యతను స్వీకరించాడు.[1][8]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Epasinghe, Premasara (30 March 2013). "Ashley de Silva New SLC CEO". Daily News. Colombo: Associated Newspapers of Ceylon. Retrieved 2023-08-20.
  2. 2.0 2.1 Epasinghe, Premasara (14 March 2005). "Ashley de Silva - first Josephian Test player". Daily News. Colombo: Associated Newspapers of Ceylon. Retrieved 2023-08-20.
  3. 3.0 3.1 "Miscellaneous Matches played by Ashley de Silva". CricketArchive. Retrieved 2023-08-20.
  4. "First-Class Matches played by Ashley de Silva". CricketArchive. Retrieved 2023-08-20.
  5. "Ashley de Silva as Referee in First-Class Matches". CricketArchive. Retrieved 2023-08-20.
  6. "Ashley de Silva as Referee in List A Matches". CricketArchive. Retrieved 2023-08-20.
  7. "Ashley de Silva as Umpire in List A Matches". CricketArchive. Retrieved 2023-08-20.
  8. "Ashley de Silva appointed acting CEO of SLC". Daily FT (in English). 26 March 2013. Retrieved 2023-08-20.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

బాహ్య లింకులు మార్చు