యాసలపు సూర్యారావు

యాసలపు సూర్యారావు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకి చెందిన అభ్యుదయకవి

కామ్రేడ్. యాసలపు సూర్యారావు
జననంజనవరి 5, 1952
పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా (ఆంధ్రప్రదేశ్)
మరణంజూన్22, 2012
పెద్దాపురం
మరణ కారణంసహజ మరణం
నివాస ప్రాంతంపెద్దాపురం
వృత్తిమెకానిక్, రాజకీయ నాయకుడు
ప్రసిద్ధికష్టజీవుల కవి
రాజకీయ పార్టీసిపిఎం

కష్టజీవుల కవిగా పేరు పొందిన కామ్రేడ్ యాసలపు సూర్యారావు గారు కేవలం కవిగానే కాక కళాకారుడిగా, పాటలు, నాటికలు, కథలు రచించిన గొప్ప రచయితగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ప్రజా ఉద్యమకారుడిగా, అన్నింటికీ మించి వారు రచించిన అక్షరానికీ ఆచరణకీ సమన్వయం కుదిరేలా తుదిశ్వాస విడిచే వరకూ జీవించి నిబద్దతగల రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందారు సాహితీ స్రవంతి, ప్రజానాట్యమండలి లలో కీలకపాత్ర పోషించారు.

రచనలు

మార్చు
  • ప్రజ్వలనం (మినీ కవితల సంకలనం 1993)
  • ఊరు మేల్కొంది (నాటిక 1999)
  • విముక్తి (నాటిక 1999)
  • మేల్కొలుపు (నాటిక 2000)
  • బతుకు పాట (26 పాటల సంపుటి 2001)
  • తల్లీ గోదావరి (33 కవితల సంకలనం 2007)
  • ఆడు మగాడు (34 కవితల సంపుటి 2010)
  • పేగుభందం (దీర్ఘ కవిత 2010)
  • పిట్టకొంచెం కూత ఘనం (12 బాలల కథల సంపుటి 2010)
  • యాసలపు జనపదాలు (మరణానంతరం ముద్రిత పుస్తకం)

మూలాలు

మార్చు

జూన్ 22 - 2016 ప్రజాశక్తి దినపత్రిక