పెద్దాపురం

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, పెద్దాపురం మండల పట్టణం

పెద్దాపురం పట్టణం, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలానికి చెందిన ఒక ప్రసిద్ధ పురాతన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల పాండవుల గుహలు ఒక పర్యాటక ఆకర్షణ.

పట్టణం
పటం
Coordinates: 17°05′N 82°08′E / 17.08°N 82.13°E / 17.08; 82.13
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండలంపెద్దాపురం మండలం
Area
 • మొత్తం41.13 km2 (15.88 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం49,477
 • Density1,200/km2 (3,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1033
Area code+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)533433 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

చరిత్ర సవరించు

 
పాండవుల గుహలు, పెద్దాపురం

ఏనుగుల వీరాస్వామయ్య తన యాత్రా రచన కాశీయాత్ర చరిత్రలో పెద్దాపురం ప్రస్తావన ఉంది. "పెద్దపురమనే ఊరు పిఠాపురముకన్నా గొప్పది. యీ వూరి యిండ్లున్ను గొప్పలుగానే కట్టియున్నారు. 100 బ్రాహ్మణుల యిండ్లు ఉన్నాయి. యిక్కడ పోలీసుదారోగా సహితముగా యిక్కడి జమీందారుడు వసింపుచు నుంటాడు. యితని తాలూకా 3 లక్షలది. అంగళ్ళు ఉన్నాయి. సమస్తపదార్ధాలు దొరుకు చున్నవి. యీ వూళ్ళో 3 సంవత్సరములుగా యీ జమీందారుని భార్య అమ్మన్న అనే పురుషుని గొప్పయిల్లు స్వాధీనము చేసుకుని ఒక అన్నసత్రము వేసియున్నది. ఆ స్థలము విశాలముగా వున్నందున అందులోనే యీ రాత్రి వసించినాను."

భౌగోళికం సవరించు

పెద్దాపురం పట్టణం17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది.[2] సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జిల్లా కేంద్రమైన కాకినాడకు వాయవ్యంగా 22 కి.మీ దూరంలో ఉంది.

జనగణన వివరాలు సవరించు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం పట్టణ జనాభా 45,174. ఇందులో పురుషులు 22,308 (49%),స్త్రీలు 22,866 (51%) ఉన్నారు. పెద్దాపురం పట్టణంలో అక్షరాస్యతా శాతం 63%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 66%,, స్త్రీల అక్షరాస్యతా శాతం 59%. 6 సం.ల లోపు ఉన్న పిల్లల శాతం 11%.[3]

పరిపాలన సవరించు

పెద్దాపురం పట్టణంనకు మునిసిపాలిటి హొదా 1915 లోనే ఇవ్వబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమునిపట్టణం తరువాత రెండవ అతి పురాతన మునిసిపాలిటి. పెద్దాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు సవరించు

సమీప జాతీయ రహదారి 16 ఉత్తరంగా 15 కి.మీ. దూరంలో గల జగ్గంపేట గుండా పోతుంది. ఆగ్నేయంగా 6 కి.మీ. దూరంలో గల సామర్లకోట అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను.

విద్యా, పరిశోధనా సౌకర్యాలు సవరించు

19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారిచే లూధరన్ హైస్కూల్ స్థాపించబడింది. పెద్దాపురం పట్టణంలో బహుళ ప్రాశస్త్యం పొందిన రాజా వత్సవాయి జగపతి బహద్దూర్ మహారాణి కళాశాల ఉంది. దీనిని 1967 లో అప్పటి జిల్లా పరిషత్ అధ్యక్ష్యులు బలుసు పి.బి.కే. సత్యనారాయణ రావు, పెద్దాపురం సంస్థానం మహారాణి బుచ్చి సీతయమ్మ గారి జ్ఞాపకార్ధం ప్రారంబించారు.

7వ పంచవర్ష ప్రణాళికా కాలంలో పి.వి.నరసింహారావు చొరవతో ప్రతిభ గల గ్రామీణ ప్రాంతానికు చెందిన విద్యార్థులకు మంచి విద్యను అందించుటకు, ప్రతీ జిల్లాకు ఒక్కటి చొప్పున, జవహర్ నవోదయ విద్యాలయ ప్రారంబించారు. అందులో పెద్దాపురం పట్టణం ఎన్నిక కాబడింది. పెద్దాపురం పట్టణంలో గల పాండవుల మెట్ట మీద గల జవహర్ నవోదయ విద్యాలయ దేశంలోనే మొదటి 10 స్థానాలలో ఒకటి.

ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రాగి, కర్ర పెండలం మీద పరిశోధన జరుపుతున్నారు. ఈ పరిశోధనా క్షేత్రం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది.

కొన్ని ప్ర్రముఖ విద్యాసంస్థలు సవరించు

సంస్కృతి సవరించు

పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ తల్లి దేవాలయం ఉంది. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసములోఒక నెల పాటు జాతర జరుగుతుంది. ఆషాఢ మాసం మొత్తం పెద్దాపురం పట్టణంలో పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఆదివారం పట్టణంలోని ఒక్కొక్క వీధి చొప్పున వంతుల వారీగా సంబరాలు జరుపుతారు. పెద్దాపురం సిల్కు. చీరలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.

పట్టణ ప్రముఖులు సవరించు

 
మొక్కపాటి సుబ్బారాయుడు: పండితుడు. ప్రఖ్యాత హాస్యరచయిత
 
భావరాజు సర్వేశ్వరరావు భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త.

కళాకారులు సవరించు

భారత దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కూడా పెద్దాపురం నాటక రంగానికి ప్రసిద్ధి. పెద్దాపురంలో ఒకానొకప్పుడు 21 నాటక సమాజాలు వెల్లివిరిసాయి. ఇక్కడి నుండి కళాకారులు నాటక ప్రదర్శనలివ్వడానికి ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లబడేవారు. తరువాతి కాలంలో ఇక్కడ నుండి చాల మంది సినీ రంగ ప్రవేశం కూడా చేసేరు. వారిలో కొందరు ప్రముఖుల వివరాలు:

పర్యాటక ఆకర్షణలు సవరించు

పరిసర ప్రాంతాల పర్యాటక ఆకర్షణలు సవరించు

ఇతర విశేషాలు సవరించు

పెద్దాపురం పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే పెద్దాపురం సంత ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. బ్రిటిషువారి కాలం నుండి ఇక్కడ అనాదిగా వర్తకం జరుగుతుంది. చుట్టు ప్రక్కల గ్రామంల వారు ఈ సంతలో వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇవికూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం". Archived from the original on 2008-01-15. Retrieved 2008-06-27.
  3. https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999

బయటి లింకులు సవరించు