యాసిర్ అలీ

పాకిస్తానీ మాజీ క్రికెటర్

యాసిర్ అలీ (జననం 1985, అక్టోబరు 15) పాకిస్తానీ మాజీ క్రికెటర్. పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు తరపున 2003లో ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]

యాసిర్ అలీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1985-10-15) 1985 అక్టోబరు 15 (వయసు 39)
హజ్రో, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 179)2003 సెప్టెంబరు 3 - బంగ్లాదేశ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 86 59
చేసిన పరుగులు 1 1,311 365
బ్యాటింగు సగటు 12.85 13.51
100s/50s 0/0 1/4 0/1
అత్యధిక స్కోరు 1* 129 51
వేసిన బంతులు 120 12,858 2,932
వికెట్లు 2 258 86
బౌలింగు సగటు 27.50 24.43 27.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 9 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/12 6/50 5/16
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 27/– 19/–
మూలం: CricInfo, 2021 జూన్ 9

యాసిర్ అలీ 1985 అక్టోబరు 15న పాకిస్తాన్, పంజాబ్ లోని హజ్రో లో జన్మించాడు.[2]

కెరీర్

మార్చు

గ్రేడ్ 2 దేశీయ పోటీలో అటాక్ అండర్-19 జట్టులో క్రికెటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు.[3] ఇతని ఆటతీరు కారణంగా, దక్షిణాఫ్రికా పర్యటన కోసం పాకిస్తాన్ క్రికెట్ అకాడమీ జట్టులో ఎంపికయ్యాడు.[3]

2005లో, 19 సంవత్సరాల వయస్సులో బంగ్లాదేశ్‌పై టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసాడు.[3] క్రికెట్ చరిత్రలో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం, అదే మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన కొద్దిమంది ఆటగాళ్ళలో ఒతను ఒకడు.[4]

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో స్థానిక క్రికెట్ లీగ్‌లు ఆడుతున్నాడు. నార్త్ స్టాఫోర్డ్‌షైర్, సౌత్ చెషైర్ లీగ్‌లలో పాల్గొన్నాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Yasir Ali Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-13.
  2. "Yasir Ali Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-13.
  3. 3.0 3.1 3.2 "Baptism by fire: Fewest first-class matches before Test debut for Pakistan". The News International.
  4. Lynch, Steven (18 June 2013). "An even innings, and a rapid 25". Ask Steven. ESPNcricinfo. Retrieved 2023-09-12.
  5. "Stokistan". The Cricket Monthly.