యురేనియం త్రవ్వకాలు

భూమి పొరలలో ఉన్న యురేనియం మూలకాన్ని తవ్వి బయటకు తీస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ౨౦౧౫ (2015) లెక్కల ప్రకారం 60,496 టన్నుల యురేనియం వెలికి తీశారు. మొత్తం ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో కజకిస్తాన్, కెనడా , ఆస్ట్రేలియా దేశాలు తొలి మూడు అగ్రగామి దేశాలు అంతే కాదు ఈ ఉత్పత్తి లో 70% పైనే ఈ మూడు దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇవి కాకుండా సంవత్సరానికి 1000 టన్నుల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాలు నైగర్, రష్యా , నమీబియా , ఉజ్బెకిస్తాన్ , చైనా , అమెరికా , ఉక్రెయిన్ దేశాలు. యురేనియం త్రవ్వకాలలో వచ్చే ఈ యురేనియంను అధికంగా అణు విధ్యుత్శక్తి తయారీ కోసం వాడుతారు.

దేశాల వారీగా, 2012 లో యురేనియం వెలికితీత [1]
2005 లో ప్రపంచ యురేనియం ఉత్పత్తి.

మూలాలు మార్చు

  1. "World Uranium Mining Production". World Nuclear Association. Archived from the original on 2014-06-13. Retrieved 2014-05-15.