యెర్నేని సుబ్రహ్మణ్యం

యెర్నేని సుబ్రహ్మణ్యం (1898 - 1974) సాధు సుబ్రహ్మణ్యం గా ప్రసిద్ధి చెందిన భారత స్వతంత్ర సమరయోధుడు. గాంధేయవాధి.మహాత్మా గాంధీ గారితో కలసి దండి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక తెలుగు వ్యక్తి . కొమరవోలులో గాంధీ ఆశ్రమాన్ని స్థాపించారు. వినోభాభావే భూదాన ఉద్యమంలో పాల్గోన్న వ్యక్తి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు గారికి చివరివరకు తోడుండి పోరాడిన వ్యక్టి.

యెర్నేని సుబ్రహ్మణ్యం
స్వాతంత్ర యోధులు, గాంధేయ వాది సాధు సుబ్రహ్మణ్యం
జననం1898
కృష్ణాజిల్లా ,కొమరవోలు గ్రామం
మరణం1974
సంస్థగాంధీ ఆశ్రమం, కొమరవోలు
ప్రసిద్ధి1930 దండి ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ తో కలసి నడిసిన వ్యక్తి
మతంహిందువు

యెర్నేని సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా లోని కొమరవోలు గ్రామంలో 1898 లో జన్మించారు. ఈ గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

స్వాతంత్ర పోరాటంలో

మార్చు

సుబ్రహ్మణ్యం 25 సంవత్సారాల వయస్సులో మహాత్మా గాంధీ గారితో కలసి దండి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో 1930 మార్చి 12 న ప్రారంభించిన ఈ దండి యాత్రలో గాంధీ గారితో కలిసి నడిచిన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లలో ఏకైక తెలుగు వ్యక్తిగా వీరు గుర్తింపు పొందాడు.ఈ యాత్ర 24 రోజుల తరువాత 1930 ఏప్రిల్ 6 న దండి వద్ద ముగిసింది,

అక్కడి నుండి తిరిగి వచ్చి మరల ఆంధ్రాలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గోన్నారు. యలమంచిలి వెంకటప్పయ్య గారితో కలిసి కన్ననూరులో ఒక ఎడాది పాటు కారాగారంలో ఉన్నారు[1].

గాంధీ ఆశ్రమం

మార్చు

మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం 1930 లో మొదలుపెట్టినపుడు, ఆంధ్రలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. దానిలో భాగంగా 1933లో సుబ్రహ్మణ్యం గారు గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.[2] ఈ ఆశ్రమాలు నిరాడంబరత్వానికి ప్రతీకగా,గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉంటూ ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డాయి. ఆశ్రమ జీవనం గడుపుతూ యెర్నేని సుబ్రహ్మణ్యం గారు సాధు సుబ్రహ్మణ్యం గా పిలవబడ్డారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. అతను నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు కూడా 1939లో చేరాడు.[3]

1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది. ఆ ఉద్యమంలో పాల్గోన్నందులకు సుబ్రహ్మణ్యాన్ని రెండు సంవత్సరాలు బళ్ళారి జైల్లో ఉంచారు. ఆసమయంలో పాయిఖానాలు శుభ్రముగా లేవని జైలర్ తో వాదులాడి, పొట్టి శ్రీరాములు. యలమంచిలి వెంకటప్పయ్య, గౌతు లచ్చన్న లతోకలసి వాటిని శుభ్రపరిచారు[1].   

అతను ‘దరిద్ర నారాయణ’ అనే పత్రిక నడిపేవారు. ఆ పత్రికలో పొట్టి శ్రీరాములు గాంధీ సిద్ధాంతంపై రచనలు చేసేవాడు[3].

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం

మార్చు

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు 1951 లో గొల్లపూడి సీతారామశాస్త్రి (స్వామి సీతారాం )గారు కావూరు వినయాశ్రమంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దీంతో ఆంధ్రాలో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు. దీన్ని అంగీకరించని పొట్టి శ్రీరాములు, సుబ్రహ్మణ్యంతో కలసి గుడివాడలో సర్కార్ ఎక్స్ ప్రెసు ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి అంగీకరించని ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ గారు కాంగ్రేస్ వారిని కట్టడి చేసారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యెర్నేని సుబ్రహ్మణ్యంగారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు.

సమాజ సేవలో సాత్విక జీవనం గడిపిన సాధువు యెర్నేని సుబ్రహ్మణ్యం గారు. సర్వోదయ కార్యకర్తగా, వినోభా భావే భూదాన కార్యక్రమంలో పాల్గోన్నారు. వీరు 1974లో పరమపదించారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 యలమంచిలి, వెంకటప్పయ్య (2010). బీద బ్రతుకు స్వీయ చరిత్ర. విజయవాడ: యలమంచిలి వెంకటప్పయ్య సంస్మరణ వేదిక. ప్రచురుణ సంఖ్య-3. pp. 1–75. pp. 50–51.
  2. కాసం, ప్రవీణ్ (2018-03-12). "దండి మార్చ్: గాంధీతో కలిసి నడిచిన తెలుగు వ్యక్తి ఎవరు?". BBC News తెలుగు. Retrieved 2020-07-04.
  3. 3.0 3.1 ivr. "మన కోసం పొట్టి శ్రీరాములు..." telugu.webdunia.com. Retrieved 2020-07-04.