యెహోషువ గ్రంథ రచయుత యెహోషువ. రాయబడిన కాలం క్రీ. పూ. 1406. దీనిలో మోషే స్థానంలో యెహోషువ నాయకత్వం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన గొప్ప విజయం, వారు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న విషయం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు వచ్చిన వాటా భూములు, యెహోషువ తుదిపలుకులు, మొదలగు విషయాలు రాయబడ్డాయి. యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తరువాత, యెహోవా నూను కుమారుడు, మోషే పరిచారకుడైన యెహోషువకు దేవుడు ఈ విధముగా చెప్పాడు - నువ్వు లేచి నువ్వూ, ఈ జనులందరు యోర్థాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇస్తానని చెప్పిన దేశానికి వెళ్ళండి, నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిస్తాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నది వరకు పడమర మహా సముద్రము వరకు మీ సరిహద్దు. దేవుడు యెహోషువాకు ఈ విధముగా సెలవిచ్చెను - "నీవు బ్రదుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడూ నీ యెదుట నిలువ లేరు. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుంటాను. నిన్ను విడువను, యెడబాయను, నిబ్బరము కలిగి దైర్యముగా ఉండుము." నేను వారికి ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాదీనము చేసెదవు.

"https://te.wikipedia.org/w/index.php?title=యెహోషువ&oldid=2883616" నుండి వెలికితీశారు