యేమినేనివారిపాలెం
యేమినేనివారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
మార్చుసమీప గ్రామాలు
మార్చుకావూరు, ఆరుంబాక, చెరుకుపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల కొరకు 5.6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని, 2015 డిసెంబరు 9 న ప్రారంభించారు. భవనంతో పాటు, విశ్రాంత కానిస్టేబుల్ తాతా సూర్యనారాయణరావు బహూకరించిన సరస్వతీదేవి విగ్రహాన్ని గూడా అదే రోజున పాఠశాలలో ప్రతిష్ఠించారు.
పంచాయతీ
మార్చుఇది ఆరుంబాక పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
మార్చుశ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయం
మార్చుఈ ఆలయంలో 2013 నవంబరు 16, శనివారం నాడు, శ్రీ అభయాంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
మార్చు- గత 3 సంవత్సరాలుగా, రు. 50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2015 నవంబరు 24 నుండి 26 వరకు నిర్వహించారు. 26వ తేదీ గురువారం ఉదయం 9-20 గంటలకు విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు.