యోగితా బిహానీ భారతీయ నటి. ఆమె 2018లో ఏక్తా కపూర్ రొమాంటిక్ సోప్ ఒపెరా దిల్ హి తో హైలో పాలక్ శర్మగా టెలివిజన్‌లోకి ప్రవేశించింది.[1]

యోగితా బిహానీ
2019లో యోగితా బిహానీ
జననం (1995-08-07) 1995 ఆగస్టు 7 (వయసు 29)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017 – ప్రస్తుతం
పురస్కారాలుమిస్ ఇండియా రాజస్థాన్ (టాప్ 3)

మే 2023లో విడుదలై విజయవంతమైన ది కేరళ స్టోరీ సినిమాలో ప్రధానపాత్ర పోషించింది.[2]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

యోగిత 1995 ఆగస్ట్ 7న న్యూ ఢిల్లీలో జన్మించింది. ఆమె సుమెర్మల్ జైన్ పబ్లిక్ స్కూల్ నుండి 2012లో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత ఆమె కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది.

కెరీర్

మార్చు

ఆమె ఫరీదాబాద్‌లోని రెడ్‌ఫుడీ స్టార్టప్‌ ఢిల్లీ ఎన్.సీ.ఆర్ లో చేరి 2016 వరకు వివిధ స్థానాల్లో పనిచేసింది.[3]

ఆ తరువాత ఆమె ముంబైకి చేరుకుని ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ కోఆర్డినేటర్‌గా పనిచేసింది. ఆమె 2018 వరకు ట్రిలియోలో మేనేజర్ - సేల్స్ లండ్ ఆపరేషన్స్ గా వ్యవహరించింది.

ఇక గ్లామర్ ప్రపంచంలో ఆమె కెరీర్ 2018లో ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్ 2018లో టాప్ 3 కంటెస్టెంట్స్‌లో ఎంపికైనప్పుడు ప్రారంభమైంది. ఏప్రిల్ 2018లో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన సోనీ టీవీ గేమ్‌షో దస్ కా దమ్ ప్రోమోతో ఆమెకు అతిపెద్ద బ్రేక్ వచ్చింది.[4] దీంతో ఆమె ప్రముఖ సినిమా, టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ దృష్టిలో పడింది. ఆమె సోనీ టీవీలో ఏక్తా కపూర్ ఇండియన్ సోప్ ఒపెరా, దిల్ హాయ్ తోహ్ హైలో పాలక్ శర్మ పాత్రలో నటించింది.[5] అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలలో ఆమె నటించింది. అంతేకాకుండా ఏక్తా కపూర్ అతీంద్రియ ప్రదర్శన కవచ్ లో అతిధి పాత్రలో నటించి మెప్పించింది.[6] ఆమె నెట్‌ఫ్లిక్స్ చిత్రం Ak vs Ak లో కూడా సహాయక పాత్రలో నటించింది.

ఆమె విక్రమ్ వేద (2022 చిత్రం)లో చందా పాత్రలో ఆలరించింది.

మూలాలు

మార్చు
  1. "Yogita Bihani selected to play the lead role in Ekta Kapoor's Dil Hi Toh Hai". Times of India. 15 May 2018. Retrieved 30 June 2018. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "The Kerala Story Exclusive! Yogita Bihani Overwhelmed With Response To The Film: I Wanted To Do My Part..." Zoom TV (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
  3. "Yogita Bihani on her early life and education". Free Press Journal. Retrieved 30 June 2018. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)
  4. "Yogita Bihani on shooting with Salman Khan". Times of India. 30 May 2018. Retrieved 30 June 2018.
  5. "Yogita Bihani will play the lead in 'Dil Hi To Hain' - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). 15 May 2018. Retrieved 2019-09-05.
  6. "Ekta Kapoor's next with Yogita Bihani as lead to go on air soon". Bollywood Life. 29 May 2018.