రంగరాజు కేశవరావు

శ్రీ రంగరాజు కేశవరావు గారు ఇటు ఓరుగల్లు నుండి అటు గోలుకొండ వరకు అట్టుడికించినట్లు ఉడికించిన వీరుడగు సర్వాయొపాపనిగన్న షాహపురమే సంస్కృతాంధ్ర ఫారసీ అరబ్బీ ఉర్దూ భాషలయందు సమానపాండితీ శోభితుడును, సరసకవి చక్రవర్తియు, సంగీతచిత్రలేఖనశిల్పాదిక కళాకుశులుడును, జ్యోతిష్య గణిత శాస్త్ర విద్వాంసుకుడును అగు ఈయన సం.1858 లో కాళయుక్తి జ్యేష్ఠ బహుళ 14 న జన్మించారు. ఈ పండితకవి తన ఫారసీ కవిత్వముచే నవాబు యఖ్బాలుద్దౌను మెప్పించి కవిశిరోమణి బిరుదును పొందునట్లు కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి గారు వారి గోలుకొండ కవుల సంచిక (పుట 379) లో వ్రాసియున్నారు. అందులోనే వీరి జనన మరణ విషయములు ప్రస్తుతించారు.

రంగరాజు కేశవరావు
జననంరంగరాజు కేశవరావు
1858
మరణం1914
ఇతర పేర్లు"శ్రీ రంగరాజు కేశవరావు"
ప్రసిద్ధికవిశిరోమణి

రచనలు మార్చు

(ముద్రితమైనవి)

1. విక్రమాదిత్యము
2. ఇంద్రద్యుమ్నియము
3. రామాభ్యుదయము
4. లీలాపరిణయము
5. కల్కిపురాణము
6. నీలాసుందరీపరిణయము

ఇవేకాక పెక్కు ఫారసీ ఉర్దూ రచనలు వ్రాసినారవి ప్రతాపరెడ్డిగారు తెలిపియునారు. కానీ అవి ముద్రితమైనవో లేవో ఎక్కడ ఉన్నవో తెలియలేదు. ఇంద్రద్యుమ్నియములో వీరి భాషా కోవిదము, ఫారసీ ఉర్దూ భాషా ప్రావీణ్యత, గణిత, సంగీతశాస్త్ర, చిత్రలేఖన నైపుణ్యత తెలియుచున్నది. ఈ పుస్తకములో అనేక లఘుకృతులు ఉన్నాయి. ఇందులో కృష్ణారాధికానాయకా మకుటముతో 25 పద్యములున్నవి. ఉదాహరణకు:

కుకవుల్నీ దయ గానలేక సతత
క్రూరావనీ పాలక
ప్రకరంబు న్వినుతించి యల్పతర దు
ర్ద్రవ్యార్జనా బుద్ధి నం
తక భృత్యవ్రజ హుంక్రియాభయదపం 
ధానారక క్షోణినా
సకలాఘౌఘమల భుజింపుదురు కృ
ష్ణా రాధికా నాయకా!!

ఇందులో కొన్ని గద్యములందు వారు సంగీత కవిత్వ విద్యాధౌడని చెప్పుకొనియున్నారు. అనేక సంకీర్తనలు, కృతులు, మంగళహారతులు, మేలుకొలుపులు, మున్నగునవి వ్రాసి వానికి రాగతాళము లిచ్చియున్నారు. ఒక పుటపై సప్తతాళ ప్రస్తారముల పట్టికను, ఆయాసంకేతపదములకు వివరణములను ఇచ్చియున్నారు.

కేశవరావు గారు సంస్కృతము న కూడా గొప్ప పండితు కవులు. వారు సంస్కృతమున యేయే కృతులు రచించిరో తెలియదుగానీ ఈపుస్తకము నందే వివిధ శీర్షికలలో వివిధ చంధస్సులలో వారు రచించిన 122 శ్లోకములు ఉన్నాయి. వీరు గొప్ప వైష్ణవ భక్తులగుట వారి కవిత్వమంతయు భగవల్లీలకును, భక్తి ప్రపత్తులకును వినియోగించిరి.

వీరి పలు రచనలలో అంకగణితము, క్షేత్ర గణితము సంబంధించిన లెక్కలు ఉన్నాయి. ఆయా లెక్కలకు సమస్యలనిచ్చి వాటి పరిష్కరణలను కూడా తెలిపిరి.

వీరు వాలి సుగ్రీవుడు యుద్ధమును కలముతో గీసిఉన్నారు.రామలక్ష్మణులు వెనుకనుండి వారి యుధ్దమును చూచుచూనట్లు, రాముడు వాలిపై బాణమును సంధించునట్లు చిత్రమున ఉంది.

వీరు సా.శ. 1914 సం.లో పరమపదించారు.

మూలాలు మార్చు

ఆధారాలు మార్చు

  • గోలుకొండ కవుల సంచిక (పుట 379)