జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల, విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహస్థితిలో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.హస్తసాముద్రికము, గోచారము, నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.

చిలక జ్యోతిష్యం
అరచేతిలో ఉన్న రేఖల ఆధారంగా జ్యోతిష్యం చెప్పుట

పురాణాలలో జ్యోతిష్యం

మార్చు
  • శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించినట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి.
  • కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు ఆకాశవాణి ముందుగానే వినిపించింది.
  • శిశుపాలుని మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు భారతంలో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
  • ఐదుగురు మహావీరులు ఒకే నక్షత్రంలో పుడతారని, వారిలో మొదటిసారిగా ఎవరు ఎవరిని సంహరిస్తారో, మిగిలిన ముగ్గురు అతని చేతిలోనే మరణిస్తారని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ ఐదుగురు మహావీరులు ఎవరంటే భీముడు, ధుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. అందుకే గాంధారి తన కుమారుడు దుర్యోధనుడిని దీర్ఘాయుష్కుని చేయటానికి, అతని శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి శక్తివంతమైన మూలికా ఔషధాన్ని అతనికి రాస్తున్నప్పుడు, దానిని చెడగొట్టడానికే, పనిగట్టుకుని మరీ శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, దుర్యోధనుడిని ఆయుఃక్షీణుడిని చేసాడనే విషయం కూడా లోక విదితమే
  • త్రిజటా స్వప్నవృత్తాంతములో శ్రీ రాముడు రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు త్రిజట వాల్మీకి పలికించడం స్వప్నాధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.
  • అనేక పురాణాలలో జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధించిన శాస్త్రీయాంశాలు పేర్కొనబడినవి. గరుడ మహా పురాణం జ్యోతిష్య శాస్త్రాన్ని   (పూర్వఖండము లోని 59 నుండి 67 అధ్యాయములవరకు గల)  తొమ్మిది అధ్యాయాలలో వివరించింది. వీటిలో సాముద్రిక శాస్త్రమును గురించి 64,65 అధ్యాయాలు రెండింటిలో విశదీకరించింది.

జానపదుల జోస్యం

మార్చు
  • చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మొదలైనవి జానపదుల జోస్యాలు.
  • బాలసంతు వారు శైవులు.తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు.

ప్రశ్నా శాస్త్రం

మార్చు

జ్యోతిష శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రశ్నా శాస్త్ర సంబంధిత విషయాలు శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో లభ్యమవుతాయి. కనుక ఈ శాస్త్రం ఆతి పురాతన కాలం నుండి ప్రాచుర్యం పొంది ఉంది. ప్రశ్నఅడగడం అన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న విషయమే. అనేక రూపాలలో ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళున్నా జ్యోతిష శాస్త్ర పండితులు అతి జాగరూకతతో గణించి చెప్పే సమాధానాలు విశ్వసించ దగినవి. ప్రశ్నా శాస్త్రానికి సమాధానం చెప్పాలంటే సాధారణంగా జాతక చక్రాన్ని చూసి చెప్పే కంటే విశేష పాండిత్యం అవసరమౌతుంది. పురాణాలలో ప్రశ్నా శాస్త్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పృచ్ఛకుడు ఎలా ఉండాలి, ఏ సమయంలో ప్రశ్న అడగాలి. ఎలాంటి ప్రదేశంలో అడగాలి మొదలైన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే ప్రశ్నను చెప్పే పండితుడు ఎలా చెప్పాలి అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రస్తావించబడిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.

  • ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభ్రమైన వస్త్రధారణ చేసి ఉండాలి. శ్వేతవస్త్రధారణ మరింత శ్రేష్టం.
  • ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు మంచి మనసు కలవాడై ఉండాలి.
  • ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభసమయంలో సమాధానం చెప్పాలి.
  • చెప్పే జ్యోతిష పండితుడు తలంటుకున్న సమయంలో, దుఃఖితుడై ఉన్న సమయంలో, వికలమై మనస్సు కల్లోలితమైన సమయంలో, తల విరబోసుకున్న సమయంలో, bhuumi
  • మీద నిలబడి ఉన్న సమయంలో సమాధానం చెప్పకూడదు. అలాంటి సమయంలో పండితుడిని ప్రశ్న అడగకూడదు. ఆ పరిస్థితిలో చెప్పే సమాధానం అశుభాన్ని కలిగిస్తుంది.
  • ప్రశ్న అడిగే ప్రదేశం పట్టి ఫలితాలు ఉంటాయి. పూలున్న ప్రదేశం, వృక్షములు ఉన్న ప్రదేశం, పచ్చిక మైదానాలు, నదీతీరాలు, సరస్సు తీరాలు, చక్కగా లక్ష్మీకళుట్టిపడుతున్న భవనాలలో చెప్పే సమాధానం

శుభఫలితాలు ఇస్తాయి.

  • ప్రశ్న అడుగు పృచ్ఛకుడు శ్మశానం, కబేళా (మాంసవిక్రయ శాల), కారాగారం, నడి రోడ్డు, బురదగల ప్రదేశం, పాడుబడిన కట్టడాలు, పాడుబడిన గృహములు, ఎలుకలు కలుగులు, పాము కన్నాలు, పురుగులు ఉన్నప్రదేశంలో అడిగిన అశుభఫలితాలు కలుగుతాయి.
  • దండహస్తులు (చేత కర్రలు పట్టుకున్న వాళ్ళు), కాషాయ వస్త్ర ధారులు, తల అంటుకున్న వాళ్ళు, జాతి భ్రష్టులు, నపుంసకులు, స్త్రీలు, సంకెళ్ళు తాళ్ళు పట్టుకున్న వాళ్ళు, తాడి పండ్లు చేత పట్టున్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఫలితం భయంకరం ఫలితాలను ఇస్తుంది.
  • సంధ్యా సమయం, మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నానికి ముందు సమయం, రాత్రి వేళలు అడిగిన అశుభ ఫలితం ఇస్తుంది. ఉత్తర దిక్కు, ఈశాన్య మూల, తూర్పు దిక్కున నిలిచి అడిన శుభ ఫలితం ఇస్తుంది.

ప్రశ్నాశాస్త్రంలో 1నుండి249 మధ్య ఒక అంకెను పృచ్ఛకుడుని అదిగి ఆ అంకెకు సంబంధించిన సబ్ ఆధారముగా ఫలమును చెప్పు విధానము ఉత్తమమైనది

సాయన, నిర్ణయ సిద్ధాంతాలు

మార్చు

రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్య రేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు (Vernal Equinox) అని అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధ్రువాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది (Precession of the Equinoxes).

దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం (Tropical Zodiac). దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు.

అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంతవిషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిర బిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉంది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి.

గోచారము

మార్చు

గోచారము అంటే గోళాల యొక్క సంచారం ఆధారంగా జోస్యం చెప్పడం. చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో కనిపిస్తుంది. చంద్రుడు సమీపలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి వాటిని రాసులుగా గుర్తించారు. దీని ఆధారంగా చంద్రుని సమీపంలో ఉన్న నక్షత్రరాసిని జాతకుని రాశిగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒకరాశినుండి ఇకంకొక రాశి మారటానిని సంక్రమణ లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసిలో ప్రవేశిస్తాడు. సంవత్సరాకాలంలో 12 రాసులలో సంచరిస్తాడు. తమిళులు తమ సంవత్సరాన్ని సూర్య సంచారాన్ని అనుసరించి గణిస్తారు. సుర్యుడు మేషంలో ప్రవేశించే రోజు వారికి నూతన సంవత్సర ఆరంభం అవుతుంది. సూరుడు మకరరాశిలో ప్రవేశించినపుడు హిందువులు పెద్ద పండుగగా ఆచరించే సంక్రాంతి పండుగ పర్వదినం. సంక్రాంతిని మకర సంక్రాంతి అనే పేరుతో కూడా పిలవడం హిందువుల అలవాటు. ఒక సంవత్సర కాలంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలైన గ్రహాలు ఛాయా గ్రహాలుగా జ్యోతిష్యశాస్త్రాలలో పిలవబడే రాహువు, కేతువు యొక్క సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. ఇవి కాక తెలుగు, మలయాళ జ్యోతిష్కులు శని గ్రహ ఊపగ్రహాలలో పెద్దదైన మాందిని శని పుత్రునిగా వ్యహరిస్తూ గణనలోకి తీసుకుంటారు. తమిళ జ్యోతిష్యంలో మాంది గణనలోకి తీసుకొనే ఆచారం లేదు. గ్రహాలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసే కాలాన్ని 12 రోజులుగా విభజించి జ్యోతిష్య గణన చేస్తారు. వీటి ఆధారంగా గోచార ఫలితాలు ఉంటాయి.

రాశులు నక్షత్ర పాదాలు

మార్చు

సాధారణంగా ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి.ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.

రాశి నక్షత్రపాదాలు దినారంభంలో లగ్నం
మేషరాశి అశ్విని 1,2,3,4 పాదాలు భరణి 1,2,3,4 పాదాలు కృత్తిక 1 పాదం మేష సంక్రాంతి నుండి వృషభ సంక్రాంతి వరకు మేషలగ్నం
వృషభరాశి కృత్తిక 2,3,4 పాదాలు రోహిణి 1,2,3,4 పాదాలు మృగశిర 1,2 పాదాలు వృషభ సంక్రాంతి నుండి మిధున సంక్రాంతి వరకు వృషభ లగ్నం
మిథునరాశి మృగశిర 3,4 పాదాలు ఆరుద్ర 1,2,3,4 పాదాలు పునర్వసు 1,2,3 మిధున సంక్రాంతి నుండి కటక సంక్రంతి వరకు మిధిన లగ్నం
కర్కాటకరాశి పునర్వసు 4వ పాదం పుష్యమి 1,2,3,4 పాదాలు ఆశ్లేష 1,2,3,4 పాదాలు కటక సంక్రాంతి నుండి సింహ సంక్రాంతి వరకు కటక లగ్నం
సింహరాశి మఖ 1,2,3,4 పాదాలు పూర్వఫల్గుణి 1,2,3,4 పాదాలు ఉత్తర ఫల్గుణి 1 పాదం సింహ సంక్రాంతి నుండి కన్యా సంక్రాంతి వరకు సింహ లగ్నం
కన్యారాశి ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు హస్త 1,2,3,4 పాదాలు చిత్త 1,2 పాదాలు కన్యా సంక్రాంతి నుండి తులా సంక్రాంతి వరకు కన్యా లగ్నం
తులారాశి చిత్త 3,4 పాదాలు స్వాతి 1,2,3,4 పాదాలు విశాఖ 1,2,3 పాదాలు తులా సంక్రాంతి నుండి వృశ్చిక సంక్రాంతి వరకు తులా లగ్నం
వృశ్చికం విశాఖ 4వ పాదం అనూరాధ 1,2,3,4 పాదాలు జ్యేష్ట 1,2,3,4 పాదాలు వృశ్చిక సంక్రాంతి నుండి ధనస్సు సంక్రాంతి వరకు వృశ్చిక లగ్నం
ధనూరాశి మూల 1,2,3,4 పాదాలు పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు ఉత్తరాషాఢ 1 పాదం ధనస్సు సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు ధనుర్లగ్నం
మకరరాశి ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు శ్రవణం 1,2,3,4 పాదాలు ధనిష్ఠ 1,2 పాదాలు మకర సంక్రాంతి నుండి కుంభ సంక్రాంతి వరకు మకర లగ్నం
కుంభరాశి ధనిష్ఠ 3,4 పాదాలు శతభిష 1,2,3,4 పాదాలు పూర్వాభద్ర 1,2,3, పాదాలు కుంభ సంక్రాంతి నుండి మీన సంక్రాంతి వరకు కుంభలగ్నం
మీనరాశి పూర్వాభద్ర 4వ పాదం ఉత్తరాబాధ్ర 1,2,3,4 పాదాలు రేవతి 1,2,3,4 పాదాలు మీన సంక్రాంతి నుండి మేష సంక్రాంతి వరకు మీన లగ్నం

జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను మూడు గణాలుగా విభజిస్తారు. ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, రేవతి అను తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వబాధ్ర, కృత్తిక, ఉత్తరాబాధ్ర అను తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు. ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ఠ, శతభిషం (శతతార) అనే తొమ్మిది నక్షత్రాలు రాక్షస గణ నక్షత్రాలు.

నక్షత్రాలు-అధిదేవతలు-వర్ణం-రత్నం

మార్చు
నక్షత్రం అధిదేవత వర్ణం రత్నం నామం గణం జంతువు నాడి దిక్కు వృక్షం గ్రహం
అశ్వని అర్ధనారీశ్వరుడు పసుపు వైడూర్యం చూ, చే, చో, ల దేవగణం గుర్రం ఆది నైఋతి అడ్డరస కేతువు
భరణి రవి ఆకాశనీలం వజ్రం లీ, లూ, లే, లో మానవగణం ఏనుగు మధ్య దేవదారు శుక్రుడు
కృత్తిక అగ్ని కావి మాణిక్యం ఆ, ఈ, ఊ, ఏ రాక్షసగణం మేక అంత్య ఔదంబర సూర్యుడు
రోహిణి చంద్రుడు తెలుపు ముత్యం ఒ, వా, వృ, వో మానవగణం పాము అంత్య జంబు చంద్రుడు
మృగశిర దుర్గ ఎరుపు పగడం వే, వో, కా, కి దేవగణం పాము మధ్య చంఢ్ర కుజుడు
ఆరుద్ర కాళి ఎరుపు గోమేధికం కూ,ఖం(ఘ),జ్ఞ(బ),చ మానవగణం కుక్క ఆది రేల రాహువు
పునర్వసు రాముడు పసుపు పుష్పరాగం కే, కో, హా, హీ దేవగణం పిల్లి ఆది వెదురు గురువు
పుష్యమి దక్షిణామూర్తి పసుపు, ఎరుపు నీలం హూ, హే, హో, డా దేవగణం మేక మధ్య పిప్పిలి శని
ఆశ్లేష చక్రత్తాళ్వార్ కావి మరకతం డి, డూ, డె, డొ రాక్షసగణం పిల్లి అంత్య నాగకేసరి బుధుడు
మఖ ఇంద్రుడు లేతపచ్చ వైడూర్యం మా, మి, మూ, మే రాక్షసగణం ఎలుక అంత్య మర్రి కేతువు
పూర్వఫల్గుణి రుద్రుడు శ్వేతపట్టు పచ్చ మో, టా, టి, టూ మానవగణం ఎలుక మధ్య మోదుగ శుక్రుడు
ఉత్తరఫల్గుణి బృహస్పతి లేతపచ్చ మాణిక్యం టే, టో, పా, పీ మానవగణం గోవు ఆది జువ్వి సూర్యుడు
హస్త అయ్యప్ప ముదురునీలం ముత్యం పూ, ష, ణ, డ దేవగణం దున్న ఆద కుంకుడు చంద్రుడు
చిత్త విశ్వకర్మ ఎరుపు పగడం పే, పో, రా, రీ రాక్షసగణం పులి మధ్య తాటి కుజుడు
స్వాతి వాయువు తెలుపు గోమేధికం రూ, రే, రో, త దేవగణం దున్న అంత్య మద్ది రాహువు
విశాఖ నక్షత్రము మురుగన్ పచ్చ పుష్పరాగం తీ, తూ, తే, తో రాక్షసగణం పులి అంత్య నాగకేసరి గురువు
అనూరాధ మహాలక్ష్మి పసుపు నీలం నా, నీ, నూ, నే దేవగణం లేడి మధ్య పొగడ శని
జ్యేష్ట ఇంద్రుడు శ్వేతపట్టు మరకతం నో, యా, యీ, యూ రాక్షసగణం లేడి ఆది విష్టి బుధుడు
మూల నిరుతి ముదురుపచ్చ వైడూర్యం యే, యో, బా, బీ రాక్షసగణం కుక్క ఆది వేగిస కేతువు
పూర్వాషాఢ వరుణుడు బూడిద వజ్రం బూ, దా, థా, ఢా మానవగణం కోతి మధ్య నెమ్మి శుక్రుడు
ఉత్తరాషాఢ గణపతి తెలుపు మాణిక్యం బే, బో, జా, జీ మానవగణం ముంగిస అంత్య పనస రవి
శ్రవణా మహావిష్ణు కావి ముత్తు ఖీ, ఖూ, ఖే, ఖో దేవగణం కోతి అంత్య జిల్లేడు చంద్రుడు
ధనిష్ఠ చిత్రగుప్తుడు పసుపుపట్టు పగడం గా, గీ, గూ, గే రాక్షసగణం గుర్రం మధ్య జమ్మి కుజుడు
శతభిష భద్రకాళి కాఫి గోమేదికం గో, సా, సీ, సూ రాక్షసగణం గుర్రం ఆది అరటి రాహువు
పూర్వాబాధ్ర కుబేరుడు ముదురుపసుపు పూస సే, సో, దా, దీ మానవగణం సింహం ఆది మామిడి గురువు
ఉత్తరాబాధ్ర కామధేను గులాబి నల్లపూస దు, శం, ఛా, దా మానవగణం గోవు మధ్య వేప శని
రేవతి అయ్యప్ప ముదురునీలం ముత్యం దే, దో, చా, చీ దేవగణం ఏనుగు అంత్య విప్ప బుధుడు

గోచార ఫలదర్శన చక్రం

మార్చు
స్థానం రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుకృడు శని రాహువు కేతువు
1 స్థానచలనం సౌజన్యం దు॰ఖం బంధనం గమనం ఆరోగ్యం విపత్తు భయం భయం
2 భయం వ్యయం వ్యయం లాభం ధనలాభం భాగ్యం హాని కలహం విరోధం
3 సంపత్తు లాభం లాభం వ్యయం విపత్తు సౌభాగ్యం సంపద సౌఖ్యం సుఖం
4 మానభంగం హాని రిపుభయం శుభం వ్యయం సుఖం రోగం మానహాని మానహాని
5 భయం కార్యనాశం రిపుభయం సంపద పుత్రలాభం సుతక్షయం ధనవ్యయం క్లేశం
6 రిపుహాని శుభం ధనలాభం భూషణం దు॰ఖం వ్యయం సంపద సుఖం సంతోషం
7 దేహపీడ లాభం కలహం వ్యసనం ఆరోగ్యం క్లేశం రాజాగ్రహం భయం భీతి
8 రోగం వ్యయం భయం సంతోషం హాని భయం దు॰ఖం మృత్యువు హాని
9 భయం వ్యాకులం వ్యయం దు॰ఖం ధనాగమం ధనలాభం రోగం సంతానం కలహం
10 లాభం లాభం చలనం శుభం హాని సౌఖ్యం జాడ్యం కలహం విరోధం
11 ఆరోగ్యం శుభం లాభం సుఖం సంతోషం సౌఖ్యం లాభం లాభం ధనాగమం
12 వ్యయం దు॰ఖం రోగం వ్యయం పీడ లాభం క్లేశం హాని హాని

మహర్ధశ అంతర్ధశ

మార్చు
గ్రహం రవి

సం-నె-రో

చంద్రుడు

సం-నె-రో

కుజుడు

సం-నె-రో

రాహువు

సం-నె-రో

గురువు

సం-నె-రో

శని

సం-నె-రో

బుధుడు

సం-నె-రో

కేతువు

సం-నె-రో

శుకృడు

సం-నె-రో

మహర్దశాకాలం
1.రవి 0-3-18 0-6-0 0-4-6 0-10-24 0-9-18 0-11-12 0-0-6 0-4-6 1-0-0 6 సంవత్సరాలు
2.చంద్రుడు 0-6-0 0-10-0 0-7-0 1-6-0 1-4-0 1-7-0 1-5-0 0-7-0 1-8-0 10 సంవత్సరాలు
3.కుజుడు 0-4-6 0-7-0 0-4-27 1-0-18 0-11-6 1-1-9 0-11-27 0-4-27 1-2-0 7 సంవత్సరాలు
4.రాహువు 0-10-24 1-6-0 1-0-18 2-8-12 2-4-24 2-10-6 2-6-18 1-0-18 3-0-0 18 సంవత్సరాలు
5.గురువు 0-9-18 1-4-0 0-11-6 2-4-24 2-1-18 2-6-12 2-3-6 0-11-6 2-8-0 16 సంవత్సరాలు
6.శని 0-11-12 1-7-0 1-1-9 2-10-6 2-6-12 3-0-3 2-8-9 1-1-9 3-2-0 19 సంవత్సరాలు
7.బుధుడు 0-10-6 1-5-6 0-11-27 2-6-18 2-3-6 2-8-9 2-4-27 0-11-27 2-10-0 17 సంవత్సరాలు
8.కేతువు 0-4-6 0-7-0 0-4-27 1-0-18 0-11-6 1-1-9 0-11-27 0-4-27 1-2-0 7 సంవత్సరాలు
9.శుకృడు 1-0-0 1-8-0 1-2-0 3-0-0 2-8-0 3-2-0 2-10-0 1-2-0 3-4-0 20 సంవత్సరాలు

గ్రహాలు మిత్రులు శత్రువులు సములు

మార్చు
గ్రహం మిత్రుడు శత్రువు సముడు
రవి చంద్రుడు, కుజుడు, గురువు శని, శుకృడు బుధుడు
చంద్రుడు రవి, బుధుడు శత్రువులు లేరు మిగిలిన వారు సములు
కుజుడు గురువు, చంద్రుడు, రవి బుధుడు శుక్రుడు, శని
బుధుడు శుకృడు, రవి చంద్రుడు కుజుడు, గురువు, శని
గురువు కుజుడు, చంద్రుడు బుధ, శుకృడు రవి, శని
శుకృడు శని, బుధుడు రవి, చంద్రుడు కుజుడు, గురువు
శని శుకృడు, బుధుడు రవి, చంద్రుడు, కుజుడు గురువు
రాహువు శని, శుకృడు రవి, చంద్రుడు, కుజుడు గురువు, బుధుడు
కేతువు రవి, చంద్రుడు, కుజుడు శని, శుకృడు బుధుడు, గురువు

కొన్ని వివరాలు

మార్చు
  • దశ వర్గులు రాశి, హోర, ద్రేక్కాణ, సప్తమాంశ, నవాంశా, దశాంశ, షోడాంశ, త్రిశాంశ అన్న పది విధానాలు రాశిచక్ర నిర్మాణ విధములు.

115.113.220.51 20:58, 2014 డిసెంబరు 9 (UTC) anand

జన్మలగ్నము

మార్చు

భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు. లగ్నము ప్రదేశములకు అనుగుణముగా మారుతుంటుంది.

ఛాయాగ్రహాలు

మార్చు

జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా గ్రహాలు. వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి. రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రహాలు ప్రయాణకాలం సమమే. రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు కేతువుకు మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.

గ్రహస్థితి బలాబలాలు

మార్చు

జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు, లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మద్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి. రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.

గ్రహావస్థలు

మార్చు

గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.

  1. స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
  2. దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
  3. ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
  4. శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
  5. శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
  6. పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
  7. దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
  8. వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
  9. ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
  10. భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.

ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు. సూర్యునికి పదకొండు, పన్నెండు స్థానాలలో ఉన్న గ్రహాన్ని అత్యంత శీఘ్రగతిన ఉన్న గ్రహం అంటారు.

సమాధానాలు

మార్చు

జ్యోతిషం సూర్య కేంద్రక సిద్దాంతప్రకారము చెప్పబడినదే. భూమి, సూర్యునిచుట్టూ తిరగడం వలన ఏర్పడేమార్పులు జ్యోతిషశాస్త్రం స్పష్టంగా వివరిస్తున్నది. జీవులు భూమి మీద బ్రతుకుతున్నాయి కానీ సూర్యుని మీద కాదు. అందుకే భూమిని కేంద్రంగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అంతరార్థం కలిగిన విషయము. జ్యోతిష శాస్త్రజ్ఞానం కచ్చితంగా అవసరం.

రాహుకేతువులు భూకక్ష్య, సూర్యకక్ష్యల ఖండనబిందువులు. అందుకే జన్మకుండలిలో అవి ఎదురెదురుగా ఉంటాయి. అందుకే వాటిని ఛాయాగ్రహాలు అంటున్నాము.

హేతువాదులు వారి సిద్దాంతాన్ని అనుసరించి, దేవుదు లేడు అని నమ్ముతూ ఉంటారు. వారికి జ్యోతిషం గురించి అనవసరం.

శాస్త్రవేత్తలు చాలావిషయాలు తెలుసుకొంటున్నారు. జ్యోతిషం గురించి కూడా తెలుసుకొంటారు.

జ్యోతిష్యం విమర్శకుల ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తుంది.

సంక్రాంతి కాల నిర్ణయం సంక్రాంతి సందేహ నివారణ

శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: । శ్రాద్ధాదీషు పరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ తిథి కౌస్తుభం

శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాది: కాల ఉచ్యతే । దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ సిద్ధాంత రహస్యం

నిత్య నైమిత్తిక కర్మలకు, వ్రతములకు, పండుగలకు, శ్రాద కర్మలకు తిథిని నిర్ణయించుట యందు దృక్ కలపకుండా పూర్వ పద్ధతి ప్రాకారమే (మహర్షి ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్ధతి, సంప్రదాయ పద్ధతి ప్రకారమే) ఆచరించవలయును.

గ్రహణాదులయందు, జాతక ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, సిద్ధాంత గ్రంధములు, మన పూర్వీకులు తెలియపరచిరి.

సంక్రాంతి పండుగను పూర్వ పద్ధతి ప్రకారమే ఆచరించుట సర్వదా శ్రేయోదాయకము.

పూర్వ పద్ధతి ప్రకారము సూర్యుడు 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు. సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.

ధర్మ శాస్త్ర నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి ఆచరించవలయును.

జ్యోతిష్కులు

మార్చు

ఇతర గ్రంథాలు

మార్చు

వాడవల్లి నాగ మురళీకృష్ణ, జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1, 2, 3, 4, ఈమాట, 2008 మార్చి, https://web.archive.org/web/20171029215607/http://eemaata.com/em/issues/200803/1212.html

ఇవి కూడా చూడండి

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=జ్యోతిషం&oldid=4100016" నుండి వెలికితీశారు