రంజనాలు (అద్దకపు రంగులు) అనగా దారము, వస్త్రములపై తమ రంగును ఆపాదించగల రంగు పదార్థాలు. ఈ రంగులు కాంతి వల్ల గాని, నీటి వల్లగాని, సబ్బులు, కల్మషహారుల వల్లగానీ తమ రంగును కోల్పోవు. పూర్వము వృక్ష, జంతు సంబంధమైన రంగులను అద్దకమునకు వాడేవారు. నీలిమందు అనే నీలము రంగు అద్దకాన్ని ఇండిగో మొక్కల నుండి సేకరించేవారు. టర్కీ ఎరుపు అద్దకాన్ని మేడర్ మొక్క వేళ్ళ నుండి, ఊదారంగు అద్దకాన్ని నత్తల నుండి సేకరించేవారు. విలియం హెన్రీ పెర్కిన్ అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త తన 18 వయేట మెట్టమొదటి సారిగా 1856 సంవత్సరంలో కృత్రిమ రంజనాన్ని తయారుచేసాడు. ఈ అద్దకపు రంగు అతని పేర పెర్కిన్ఠ ఊదా రంగు లేక మావ్ గా పిలువబడుతుంది. ఆ తర్వాత అనేక కృత్రిమ రంగులు తయారుచేయబడ్డాయి.. ఇట్టివానిలో మావ్ రంగు, మర్షియస్ పసుపు, మిథైల్ నారింజ రంగు, ఎనిలీన్ పసుపు రంగు మొదలైనవి ఉన్నాయి.

కానర్ ప్రైరీ లివింగ్ హిస్టరీ మ్యూజియంలో అమెరికన్ సంప్రదాయంలో రంగు వేసిన తర్వాత ఎండబెట్టిన నూలు

రంజనాల నిర్మాణ లక్షణాలు

మార్చు
 
1482 లో ఉన్ని వస్త్రంపై అద్దకం వేయుట.

రంజనాలు అణు నిర్మాణములో ఒక క్రోమోఫోర్ (రంగును కలిగించే) సమూహం, ఒక ఆక్సోక్రోమ్ (రంగు తీవ్రతను పెంచే) సమూహము ఉంటాయి.-NO2, -NO3, -N=N-, C=O, C=S లు కొన్ని ముఖ్యమైన క్రోమోఫోర్ లకు ఉదాహరణలు. అలాగే -OH, -COOH, -SO3H, -NH2, NHR, NR2లు కొన్ని ముఖ్యమైన ఆక్సోక్రోం లు. ఆక్సోక్రోం రెండు విధులను నిర్వర్తిస్తుంది. 1. రంజనము యొక్క రంగు తీవ్రతను పెంచును. 2. దారముతో రసాయన బంధం యేర్పరచుకొని దారానికి రంజనాన్ని అతికించి యుంచును

రంజనాలు రకాలు

మార్చు

రంజనాలను క్రోమేఫోర్ ల ఆధారంగా నైట్రో రంజనాలు, నైట్రోసో రంజనాలు, ఎజో రంజనాలు, క్వినోన్ రంజనాలు మొదలగు రకాలుగా విభజించవచ్చు. అంతే కాకుండా రంజనాలు చేయు పద్ధతునననుసరించి వీటిని ఆమ్ల రంజనాలు, క్షార రంజనాలు, ప్రత్యక్ష రంజనాలు, వర్ణ స్థిరీకరణి రంజనాలు, వాట్ రంజనాలు మొదలగు రకాలుగా విభజించవచ్చు.
ఆమ్ల మాధ్యమంలో దారానికి అద్దకము చేసే రంజనాలను ఆమ్ల రంజనాలు అంటారు. క్షార మాధ్యమంలో దారానికి అద్దకము చేసే రంజనాలను క్షార రంజనాలు అంటారు. తటస్థ మాధ్యమంలో అద్దకము చేయగల రంజనాలను ప్రత్యక్ష రంజనాలు అంటారు.
కొన్ని రంజనాలు ద్రావణంలో కరిగి యుండి, కొన్ని లోహ లవణాల (వర్ణస్థిరీకరణి) తో చర్య పొంది తక్షణమే ఆ ద్రావణ రంజనాల (అవక్షేపము) నేర్పరచును. వీటిని వర్ణస్థిరీకరణ రంజనాలు అంటారు.
ముందుగా దారాన్ని రంజనపు ద్రావణంలో నాన బెట్టి తర్వాత వర్ణ స్థిరీకరణిని కలుపుతారు. ఏర్పడే ఆ ద్రావణీయ రంజనం దారముపైన అతుక్కుని దారానికి రంగునిస్తుంది. పూర్వ కాలంలో అద్దకము పెద్ద పెద్ద తొట్టెలలో చేసేవారు. అందుచేత కొన్ని రంజకాలను వ్యాట్ రంజకాలు లేక తొట్టే రంజకాలు అంటారు. ఈ వ్యాట్ ద్రావణ స్థితిలో రంజనాలను దారానికి పట్టించి గాలిలో ఎండపెడతారు. రంజనము గాలిలోని ఆక్సిజన్ వర్య వలన ఆక్సీకరణము పొంది ఆ ద్రావణీయ రంజనము దారముపై పీత నేర్పరచును.

సహజమైన రంగులు తయారు చేయండి

మార్చు

కృత్రిమమైన రంగులు చర్మానికి హాని కలిగిస్తాయి. అందువలన ఈ రంగుల్ని ప్రకృతిలో లభించే వస్తువుల నుండి తయారుచేయండం మంచిది.

  • కాషాయ రంగు కోసం మోదుగ పూలు నీళ్లలో వేసి ఉడికించాలి.
  • వంగపండు రంగు కోసం బీట్ రూట్ తురిమి నీళ్ళలో ఉడికించాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=రంజనాలు&oldid=4095006" నుండి వెలికితీశారు