రఘువంశ్ ప్రసాద్ సింగ్

రఘువంశ్ ప్రసాద్ సింగ్ ( 1946 జూన్ 6 - 2020 సెప్టెంబరు 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్‌లోని వైశాలి నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై యూపీఎ - 1 ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోగ్రామీణాభివృద్ధి శాఖ, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[1]

రఘువంశ్ ప్రసాద్ సింగ్
రఘువంశ్ ప్రసాద్ సింగ్

రఘువంశ్ ప్రసాద్ సింగ్


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1996–2014
ముందు శివ శరన్ సింగ్
తరువాత రామా కిషోర్ సింగ్
నియోజకవర్గం వైశాలి

వ్యక్తిగత వివరాలు

జననం (1946-06-06)1946 జూన్ 6
వైశాలి జిల్లా, బీహార్, భారతదేశం
మరణం 2020 సెప్టెంబరు 13(2020-09-13) (వయసు 74)
న్యూఢిల్లీ,
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
జీవిత భాగస్వామి కిరణ్ సింగ్
సంతానం 2 కుమారులు, 1 కుమార్తె
నివాసం పాట్నా

రాజకీయ జీవితం మార్చు

  • కార్యదర్శి, సంయుక్త సోషలిస్ట్ పార్టీ (SSP), సీతామర్హి జిల్లా (1973 – 77)
  • బీహార్ శాసనసభ్యుడు (1977 – 90)
  • రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యుత్, బీహార్ ప్రభుత్వం (1977 – 79)
  • లోక్ దళ్ అధ్యక్షుడు, సీతామర్హి జిల్లా (1980 – 85)
  • బీహార్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (1990)
  • బీహార్ శాసనమండలి డిప్యూటీ లీడర్ (1991 – 94)
  • బీహార్ శాసనమండలి సభ్యుడు (1991 – 95)
  • బీహార్ శాసనమండలి చైర్మన్ (1994 – 95)
  • బీహార్ రాష్ట్ర ఇంధనం, ఉపశమనం, పునరావాసం, అధికార భాషల శాఖ మంత్రి (1995 – 96)
  • 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (1996)
  • కేంద్ర రాష్ట్ర మంత్రి, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ (స్వతంత్ర బాధ్యత) (1996 – 97)
  • కేంద్ర రాష్ట్ర మంత్రి, ఆహారం & వినియోగదారుల వ్యవహారాల (స్వతంత్ర బాధ్యత) (1997 – 98)
  • 12వ లోక్‌సభకు 2వ సారి ఎన్నికయ్యాడు (1998)
  • 13వ లోక్‌సభకు 3వ సారి ఎన్నికయ్యాడు (1999)
  • రాష్ట్రీయ జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ నాయకుడు (1999 – 2000)
  • 14వ లోక్‌సభకు 4వ సారి ఎన్నికయ్యాడు (2004)
  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి (2004 – 09)
  • వైస్ ప్రెసిడెంట్, పార్లమెంటరీ ఫోరమ్ ఆన్ వాటర్ కన్జర్వేషన్ & మేనేజ్‌మెంట్
  • 15వ లోక్‌సభకు 5వ సారి ఎన్నికయ్యాడు (2009)

మరణం మార్చు

రఘువంశ్‌ ప్రసాద్‌ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2020 సెప్టెంబరు 13న మరణించాడు.[2][3]

మూలాలు మార్చు

  1. Lok Sabha (2022). "Raghuvansh Prasad Singh". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  2. "రఘువంశ్‌ ప్రసాద్‌ కన్నుమూత". 13 September 2020. Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  3. TV9 Telugu (13 September 2020). "మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)