రఘు తాత
రఘు తాత 2024లో తమిళంలో విడుదలైన పొలిటికల్ క్రైమ్ కామెడీ సినిమా. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్, ఎం.ఎస్. భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, జయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 15 ఆగస్టు 2024న థియేటర్లలో విడుదలై, సెప్టెంబర్ 13 నుండి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1][2]
కథ
మార్చుకయళ్ పాండియన్ (కీర్తి సురేశ్) మద్రాసు సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటుంది. కథలు కూడా రాస్తుంటుంది. ముఖ్యంగా మాతృ భాషా ప్రేమికురాలు. అలానే పెళ్లి వ్యతిరేకి కూడా. కానీ తాతయ్య క్యాన్సర్ బారిన పడటంతో అతడి చివరి కోరిక మేరకు తమిళ్ సెల్వన్ (రవీంద్ర విజయ్) తో పెళ్లికి సిద్ధపడుతుంది.
కానీ నిశ్చితార్థం తర్వాత సెల్వన్ నిజస్వరూపం గురించి పాండియన్‌కు తెలుస్తుంది. దీంతో పెళ్లి రద్దు చేసుకునేందుకు సిద్ధపడుతుంది. సెల్వన్‌తో తన పెళ్లి జరగకుండా ఉండేందుకు కయల్ ఏం చేసింది? హిందీ ని ద్వేషించే కయల్ ఆ బాషను ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటుంది? హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన రఘోత్తమన్ తన మనవరాలే హిందీ పరీక్ష రాసిందని తెలుసుకుని ఏమయ్యాడు? అసలు సెల్వన్ గురించి పాండియన్ తెలుసుకున్న వాస్తవమేంటి? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- కీర్తి సురేష్[4]
- ఎం.ఎస్. భాస్కర్
- రవీంద్ర విజయ్
- దేవదర్శిని
- జయకుమార్
- ఆనంద్సామి
- రాజీవ్ రవీంద్రనాథన్
- రాజేష్ బాలచంద్రన్
- అధిర పాండిలక్ష్మి
- జానకి
- చు ఖోయ్ షెంగ్
- కె.ఎస్ మిప్పు
- ముఖేష్
- మనోజ్ కుమార్ కలైవానన్
- ఇస్మత్ బాను
మూలాలు
మార్చు- ↑ Eenadu (13 September 2024). "రివ్యూ: రఘుతాత.. కీర్తి సురేశ్ మూవీ నవ్వులు పంచిందా?". Retrieved 25 October 2024.
- ↑ "తెలుగులో కీర్తి సురేష్ 'రఘు తాత'... ఈ వారమే ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?". 9 September 2024. Retrieved 25 October 2024.
- ↑ Sakshi (29 September 2024). "'రఘు తాత' మూవీ రివ్యూ". Retrieved 25 October 2024.
- ↑ NT News (10 September 2024). "నమ్మిన దానికోసం నిలబడే ధీశాలి". Retrieved 25 October 2024.