రణధీర్ సుధ్, భారతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడాంటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైజెస్టివ్ అండ్ హెపటోబిలియరీ సైన్సెస్ చైర్మన్. భారతదేశంలో గ్యాస్ట్రో ఇన్టెస్టినల్ ఆంకాలజీ పితామహులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు.[1] ఆయన న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో మాజీ కో-చైర్మన్‌గా పని చేశారు.[2]

రణధీర్ సుద్
జననంభారతదేశం
వృత్తిగ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
ప్రసిద్ధిగ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ
పురస్కారాలుపద్మశ్రీ

సుధ్ 1977లో అమృత్‌సర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి వైద్య శాస్త్రంలో పట్టా (ఎంబీబీఎస్) పొందారు. 1979లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.[2] పని చేస్తున్నప్పుడే 1981లో ఎమ్‌డీ పొందడానికి AIIMSలో తన అధ్యయనాలను కొనసాగించారు. 1983లో గ్యాస్ట్రోఎంటరాలజీలో డి.ఎం. పూర్తి చేశారు. 1985 వరకు AIIMSలో పనిచేసి, 25 సంవత్సరాలు సర్ గంగా రామ్ హాస్పిటల్, ఢిల్లీలో పనిచేసి, 2010లో మెడాంటాకు వెళ్లారు. ఈ మధ్యలో, 1999లో హార్వార్డ్ మెడికల్ స్కూల్, బోస్టన్, టెక్సాస్‌లోని గాల్వెస్టన్‌లోని టెక్సాస్ యూనివర్శిటీ మెడికల్ బ్రాంచ్ (UTMB), అలబామా విశ్వవిద్యాలయం, బర్మింగ్హామ్‌లలో అతిథి ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. ఆయన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యొక్క గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పరీక్షల కోసం పరీక్షకుడిగా కూడా ఉన్నారు. వైద్య రంగానికి చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2008లో ఆయనకు దేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[3]

మూలాలు

మార్చు
  1. "Dr Randhir Sud".
  2. 2.0 2.1 "Doc exodus paralyses Ganga Ram Hospital". India Today. 25 January 2010. Retrieved 23 January 2016.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.